పిట్టికాయగుళ్ల
పిట్టికాయగుళ్ల | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°28′55″N 79°07′52″E / 15.482°N 79.131°ECoordinates: 15°28′55″N 79°07′52″E / 15.482°N 79.131°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | బేస్తవారిపేట మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,403 హె. (8,409 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 6,197 |
• సాంద్రత | 180/కి.మీ2 (470/చ. మై.) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08406 ![]() |
పిన్(PIN) | 523346 ![]() |
పిట్టికాయగుళ్ల, ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523 346. ఎస్.టి.డి. కోడ్: 08406.
విషయ సూచిక
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
బసినెపల్లి 4 కి.మీ, సలకలవీడు 6 కి.మీ, పూసలపాడు 6 కి.మీ, పందిల్లపల్లి 6 కి.మీ, నేకనాంబాదు 7 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
ఉత్తరాన కంభం మండలం, పడమరన రాచర్ల మండలం, ఉత్తరాన తర్లుపాడు మండలం, పడమరన గిద్దలూరు మండలం.
గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]
ఈ పాఠశాలలో 1986-87 విద్యా సంవత్సరంలో పదవ చదివిన విద్యార్థుల సమ్మేళనాన్ని, 2017, మార్చి-26వతేదీ ఆదివారంనాడు నిర్వహించారు. పూర్వ విద్యార్థులు ఒకరికొకరు తమ అనుభూతులను పంచుకున్నారు. ఈ సందర్భంగా అప్పటి వారి ఉపాధ్యాయులు గూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. [5]
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల[మార్చు]
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
త్రాగునీటి సౌకర్యం[మార్చు]
ప్రభుత్వం తలపెట్టిన ఎన్.టి.ఆర్. సుజలస్రవంతి పథకంలో భాగంగా, శ్రీ ఎన్.ఆర్.ఐ.వి.వి.రెడ్డి విరాళంగా అందజేసిన ఐదు లక్షల రూపాయల్తో, గ్రామంలో,2015, మార్చి-9వ తేదీ సోమవారం నాడు, నూతనంగా ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాన్ని ప్రారంభించారు. [4]
బ్యాంకులు[మార్చు]
భారతీయ స్టేట్ బ్యంక్.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]
పెద్ద చెరువు.
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ వి.సత్యనారాయణరెడ్డి, 279 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ కోదండరామాలయం[మార్చు]
ఈ ఆలయంలో 2014, మే-31, శనివారం నుండి, ఐదు రోజులపాటు నిర్వహించే స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలో భాగంగా, శనివారం నాడు స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆరోజున స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. రాత్రికి స్వామివారికి ఊరేగింపు నిర్వహించారు. 3వ తేదీన రథోత్సవం, 4వ తేదీన వసంతోత్సవం నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [3]
శ్రీ పిటికేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]
శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]
గ్రామములోని ఈ ఆలయంలో, 2017, జూన్-12వతేదీ సోమవారం నుండి నుండి 14వతేదీ బుధవారం వరకు, శ్రీ విఘ్నేశ్వరస్వామి మరియు కాశినాయనస్వామివారల విగ్రహప్రతిష్ఠ పూజలు నిర్వహించారు. 12న అంకురారోపణం, అగ్ని మథనం, అగ్నిప్రతిష్ఠ, వాస్తుహోమం, ప్రధాన కలశ స్థాపనం, జలాధివాసం, 13న మండప దేవతా పూజలు, దీక్షా హోమాలు, మహాస్నపనం, యంత్రాభిషేకాలు, గ్రామోత్సవం నిర్వహించారు. 14న యంత్ర, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ, పూర్ణాహుతి నిర్వహించారు. మద్యాహ్నం 12 గంటల నుండి, విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. రాత్రికి పాటకచేరీ నిర్వహించారు. గ్రామస్థులు విద్యుత్తు ప్రభను ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. [6]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 6,197 - పురుషుల సంఖ్య 3,176 - స్త్రీల సంఖ్య 3,021 - గృహాల సంఖ్య 1,438
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,355.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,762, మహిళల సంఖ్య 2,593, గ్రామంలో నివాస గృహాలు 1,192 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,403 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
[2] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-2; 12వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-1; 4వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015, మార్చి-10; 4వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2017, మార్చి-27; 4వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-12&15; 4వపేజీ.