Jump to content

గోవాడ (అద్దంకి)

అక్షాంశ రేఖాంశాలు: 15°55′32.916″N 79°58′42.600″E / 15.92581000°N 79.97850000°E / 15.92581000; 79.97850000
వికీపీడియా నుండి
గోవాడ (అద్దంకి)
గ్రామం
పటం
గోవాడ (అద్దంకి) is located in ఆంధ్రప్రదేశ్
గోవాడ (అద్దంకి)
గోవాడ (అద్దంకి)
అక్షాంశ రేఖాంశాలు: 15°55′32.916″N 79°58′42.600″E / 15.92581000°N 79.97850000°E / 15.92581000; 79.97850000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంఅద్దంకి
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )


గోవాడ బాపట్ల జిల్లా అద్దంకి మండలం లోని రెెవెన్యూయేతర గ్రామం.

సమీప గ్రామాలు

[మార్చు]

విద్యుత్తు సౌకర్యo

[మార్చు]

గోవాడ పంచాయతీ సాధునగర్ వద్ద, 1.3 కోట్ల రూపాయలతో నిర్మించిన 33/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రాన్ని, 2015,మార్చి-19వ తేదీ నాడు వినియోగంలోనికి తెచ్చారు. ఈ కేంద్రం వలన గోవాడ, చినకొత్తపల్లి, సాధునగర్, శ్రీనివాసనగర్, చక్రాయపాలెం, గోపాలపురం, వెంపరాల, ఉప్పలపాడు, మైలవరం గ్రామాలతో సహా మొత్తం 15 గ్రామాలకు లబ్ధి చేకూరడమేగాక, ఆ గ్రామాలలో లో-వోల్టేజి సమస్య తీరిపోగలదు.

గ్రామ పంచాయతీ

[మార్చు]
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, పుట్టా పద్మావతీదేవిసాంబశివరావు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా గెల్లా సింగయ్య ఎన్నికైనారు.
  • 10 లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో, ఈ గ్రామ పంచాయతీకి నూతన భవన నిర్మాణానికై, 2015,నవంబరు-15వ తేదీనాడు శంకుస్థాపన నిర్వహించారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం

[మార్చు]

గోవాడ గ్రామంలోని కోదండరామస్వామి వారి ఆలయంలో, శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, కన్నులపండువగా నిర్వహించెదరు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు.

శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం

[మార్చు]

శ్రీ పోలేరుమాత - ఆంకాళపరమేశ్వరి - శ్రీ పోతురాజుస్వామివారల ఆలయం

[మార్చు]

గ్రామస్థులంతా ఏకతాటిపై నిలబడి, 8 లక్షల విరాళాలు సేకరించి, ఈ పురాతన ఆలయాన్ని పునరుద్ధరించినారు. నూతన ఆలయంలో గోపుర శిఖర, కలశ, శిలా విగ్రహ స్థిర ప్రతిష్ఠా మహోత్సవం 2017,జూన్-18వతేదీ ఉదయం 8-01 కి శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి గోవాడతోపాటు, బల్లికురవ, అద్దంకి, సంతమాగులూరు మండలాల నుండి, గ్రామస్థుల బంధువులు పెద్దసంఖ్యలో తరలి వచ్చినారు.

ప్రధాన పంటలు

[మార్చు]

2013 - గత ఏడాది పసుపు, జొన్న వ్యాపారంలో నష్టాలు చవిచూసి కూరగాయల పంట పండించడానికి పూనుకున్న గ్రామాలలో గోవాడ ఒకటి. గోవాడ రైతులు పండిస్తున్న కూరగాయాల సాగులో ప్రధానమైనవి. టమాటా, వంకాయలు,, బెండకాయలు, దోసకాయలు, కొత్తిమీర, మెంతికూర, ఆకు కూరలు మొదలైనవి.

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

[మార్చు]
  • మాకినేని వెంకయ్య (మాజీ సర్పంచి)
  • యడవల్లి శ్రీనివాసరావు - టిడీపి లీడర్
  • పుట్టా బ్రహ్మయ్య - టిడీపి లీడర్

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]