గోగులపాటి కూర్మనాధ కవి
గోగులపాటి కూర్మనాధ కవి | |
---|---|
జననం | 1720 విజయనగరం జిల్లాలోని రామతీర్థం |
మరణం | 1790 దేవుపల్లి |
వృత్తి | దేవస్థానాలలో ఉద్యోగిగా రామతీర్థం, పద్మనాభం, సింహాచలం, శ్రీకూర్మం లలో పనిచేశారు. |
ప్రసిద్ధి | శ్రీవరాహ నారసింహుని మీద ఆసువుగా శాతకాన్ని రచించారు. |
మతం | హిందూ మతము |
తండ్రి | బుచ్చన్న, |
తల్లి | గౌరమాంబ |
గోగులపాటి కూర్మనాధ కవి సింహాచలం లోని శ్రీవరాహ నారసింహుని మీద ఆసువుగా శాతకాన్ని రచించారు. ఈతడు ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. ఇతని తల్లిదండ్రులు బుచ్చన్న, గౌరమాంబ. వెంకన్న, కామన్న అని ఇద్దరు తమ్ములు. ఈతడు విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో సుమారు 1720 ప్రాంతంలో జన్మించారు. అక్కడ విద్యాభ్యాసము తరువాత, విజయనగర సంస్థానము యొక్క దేవస్థానాలలో ఉద్యోగిగా రామతీర్థం, పద్మనాభం, సింహాచలం, శ్రీకూర్మం లలో పనిచేశారు. చివరి కాలంలో గజపతినగరం తాలూకాలోని దేవుపల్లి గ్రామం (ప్రస్తుతం బొండపల్లి మండలం) లో ఉండేవారు.
ఇతడు మొదటి ఆనందగజపతి మహారాజు వద్ద ఆస్థానకవిగా మృత్యుంజయవిలాసము అనే యక్షగానము, తరువాత సింహాద్రి నారసింహ శతకము, లక్ష్మీనారాయణ సంవాదము, సుందరీమణి శతకము వ్రాసెను.
ఇతడు సుమారు సా.శ.1790 ప్రాంతంలో దేవుపల్లి గ్రామములోనే పరమపదించినట్లు చారిత్రకులూహించుచున్నారు. అడిదం సూరకవి, చట్రాతి లక్ష్మీనృసింహకవి ఇతని సమకాలికులు.
మూలాలు
[మార్చు]- శ్రీ సింహాద్రి నారసింహ శతకము: శ్రీ గోగులపాటి కూర్మనాధకవి విరచితము, శ్రీ సింహాచల దేవస్థానము, సింహాచలం.