గ్రీస్‌లో హిందూమతం
గ్రీస్‌లో హిందూమతాన్ని తక్కువ మంది ఆచరిస్తారు. 2012 నాటికి గ్రీస్‌లో దాదాపు 20,000 మంది హిందువులు ఉన్నారు. [1]
గ్రీస్‌లో భారతీయులు
[మార్చు]ఏథెన్స్‌లో ఒక చిన్న హిందూ సమాజం ఉంది. 25 మంది పీఐఓలు 12 మంది NRIలు నగరంలో ఉన్నారు. ఏథెన్స్‌లో ఇంకా చాలా మంది భారతీయ వలస కార్మికులు ఉన్నారు. మిగతా గ్రీస్‌లో కూడా ఉన్నారు. వారిలో చాలామంది గృహ కార్మికులుగా లేదా సంపన్న కుటుంబాలకు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.
గ్రీస్‌లోని భారతీయ సంస్థలు
[మార్చు]గ్రీస్‌లోని భారతీయ సంస్థల్లో గ్రీక్ ఇండియన్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇండో-గ్రీక్ బిజినెస్ ఫౌండేషన్. [2] యునైటెడ్ నేటివ్ ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ గ్రీస్ (UNICOG) ఉన్నాయి. దిలేసి లో తనగ్రా సమీపంలో ఒక చిన్న ఆలయం ఉంది.
హిందూ సంస్థలు
[మార్చు]ఇస్కాన్, సత్యానంద యోగా, సహజ యోగా, బ్రహ్మ కుమారి, సత్యసాయి బాబా సంస్థలు గ్రీస్‌లో ఉన్నాయి.
యోగా గ్రీస్‌లో ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా సత్యానంద యోగా, సహజ యోగాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సత్యానంద యోగాను స్వామి సత్యానంద స్థాపించారు. స్వామి సత్యానంద స్వామి శివమూర్తిని గ్రీస్‌కు యోగా సందేశాన్ని తీసుకువెళ్లడానికి అప్పగించారు. అతని ప్రేరణ, మార్గదర్శకత్వంలో, 1978లో స్వామి శివమూర్తి సత్యానందాశ్రమం హెల్లాస్‌ను (కలమటలో ప్రారంభించి, ఏథెన్స్, థెస్సలొనీకి, గ్రీకు ప్రధాన భూభాగం, ద్వీపాలలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించారు) స్థాపించారు. సత్యానందాశ్రమం హెల్లాస్ ప్రస్తుత ఆశ్రమం 1984లో పైనియా పట్టణం వెలుపల స్థాపించబడింది. మరుసటి సంవత్సరం స్వామి సత్యానంద దీన్ని ప్రారంభించాడు. 1984, 1985లో స్వామి సత్యానంద గ్రీస్‌ను సందర్శించాడు. 'నిన్ను నీవు తెలుసుకో' అనే పురాతన సందేశంతో ప్రజల్లో జ్నానతృష్ణను ప్రేరేపించాడు. ఈ పర్యటనల సమయంలో, అతను ఆధ్యాత్మిక జీవితంపై అద్భుతమైన, లోతైన బోధనలు చేసాడు. యోగా, తంత్రంల జ్ఞానాన్ని వివరించాడు. యోగాను మానవుడి అమూల్యమైన వారసత్వంగా వెల్లడించాడు.
గరుడ హెల్లాస్ [3] పబ్లిషింగ్ హౌస్‌ను 2007లో స్థాపించారు. ఇది గ్రీస్‌లోని థెస్సలోనికిలో ఉంది. పరిమాణంలో చిన్నదైన గరుడ హెల్లాస్, ప్రతి యోగా విద్యార్థికి తన పుస్తకాల ద్వారా స్పష్టమైన విద్యాపరమైన, వ్యక్తిగతీకరించిన మద్దతును అందిస్తుంది. ఇది ప్రధానంగా భారతదేశంలోని బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుండి ఇంగ్లీషులో ఉన్న యోగా పుస్తకాలను దిగుమతి చేస్తుంది. గరుడ హెల్లాస్ యోగా పుస్తకాలను గ్రీకు భాషలోకి అనువదించి ప్రచురిస్తుంది. తద్వారా యోగా జ్ఞానాన్ని గ్రీకు మాట్లాడే ప్రజలందరికీ నిష్పాక్షికంగా, శాస్త్రీయంగా అందిస్తుంది.
ఇస్కాన్
[మార్చు]ఇస్కాన్‌కు గ్రీస్‌లో చాలా తక్కువ మంది భక్తులు ఉన్నారు. అది గ్రీస్‌లోని ఏథెన్స్‌లో ఒక శాఖను స్థాపించింది. ఏథెన్స్ లోని 60 కొలోకోట్రోని వీధిలో ఈ శాఖ ఉంది. దీనికి "ప్రార్థన గృహం" అనే గ్రీస్ చర్చి హోదా ఉంది. గ్రీకు మత మంత్రిత్వ శాఖ నుండి ఇది గుర్తింపు పొందింది. [4]
ప్రభుత్వ తోడ్పాటు
[మార్చు]2006 మార్చి 1 న, గ్రీకు ప్రభుత్వం దహన సంస్కారాలను అనుమతించే చట్టాన్ని ఆమోదించింది. [5] ఈ చట్టాన్ని ఏథెన్స్‌లోని భారతీయ సమాజం స్వాగతించింది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Table: Religious Composition by Country, in Numbers Archived 2016-12-09 at the Wayback Machine Pew Research Center (December 2012)
- ↑ "GICWA (Indo-Greek)". Archived from the original on 2007-03-15. Retrieved 2007-03-19.
- ↑ "Garuda Hellas publishing house". www.garudahellas.gr. Archived from the original on 2019-07-20. Retrieved 2015-01-08.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-12-31. Retrieved 2022-01-17.
- ↑ "International Religious Freedom Report 2006, Greece". Archived from the original on 2020-02-09. Retrieved 2019-05-25.