పూసలపాడు (బెస్తవారిపేట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూసలపాడు
—  రెవిన్యూ గ్రామం  —
పూసలపాడు is located in Andhra Pradesh
పూసలపాడు
పూసలపాడు
అక్షాంశరేఖాంశాలు: 15°30′03″N 79°05′49″E / 15.500902°N 79.096984°E / 15.500902; 79.096984
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం బేస్తవారిపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,466
 - పురుషుల సంఖ్య 2,852
 - స్త్రీల సంఖ్య 2,614
 - గృహాల సంఖ్య 1,402
పిన్ కోడ్ 523334
ఎస్.టి.డి కోడ్ 08406

పూసలపాడు, ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్:523 334. ఎస్.టి.డి.కోడ్:08406.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ గ్రామం బెస్తవారిపేట నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

సోమిదేవిపల్లి 3 కి.మీ, మోక్షగుండం 4 కి.మీ, పిట్టికాయగుళ్ల 6 కి.మీ, నేకనాంబాదు 7 కి.మీ, దర్గా 8 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన కంభం మండలం, పడమరన రాచర్ల మండలం, పడమరన గిద్దలూరు మండలం, దక్షణాన కొమరోలు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. రవితేజ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బి.ఇ.డి).
  2. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  3. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
  4. అక్షయ సెంట్రల్ స్కూల్.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ex grama panchayath president వెంకటరెడ్డి.prastuta garmapanyath president srimu
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి శ్రీరాం నాగరత్నం, సర్పంచిగా ఎన్నికైనారు. [7]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమికి శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తారు. [4]

శ్రీ చెన్నకేశవస్వామి వారి ఆలయం[మార్చు]

శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం[మార్చు]

శ్రీ పెద్దమ్మ దేవస్థానం[మార్చు]

ఈ గ్రామములో నూతనంగా శ్రీ పెద్దమ్మ దేవస్థానం నిర్మాణం పూర్తయినది. 2014,మార్చి-5, బుధవారం నుండి విగ్రహ ప్రతిష్ఠాపూజలు ప్రారంభం అయినవి. 6,7,8 తేదీలలో అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, 8వ తేదీన యంత్ర, విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. [3]

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

పూసలపాడు బస్సుస్టాండువద్ద, నూతనంగా నిర్మించిన ఈ ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, ఆలయంలో ప్రతిష్ఠించనున్న స్వామివారి విగ్రహానికి, 2015,జూన్-6వ తేదీ శనివారంనాడు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. గణపతి, విగ్రహపూజలు, జలాధివాసం, సుందరకాండ పారాయణం, పుష్పాధివాసం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. మద్యాహ్నం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. 7వ తేదీ ఆదివారంనాడు, వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య, శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిష్ఠా హోమాలు, కళాన్యాసం, యంత్రప్రతిష్ఠ, మహోదర కుంభం తదితర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. రాత్రికి బ్రహ్మం గారి నాటకం ప్రదర్శించారు. [6]

ఈ ఆలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2017,జూన్-7వతేదీ బుధవారంనాడు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణాధిపతిపూజ, అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామములో ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసినారు. [8]

శ్రీ మడియాలస్వామివారి ఆలయం[మార్చు]

పూసలపాడులో మడియాలస్వామి తిరునాళ్ళు, 2014, జూలై-6, ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. భక్తులు బోనాలు, కుంకుమబండ్లు కట్టినారు. గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం బస్సుస్టాండు సమీపంలోని ఆలయం వద్ద స్వామికి విశేషపూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకాలు, అభిషేకాలు కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. [5]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 5,466 - పురుషుల సంఖ్య 2,852 - స్త్రీల సంఖ్య 2,614 - గృహాల సంఖ్య 1,402

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,794.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,009, మహిళల సంఖ్య 2,785, గ్రామంలో నివాస గృహాలు 1,269 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,512 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[3] ఈనాడు ప్రకాశం; 2014,మార్చి-9; 5వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2014,ఏప్రిల్-11; 5వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2014,జులై-7; 4వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2015,జూన్-8; 4వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2015,ఆగస్టు-30; 9వపేజీ. [8] ఈనాడు ప్రకాశం; 2017,జూన్-8; 4వపేజీ.