గొట్టమిండ్లు
Jump to navigation
Jump to search
గొట్టమిండ్లు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.
గొట్టమిండ్లు | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°34′13.87″N 79°6′34.27″E / 15.5705194°N 79.1095194°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | బేస్తవారిపేట |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08406 ) |
పిన్‌కోడ్ | 523 346 |
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల
[మార్చు]శ్రీ బూదాల నాజీర్ సురేష్ బాబు
[మార్చు]- ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ బూదాల నాజీర్ సురేష్ బాబు, విద్యార్థులకు విన్నూత శైలిలో విద్యాబోధన చేస్తున్నారు. వీరు 2014 సంవత్సరంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి చేతులమీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. తరువాత వీరు, విశాఖపట్నంలోని మదర్ థెరెస్సా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అందజేసే, "గురుబ్రహ్మ" పురస్కారానికి ఎంపికైనారు. వీరికి ఈ పురస్కారాన్ని, 2014, నవంబరు-2న, హైదరాబాదులోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రదానం చేసెదరు.
- వీరిని 2015వ సంవత్సరంలో, ఉగాది సందర్భంగా, గుంటూరులోని "ది స్టార్ సొసైటీ ఆఫ్ ట్రాఫిక్ అవేర్ నెస్ అండ్ రీసెర్చ్" అను సంస్థ వారు, "ఆంధ్రా స్టార్" అను పురస్కారానికి ఎంపిక చేసారు. వీరికి ఈ పురస్కారాన్ని, 2015, మార్చి-21వ తేదీనాడు, ఉగాదిరోజున, గుంటూరులో అందజేసినారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ కోట సత్యమాంబ ఆలయం:- గొట్టమిండ్లు గ్రామ సమీపంలోని శ్రీ కోట సత్యమాంబాదేవికి, 2014, జూన్-8, ఆదివారం నాడు విశేషపూజలు నిర్వహించారు. కుంకుమార్చనలు. అభిషేకాలు నిర్వహించారు. కుంకుమ బండ్లు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. దూరప్రాంతాలనుండి భక్తులు అధికసంఖ్యలో తరలి రావడంతో, ఆలయం క్రిక్కిరిసినది.