బేస్తవారిపేట
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°33′04″N 79°06′00″E / 15.5511°N 79.1°ECoordinates: 15°33′04″N 79°06′00″E / 15.5511°N 79.1°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | బేస్తవారిపేట మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 2.22 కి.మీ2 (0.86 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 7,606 |
• సాంద్రత | 3,400/కి.మీ2 (8,900/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1002 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 8406 ![]() |
పిన్(PIN) | 523334 ![]() |
బేస్తవారిపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామం.[2], మండలం. పిన్ కోడ్:523 334., ఎస్.టి.డి.కోడ్:08406.
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
సోమవారిపేట[మార్చు]
సమీప మండలాలు[మార్చు]
ఉత్తరాన కంభం మండలం, తూర్పున తర్లుపాడు మండలం, పశ్చిమాన రాచర్ల మండలం, పశ్చిమాన అర్ధవీడు మండలం.
మండలంలోని పట్టణాలు[మార్చు]
బేస్తవారిపేట.
గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]
- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, కొత్తపేట.
- ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల.
- కస్తూర్బా పాఠశాల.
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం[మార్చు]
బ్యాంకులు[మార్చు]
- ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు.
- భారతీయ స్టేట్ బ్యాంకు.
- విజయ బ్యాంకు.
- కొటక్ మహీంద్రా బ్యాంకు.
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి దూదేకుల రసూల్ బీ, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీమతి మట్టా వరలక్ష్మి ఎన్నికైనారు. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]
- త్రిలోక పుణ్యక్షేత్రం:- ఈ ఆలయంలో కారీకపౌర్ణమి సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. [3]
- శ్రీ లలితాంబికా అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలోని అమ్మవారి జన్మదినం సందర్భంగా, 2017, మార్చి-12వతేదీ, ఫాల్గుణ పౌర్ణమి, ఆదివారం, హోలీపండుగనాడు, ఆలయంలో వేడపండితులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. మూల విరాట్టుకు క్షీరాభిషేకం, విష్ణ చక్రార్చన నిర్వహించారు. శివునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, మహిళలు కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవారినీ దర్శించుకుని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [9]
- శ్రీ అంబమల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, కార్తీకమాసాన్ని పురస్కరించుకొని. 2014, నవంబరు-9, ఆదివారం నాడు, వనభోజనాలు ఏర్పాటుచేసారు. భక్తులు స్వామివారికి విశేషపూజలు చేసారు. అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం క్రిక్కిరిసిపోయింది. [4]
- శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయం:- స్థానిక బి.సి.కాలనీలో ఉన్న ఈ ఆలయంలో, అమ్మవారి జయంతిని పురస్కరించుకుని, 2017, జూలై-23వదేదీ ఆదివారంనాడు, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. [11]
- శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం:- స్థానిక రాణీపేట లోని ఈ ఆలయ వార్షికోత్సవం, 2016, ఫిబ్రవరి-20, శనివారంనాడు నిర్వహించెదరు. ఈ కార్యక్రమంలో స్వామివారికి అర్చనలు, అభిషేకాలు ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పన నిర్వహించెదరు. [8]
- శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం:- స్థానిక తేరు బజారు లోని ఈ ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు 2017, జూన్-8వతేదీ గురువారం నుండి ప్రారంభించారు. 8న గణపతిపూజ, విష్ణుసహస్రనామ పారాయణ, అభిషేకం, జలాధివాసం, హనుమాన్‌చాలీసా పారాయణం, నవగ్రహ ఆరాధన, నిర్వహించారు. 9వతేదీ శుక్రవారంనాడు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. 10వతేదీ శనివారంనాడు వేదమంత్రోచ్ఛారణల మధ్య యంత్ర, ధ్వజ ప్రాణ ప్రతిష్ఠను వైభవంగా నిర్వహించారు. కళాన్యాసం, పూర్ణాహుతి తదితర పూజలు నిర్వహించారు. భక్తులు ధ్వజస్తంభం పునాదుల వద్ద నవధాన్యాలు, పంచలోహాలు సమర్పించారు. ఈ ధ్వజస్తంభ దాత శ్రీ సన్నిధి శ్రీనివాసులు. అనంతరం స్వామి, అమ్మవారల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధికసంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతం క్రిక్కిరిసిపోయింది. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [10]
- శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక పోలేరమ్మ అమ్మవారికి, 2015, మార్చి-21వ తేదీనాడు, ఉగాది సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుఝామున, 108 బిందెలతో అభిషేకం, కలశాలతో అమ్మవారికి గ్రామోత్సవం, సాయంత్రం కోలాటం, కులుకు భజన మొదలైఐన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. [5]
- శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- స్థానిక దర్గా రహదారిలోని ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు మూడురోజులపాటు, వైభవంగా నిర్వహించెదరు. [6]
- శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- బేస్తవారిపేట దర్గా కొండపై వెలసిన ఈ ఆలయంలో, 2015, ఆగస్టు-25వ తేదీనాడు, ఆలయ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యాహ్నం, భక్తులకు అన్నదానం నిర్వహించారు. [7]
- శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక దర్గా కొండపై ఉంది.
- శ్రీ కాశీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక చిన్నకంభం వెళ్ళే దారిలో ఉంది.
- దత్తాత్రేయ ఆశ్రమం, దత్తకొండ.
- శ్రీ భావనాఋషి ఆలయం.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
[2] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-3; 5వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014, నవంబరు-6; 4వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2014, నవంబరు-10; 4వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015, మార్చి-22; 4వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2015, మే-13; 5వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2015, ఆగస్టు-25; 5వపేజీ. [8] ఈనాడు ప్రకాశం; 2016, ఫిబ్రవరి-20; 4వపేజీ. [9] ఈనాడు ప్రకాశం; 2017, మార్చి-13; 5వపేజీ. [10] ఈనాడు ప్రకాశం; 2017, జూన్-5,10&11; 4వపేజీ. [11] ఈనాడు ప్రకాశం; 2017, జూలై-23; 4వపేజీ.