గోద్రేజ్ గ్రూప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోద్రేజ్ స్థాపకులు అర్దేషీర్ - పిరోజ్‌షా గోద్రెజ్ స్టాంప్ పైన ఉన్న ఇద్దరి ఫోటోలు.

గోద్రేజ్ గ్రూప్ (Godrej Group) 1897 సంవత్సరంలో అర్దేషిర్ గోద్రెజ్, పిరోజ్షా బుర్జోర్జీ గోద్రెజ్ స్థాపించిన లీవర్ టెక్నాలజీతో తాళాలను భారతదేశంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి కంపెనీ. సంస్థ ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర లో ఉంది. భారతదేశం లో మొదటి స్వదేశీ టైప్ రైటర్ ను ఉత్పత్తి చేసిన మొదటి సంస్థ. శతాబ్దం పైగా చరిత్ర ఉన్న గోద్రెజ్ అభివృద్ధి ఇప్పటికి చెందుతోంది. గోద్రెజ్ సంస్థ నుండి గృహోపకరణాలు, ఏరోస్పేస్, ఫర్నిచర్ లు, కన్స్యూమర్ గూడ్స్, అగ్రికల్చర్ మొదలైనవాటిలో వ్యాపార నిర్వహిస్తున్నది.[1] గోద్రేజ్ సంస్థ స్థాపన జరిగి శతా బ్దం ( వంద సంవత్సరాలు ) సందర్భంగా భారత ప్రభుత్వం తపాలా శాఖ వారు గౌరవ సూచకంగా పోస్టల్ స్టాంప్ ను 11 జులై 1998 రోజు విడుదల చేశారు.[2]

గోద్రేజ్ గ్రూప్
Typeప్రైవేట్
పరిశ్రమConglomerate
స్థాపన1897; 127 సంవత్సరాల క్రితం (1897)[3]
Founders
ప్రధాన కార్యాలయంముంబై, మహారాష్ట్ర, భారతదేశం
Areas served
ప్రపంచ వ్యాప్తం
Key people
ఆది గోద్రెజ్ (చైర్మన్)[4]
Products
RevenueIncrease US$4.1 billion (2015)[5]
Number of employees
28,000 (2016)
Subsidiaries
Websitewww.godrej.com Edit this on Wikidata

చరిత్ర

[మార్చు]

గోద్రేజ్ కంపెనీ 1897 సంవత్సరంలో స్థాపన జరిగి తన వ్యాపార రంగములో పురోగతిని సాధించింది. కంపెనీ వ్యాపారాలలో గోద్రెజ్ ఇండస్ట్రీస్ హోల్డింగ్ కంపెనీలలో ఒకటి. స్వంత వ్యాపారాలు కెమికల్స్ ఎస్టేట్ మేనేజ్ మెంట్,ఫైనాన్స్ & ఇన్వెస్ట్ మెంట్ లను కలిగి ఉంటాయి. దీని రసాయన విభాగం సేంద్రియ పదార్థాల నుండి పొందిన విస్తృత శ్రేణి ఒలియోకెమికల్ ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ చేస్తుంది. కెమికల్స్ డివిజన్ కింద ప్రొడక్ట్ పోర్ట్ ఫోలియోలో ఫ్యాటీ ఆల్కహాల్స్ ఫ్యాటీ యాసిడ్స్ సర్ఫాక్టెంట్స్ గ్లిజరిన్, స్పెషాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ఉత్పత్తులను గృహ, వ్యక్తిగత సంరక్షణ ఫార్మాస్యూటికల్, ఆహార పరిశ్రమలలో ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు. రసాయన విభాగం గుజరాత్ లోని వాలియా, మహారాష్ట్రలోని అంబర్ నాథ్ లో ఉన్నాయి.గోద్రేజ్ ఇండస్ట్రీస్ (జిఐఎల్) 18 దేశాలలో సబ్సిడరీ, అసోసియేట్ కంపెనీల ద్వారా కన్స్యూమర్ గూడ్స్ ,రియల్ ఎస్టేట్, అగ్రికల్చర్,వస్త్రాల రంగం రిటైల్ లో ఉంది.[6]

ఉత్పత్తులు

[మార్చు]

గోద్రెజ్ సంస్థ ద్వారా 1918 సంవత్సరంలో, జంతువుల కొవ్వు లేకుండా తయారు చేయబడిన ప్రపంచంలో మొట్టమొదటి సబ్బు అయిన చావిని ప్రారంభించింది. గోద్రెజ్ 1923 సంవత్సరంలో ఫర్నిచర్ ఉత్పత్తులను ప్రారంభించింది. 1952సంవత్సరంలో, ఈ సంస్థ 'సింథాల్' సబ్బు ఉత్పత్తి పేరును ప్రారంభించింది. ఈ సంస్థ 2005 సంవత్సరంలో గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్ అనే ఎఫ్ ఎమ్ సిజి ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చక్కటి ఆహారాలకు భారతదేశం అగ్రగామి రిటైల్ గమ్యస్థానంసంస్థ ఉత్పత్తులను ప్రారంభించింది. గోద్రేజ్ గ్రూపు విజన్ మరింత ఉపాధి కల్పించదగిన శ్రామిక శక్తిని సృష్టించడం, గ్రీనర్ ఇండియాను నిర్మించడం ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా నెం.1 కంపెనీగా ఉండాలని కోరుకుంటుంది. 2014 సంవత్సరంలో, గోద్రెజ్ అంగారక గ్రహానికి భారతదేశం మొదటి మిషన్ పై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది. గోద్రెజ్ సంస్థ కంపెనీ ఆదాయం 2019 సంవత్సరంలో 12,151 కోట్ల వరకు ఉన్నది. కంపెనీ తన ఉత్పత్తులు, సేవలను ప్రపంచ స్థాయి నాణ్యతతో సరసమైన ధరలకు అందిస్తోంది.[7]

విస్తరణ

[మార్చు]

గోద్రేజ్, నాదిర్, జంషైడ్ లతో కలిసి, ఈ గ్రూపులో ఇతర కంపెనీ విలీనాలు, అనేక అంతర్జాతీయ బ్రాండ్ లతో జాయింట్ వెంచర్లు (Joint Ventures) ఏర్పాటు చేశారు. గోద్రెజ్ 1994లో ట్రాన్స్లెక్ట్రా డొమెస్టిక్ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేసింది, ఈ బ్రాండ్ అప్పట్లో గుడ్ నైట్ బ్రాండ్ క్రింద మస్కిటో మ్యాట్ దోమల నుంచి సంరక్షణ కొరకు వినియోగదారులు వాడటం జరుగుతుంది . ఈ సమూహం తరువాత బనిష్, జెట్, హెక్సిట్, ఈజీ వంటి ప్రసిద్ధ బ్రాండ్లను కొనుగోలు చేసింది. 2001సంవత్సరంలో హిందుస్తాన్ లీవర్ లిమిటెడ్ నుండి జంతు దాణా వ్యాపారాన్ని కొనుగోలు చేసింది, తరువాత హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ గా పేరు మార్చబడింది. 2005 సంవత్సరంలో, ఈ సమూహం తన మొట్టమొదటి గ్లోబల్ అక్విజిషన్—బ్రిటన్ దేశ కీలైన్ బ్రాండ్స్ లిమిటెడ్—జోర్డాన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా వంటి ప్రదేశాలలో క్యూటికురా, ఎరాస్మిక్, నులోన్ వంటి అనేక అంతర్జాతీయ బ్రాండ్లు, ట్రేడ్ మార్క్ కు యాజమాన్యాన్ని ఇవ్వడం జరిగింది. 2010లో, గోద్రెజ్ ఆసియా, ఆఫ్రికా , దక్షిణ అమెరికా మూడు ఖండాల్లో వ్యక్తిగత వాష్, హెయిర్ కేర్, క్రిమిసంహారక మందుల మార్కెట్ ను దృష్టి పెట్టి తన 3x3 వ్యూహాన్ని ఆవిష్కరణ చేసింది.

గోద్రెజ్ నేచర్ బాస్కెట్ లోగో

గోద్రేజ్ గ్రూప్ సంస్థ అంతర్జాతీయ కంపెనీలు విలీనం , భాగస్వామ్యంతో ఉన్నాయి వాటిలో కాస్మోటికా నాసియోనల్, చిలీ కంపెనీ, సాఫ్ట్ అండ్ జెంటిల్, 2012 లో బ్రిటన్ లో కాల్గేట్-పాల్మోలివ్ కంపెనీ నుండి మహిళలు ఉపయోగించే . డియోడరెంట్ బ్రాండ్,జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ, ప్రాక్టర్ అండ్ గాంబుల్ కంపెనీ, సారా లీ కార్ప్, పిల్స్ బరీ కంపెనీ ఎల్ ఎల్ , హెర్షే కంపెనీ వంటి సంస్థల ఉన్నాయి . గోద్రేజ్ గ్రూప్ సంస్థ ఆదాయం 2015 సంవత్సరం నాటికి 4.1 బిలియన్ డాలర్లు (₹ 25,000 కోట్లు) గా ఉంది.[8]

మూలాలు

[మార్చు]
  1. "12 Oldest Companies Of India That Stood The Test Of Time". IndiaTimes (in Indian English). 2022-06-10. Retrieved 2022-07-09.
  2. Ainy (2017-09-24). "Godrej Centenary" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-07-10.
  3. "Archived copy". Archived from the original on 29 అక్టోబరు 2006. Retrieved 18 ఫిబ్రవరి 2010.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "Meet our Board of Directors | Godrej". www.godrej.com.
  5. "Godrej Group Profile". Godrej. 26 మార్చి 2013. Archived from the original on 25 February 2016. Retrieved 27 January 2016.
  6. "Godrej Industries Ltd". Business Standard India. Retrieved 2022-07-09.
  7. Companies, Deshi (2020-10-02). "Godrej Group Profile, Wiki, Networth, Establishment, History and More". Deshi Companies (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-07-09.
  8. Sanjai, Madhura Karnik,P R. (2014-08-13). "Godrej group: Unlocking entrepreneurship". mint (in ఇంగ్లీష్). Retrieved 2022-07-09.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)