గొల్లకోట బుచ్చిరామశర్మ
గొల్లకోట బుచ్చిరామశర్మ జీవ రసాయన శాస్త్రవేత్త.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఈయన విశాఖ జిల్లా లోని యలమంచిలి గ్రామంలో 1915, ఫిబ్రవరి 20 న జన్మించారు. తండ్రి పేరు జి.జి. సోమయాజులు, బి.ఎస్.సి (ఆనర్స్) చదివిన తర్వాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) లో ఎం.ఎస్.సి. చదివారు. యూనివర్సిటీ ఆఫ్ విన్‌కన్‌సిన్ నుండి పి.హెచ్.డి చేశారు.
ఉద్యోగాలు
[మార్చు]బ్రెట్ అండ్ కంపెనీ వారి రాప్టోకస్ లో బయో కెమిస్ట్ గా (1943) చేరి, ఆ సంస్థ రీసెర్చి కంట్రోలు డివిజన్ కు చీఫ్ గా (1951), స్టాప్ డైరెక్టర్ గా (1954), డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా (1964-72) డైరెక్టరుగా (1972-76) మేనేజింగ్ డైరెక్టరుగా (1981) వివిధ పదవులను నిర్వహించారు. 1949 లో రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిస్ట్రీ వారి ఫెలోషిప్ అందుకుని పరిశోధనలు నిర్వహించారు.
పరిశోధనలు
[మార్చు]డాక్టర్ రామశర్మ జీవరసాయన శాస్త్రము, పౌష్టికాహారం, ఫార్మాన్యూటికల్స్ రంగాలలో ఎంతో విలువైన పరిశోధనలు జరిపారు. 50 కి పైగా ప్రామాణిక పరిశోధకపత్రాలను వెలువరించారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫార్మసీ పత్రికకు అతి ప్రతిభావంతంగా సంపాదకత్వం (1954-76) వహించారు.
ఈయన పరిశోధనా పటిమకు, మేధాసంపత్తికి అనేక గౌరవ మన్ననలు అందాయి. 29 వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ కు (1977) అధ్యక్షత వహించి దేశ సౌభాగ్యానికి మందుల ప్రామాణిక తయారీ ఒక ఆలంబనగా ఉండాలని పిలుపునిచ్చారు. బోంబే కాలేజీ ఆఫ్ ఫార్మసీ గవర్నింగ బాడీకి ఛైర్మన్‌గా (1976) ఉన్నారు. డెవలప్ మెంట్ కౌన్సిల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మొదలగు సంస్థలలో గౌరవ పదవులను నిర్వహించారు. ఐరోపా దేశాలకు, బ్రిటన్, అమెరికా, జపాన్ దేశాలకు పర్యటించిన ఇండియన్ ఫార్మాస్యూటికల్ డెలిగేషన్లకు నేతృత్వం వహించారు. ఇండియన్ ఫార్మా కోపియా కమిటీకి, డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డుకు ఛైర్మన్ గా కొంతకాలం ఉన్నారు. సొసైటీ ఆఫ్ బయోలాజికల్ కెమిస్ట్ కు (1971-73) ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోషియేషానికి ( 1972-74) అధ్యక్షునిగా ఉన్నారు.
గౌరవాలు, సత్కారాలు
[మార్చు]నిర్విరామ పరిశోధకులుగా కీర్తి ప్రతిష్టలు అందుకున్న డాక్టర్ శర్మకు ఆచార్య సర్.పి.సి.రాయ్ మెమోరియల్ గోల్డ్ మెడల్ (1970), ప్రొఫెసర్ ఎం.ఎల్.స్కోప్ మెమోరియల్ అవార్డు (1979), వి.జి.పటేల్ మెమోరియల్ లెక్చర్ షిప్ (1984), ఎం.ఎల్.ఖొరానా మెమోరియల్ లెక్చర్ షిప్ (1986) మొదలగు పలు గౌరవ మన్ననలు అందాయి.
జీవిత చరమాంకంలో విశాఖ లోని లానన్స్ బే కాలనీలో ఉన్నారు.