గొడే
స్వరూపం
గొడే వారు విశాఖపట్నం ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన జమిందారీ వంశం.
వీరిలో ప్రముఖులు
[మార్చు]- గొడే జగ్గారావు : వీరు విశాఖపట్నంలో కోదండ రామాలయం ప్రతిష్టించారు. వీరి కుమార్తె మదిన సుభద్రయ్యమ్మ ప్రముఖ రచయిత్రి.
- గొడే సూర్యప్రకాశరావు
- గొడే సూర్యనారాయణరావు
- గొడే వెంకట జగ్గారావు : వీరు విశాఖపట్నంలో నక్షత్రశాలను స్థాపించారు. వీరి కుమార్తెను అంకితం వెంకట నరసింగరావు గారు వివాహం చేసుకున్నారు.
- గోడే నారాయణ గజపతిరావు : వీరు ఆంధ్ర వైద్య కళాశాల స్థాపన కొరకు స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. వీరి కుమార్తె కురుపాం జమిందారు వైరిచర్ల వీరభద్ర రాజును వివాహం చేసుకున్నారు.
- గొడే జానకమ్మ