గోదారంగనాయకస్వామి దేవాలయం
గోదారంగనాయకస్వామి దేవాలయం | |
---|---|
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | పెద్దపల్లి జిల్లా |
ప్రదేశం: | తొగర్రాయి, సుల్తానాబాద్ మండలం |
గోదారంగనాయకస్వామి దేవాలయం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండలం, తొగర్రాయి గ్రామంలో ఉన్న దేవాలయం. 15వందల సంవత్సరాలక్రితం కాకతీయులు నిర్మించిన ఈ దేవాలయ ప్రాంగణంలో గోదాదేవి సమేత రంగనాథస్వామి, శివకేశవులు కొలువుతీరారు.[1]
చరిత్ర
[మార్చు]తొగర్రాయి గ్రామ శివారులో గుండిబండ (పెద్ద బండ) ఉంది. 15వందల ఏళ్ళ కిందట కాకతీయులు ఈ బండమీద గోదాదేవి సమేత రంగనాథస్వామి, శివకేశవులకు ఆలయాలు నిర్మించారని చరిత్రను బట్టి తెలుస్తుంది. కాకతీయుల పాలన ముగిసిన తరువాత, మహ్మదీయుల పాలన వచ్చింది. వారు చేసిన దాడిలో ఈ రెండు దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి.
కొంతకాలం తరువాత ఈ ప్రాంతం పెద్దపల్లి సంస్థానాధీశుల పాలన కిందికి వచ్చింది. వారు పసుపుకుంకుమల కింద గుమ్మడికాయల పాడు,జారుబండపల్లె అనే గ్రామాలను ఒద్దిరాజులకు ఇచ్చారని, వారు ఈ దేవాలయాల్ని పునర్నిర్మించడంతోపాటు వాటి బాగోగులు చూసేవారని తెలుస్తుంది. గుమ్మడికాయలపాడు వాసులు గ్రామం నుండి కొంతదూరం వెళ్లి రాళ్లతో కూడిన ప్రాంతంలో మరో గ్రామాన్ని నిర్మించుకున్నారు. అయితే ఆ గ్రామానికి మొత్తం నాపరాయి, పలుగురాళ్లతో కూడిన తొవ్వ (దారి) ఉండడంతో ఆ గ్రామానికి తొగర్రాయి అని పేరు వచ్చింది.[2]
గుడి నిర్మాణం
[మార్చు]దాడి కారణంగా శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాలను ప్రభుత్వ దేవాదాయ ధర్మదాయ శాఖ తన ఆధీనంలోకి తీసుకొని ఆధునీకరించింది.
ఉత్సవాలు
[మార్చు]ప్రతి సంవత్సరం గోదారంగనాయకుల కళ్యాణంతో పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతాయి. ఈ ఉత్సవాలకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి అనేక సంఖ్యలో ప్రజలు వచ్చి పాల్గొంటుంటారు. ఈ ప్రదేశంలో బతుకమ్మ, సమ్మక్క సారక్క పండుగలను కూడా జరుపుకుంటారు.
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ ఆదివారం సంచిక (27 January 2019). "వెయ్యేళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం". Archived from the original on 20 March 2019. Retrieved 20 March 2019.
- ↑ వి6 వెలుగు, లైఫ్ (8వ పేజీ) (19 March 2019). "తొగర్రాయిలో గుడిబండ". Archived from the original on 21 March 2019. Retrieved 21 March 2019.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)