గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ
గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ | |
---|---|
ప్రదేశం | మన్ననూర్, అమ్రాబాద్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ |
నిర్మించినది | 8-13వ శతాబ్దం |
గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం, అమ్రాబాద్ గ్రామ సమీపంలో 120 కిమీల పొడవున్న అతిపెద్ద గోడ. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కాకతీయుల వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఈ గోడ ఇటీవలే వెలుగులోకి వచ్చింది. అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ నుంచి ప్రారంభమై ఫరహాబాద్ మీదుగా కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల వరకూ విస్తరించింది.[1]
చరిత్ర
[మార్చు]ఎనిమిదో శతాబ్దంలో అమ్రాబాద్ ప్రాంత సామంత రాజు పట్టభద్రుడు అమ్రాబాద్ కోట నిర్మాణానికి పునాదివేశాడు. ఆ తరువాత 13వ శతాబ్దంలో కాకతీయుల ఆధీనంలోకి వచ్చిన ఈ కోటను, రాణి రుద్రమదేవి కొంత నిర్మాణం చేపట్టగా, తదనంతరం ప్రతాపరుద్రుడి పాలనాకాలంలో కోట నిర్మాణం పూర్తయింది. ఆ కోటకు రక్షణగా, అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా నల్లమలలోని కృష్ణానది తీరం మీదుగా 120 కిలోమీటర్ల పొడవున్న ఈ గోడను ప్రతాపరుద్రుడు నిర్మించాడు.
ప్రస్తుత స్థితి
[మార్చు]కాకతీయ సామ్రాజ్య పతనానంతరం శత్రురాజ్యాల దాడులనూ తట్టుకొని నిలబడిన ఈ గోడకు సంబంధించిన ఆనవాళ్ళు అక్కడక్కడ ఉన్నాయి. ప్రకృతి బీభత్సాలు, దొంగల దాడులు, గుప్తనిధుల కోసం తవ్వకాలవల్ల గోడ మొత్తం దెబ్బతిన్నది. ఐదారు కిలోమీటర్ల మేర కూలిపోయిన స్థితిలో ఉంది.[2] మన్ననూరుకు సమీపంలో సుమారు కిలోమీటరు వరకూ కొండపైకి ఎక్కిన తర్వాత, చుట్టూరా సుమారు రెండు కిలోమీటర్ల మేర కోటగోడ కనిపిస్తుంది. మరోవైపు ఫరహాబాద్ అటవీ ప్రాంతంలోని వ్యూ పాయింట్‌కు ఇరువైపులా కోటగోడలు చెక్కుచెదరకుండా ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ.. ఇది ఎక్కడుంది.. దాని ప్రత్యేకతలేంటి తెలుసా?". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-26. Archived from the original on 2021-06-07. Retrieved 2022-01-28.
- ↑ "మనదగ్గరా..మహాకుడ్యం!". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2021-11-29. Retrieved 2022-01-28.