అక్షాంశ రేఖాంశాలు: 21°11′50″N 79°2′15″E / 21.19722°N 79.03750°E / 21.19722; 79.03750

గొరెవాడ సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొరెవాడ సరస్సు
Entrance to Gorewada Rescue Centre
గొరెవాడ ప్రవేశ ద్వారం
Location of Gorewada lake within Maharashtra
Location of Gorewada lake within Maharashtra
గొరెవాడ సరస్సు
ప్రదేశంనాగపూర్, మహారాష్ట్ర
అక్షాంశ,రేఖాంశాలు21°11′50″N 79°2′15″E / 21.19722°N 79.03750°E / 21.19722; 79.03750
రకంమంచినీరు
వెలుపలికి ప్రవాహంపిలి నది
ప్రవహించే దేశాలుభారతదేశం
ప్రాంతాలునాగపూర్

గొరెవాడ సరస్సు మహారాష్ట్ర లోని నాగపూర్ నగరానికి వాయువ్య దిశలో ఉంది. ఇది 2,350 అడుగుల పొడవు గల ఆనకట్టతో నిర్మించబడింది.[1]

చరిత్ర

[మార్చు]

1912 లో, గొరెవాడ సరస్సును నాగపూర్ లోని 1.01 లక్షల జనాభాకు ప్రాథమిక తాగునీటి వనరుగా జల వనరుల శాఖ అభివృద్ధి చేసింది. దట్టమైన అడవులతో సరిహద్దుగా ఉన్న గొరెవాడ సరస్సు, దాని పరిసరాలు ఏవియన్ జాతులకు, కొన్ని వన్యప్రాణులకు ఆవాసంగా ఉంది. సరస్సు చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాలలో మహారాష్ట్ర ప్రభుత్వం 1914 హెక్టార్ల సఫారీని అభివృద్ధి చేయడం ప్రారంభించింది.[2]

ప్రత్యేకత

[మార్చు]

కొన్ని వార్తాపత్రికల సమాచారం ప్రకారం, దేశంలో మొట్ట మొదటి నైట్-సఫారీని అక్కడే ప్రారంభించారు. ఈ ప్రతిపాదన చాలా సుదీర్ఘంగా రూపొందించబడింది, 2005 లో మొదటగా ప్రతిపాదించబడితే, 2016 లో ప్రారంభమైంది. చిరుతలు, భారతీయ జింకలు, భారతీయ నెమళ్లు, మరికొన్ని జాతులు అప్పుడప్పుడు ఈ ప్రదేశంలో కనబడతాయి.[1]

భౌగోళికం

[మార్చు]

గొరెవాడ సరస్సు సమీపంలో ఉన్న రహదారిని గొరెవాడ రింగ్ రోడ్డు అని పిలుస్తారు. అనేక పచ్చిక బయళ్లు (ఓపెన్ ఎయిర్) ఈ ప్రాంతంలో ఉన్నాయి. గొరెవాడ సరస్సుకి సమీపంలో జింగాబాయి తక్లీ, బోర్గావ్, గిట్టికాడన్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ సరస్సులో చేపలు పట్టడం, సముద్రపు గవ్వలను సేకరించడం వంటివి తరచుగా జరుగుతాయి.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "GEO". Office of the Collector – Geographical Information. National Informatics Centre, Nagpur. Archived from the original on 2005-02-17. Retrieved 2008-05-19.
  2. ToI article on Gorewada Lake
  3. ToI article on Gorewada Lake