Jump to content

కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం

అక్షాంశ రేఖాంశాలు: 16°39′N 78°29′E / 16.65°N 78.48°E / 16.65; 78.48
వికీపీడియా నుండి
(కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
కల్వకుర్తి
—  శాసనసభ నియోజకవర్గం  —
కల్వకుర్తి is located in Telangana
కల్వకుర్తి
కల్వకుర్తి
అక్షాంశరేఖాంశాలు: 16°39′N 78°29′E / 16.65°N 78.48°E / 16.65; 78.48
దేశం భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా ఇది వరకు ఈ నియోజకవర్గంలో ఉన్న మిడ్జిల్ మండలం జడ్చర్ల నియోజకవర్గంలో కలిసింది. అచ్చంపేట నియోజకవర్గంలోని కల్వకుర్తి మండలానికి చెందిన 14 గ్రామాలు ప్రస్తుతం ఇందులో కలియడంతో కల్వకుర్తి మండలం పూర్తిస్థాయిలో ఈ నియోజకవర్గంలో భాగమైంది. 1989లో ఇక్కడి నుండి పోటీ చేసిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో పరాజయం పొందడంతో అప్పుడు ఈ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.[1][2][3]

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు]

1.ఆమనగల్

2.కడ్తాల్ (కొత్త)

3.మాడ్గుల్

4.తలకొండపల్లి

5.కల్వకుర్తి

6.వెల్దండ

నియోజకవర్గపు గణాంకాలు

[మార్చు]
  • 2001 లెక్కల ప్రకారం జనాభా: 2,45,726.
  • ఓటర్ల సంఖ్య (2008 ఆగస్టు నాటికి): 1,79,161.[4]
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 19.75%, 16.65%.

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952[5] మందుముల నర్సింగరావు కాంగ్రెస్ ఎల్.వెంకట్ రెడ్డి పి.పి
కె.ఆర్.వీరాస్వామి కాంగ్రెస్ ఎస్.బాబయ్య స్వతంత్ర అభ్యర్థి
1957[5] టి.శాంతాబాయి కాంగ్రెస్ మైసయ్య స్వతంత్ర అభ్యర్థి
కె.నాగన్న కాంగ్రెస్ బాలడు పి.డి.ఎఫ్
1962 లట్టుపల్లి వెంకట్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థి టి.శాంతాబాయి కాంగ్రెస్ పార్టీ
1964 టి.శాంతా బాయి కాంగ్రెస్ పార్టీ జి.ఎం.రెడ్డి సి.పి.ఐ.
1967 ద్యాప గోపాల్‌ రెడ్డి[6] ఇండిపెండెంట్ టి.శాంతాబాయి కాంగ్రెస్ పార్టీ
1969 ఎస్.జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బి.ఎస్.రెడ్డి ఎస్టీపీఎస్
1972 ఎస్.జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బి.ఎస్.రెడ్డి ఎస్టీపీఎస్
1978 ఎస్.జైపాల్ రెడ్డి జనతా పార్టీ కె.కమలా కాంతారావు కాంగ్రెస్ పార్టీ
1983 ఎస్.జైపాల్ రెడ్డి జనతా పార్టీ బి.రుక్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1985 జె. చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ పార్టీ డి.లింగారెడ్డి జనతాపార్టీ
1989 జె. చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ పార్టీ ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీ
1994 ఎడ్మ కిష్టారెడ్డి స్వతంత్ర అభ్యర్థి డి.గోపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1999 గుర్కా జైపాల్ యాదవ్ తెలుగుదేశం ఎడ్మ కిష్టారెడ్డి కాంగ్రెస్ పార్టీ
2004 ఎడ్మ కిష్టారెడ్డి కాంగ్రెస్ పార్టీ టి.ఆచారి భారతీయ జనతా పార్టీ
2009 గుర్కా జైపాల్ యాదవ్ తెలుగుదేశం పార్టీ ఎడ్మ కిష్టారెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 చల్లా వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తల్లోజు ఆచారి భారతీయ జనతా పార్టీ
2018 గుర్కా జైపాల్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి తల్లోజు ఆచారి భారతీయ జనతా పార్టీ
2023[7] కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తల్లోజు ఆచారి భారతీయ జనతా పార్టీ

1999 ఎన్నికలు

[మార్చు]

1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన జైపాల్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యడ్మ కిష్టారెడ్డిపై 3403 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. జైపాల్ యాదవ్ 63995 ఓట్లు పొందగా, యడ్మ కిష్టారెడ్డికి 6592 ఓట్లు లభించాయి. ఎన్నికల బరిలో మొత్తం ఆరుగురు ఉండగా ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యనే కొనసాగింది. మొగితా నలుగురు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు.

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన యడ్మ కిష్టారెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై 22117 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. యడ్మ కిష్టారెడ్డికి 76152 ఓట్లు రాగా, ఆచారి 54035 ఓట్లు పొందినాడు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఈ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించింది.

2004 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
2004 ఎన్నికల గణాంకాలు
ఓట్లు
పోలైన ఓట్లు
  
139915
యడ్మ కిష్టారెడ్డి
  
54.42%
టి.ఆచారి
  
38.62%
ఇతరులు
  
6.96%
  
0%
* చెల్లిన ఓట్లలో గెలుచుకున్న ఓట్లు
క్రమ సంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు
1 యడ్మ కిష్టారెడ్డి కాంగ్రెస్ పార్టీ 76152
2 తల్లోజు ఆచారి భారతీయ జనతా పార్టీ 54035
3 విల్సన్ పోల్ బి.ఎస్.పి 4444
4 కె.రాములు ఇండిపెండెంట్ 3067
5 పోగుల జంగయ్య ఇండిపెండెంట్ 2217

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరపున టి.ఆచారి, [8] కాంగ్రెస్ పార్టీ తరపున సిటింగ్ శాసన సభ్యులు ఎడ్మ కిష్టారెడ్డి [9],. ప్రజారాజ్యం పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ నుండి ఫిరాయించిన మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, [10] లోక్‌సత్తా నుండి బండెల రామచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ తరపున జైపాల్ యాదవ్ పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జైపాల్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డిపై సుమారు 600 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.[11]

నియోజకవర్గ ప్రముఖులు

[మార్చు]
ఎస్.జైపాల్ రెడ్డి
కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల గ్రామానికి చెందిన ఎస్.జైపాల్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖమైన వ్యక్తిగా ఎదిగాడు. 1969 నుంచి 1984 మధ్యకాలంలో ఈ నియోజకవర్గం నుంచి 4 పర్యాయాలు వరుసగా ఎన్నికైన ఇతడు తొలి రెండు సార్లు కాంగ్రెస్ నుంచి కాగా ఆ తరువాత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జనతా పార్టీ తరపున మరో రెండు సార్లు ఎన్నికయ్యాడు. ఆ తరువాత మహబూబ్ నగర్ , మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి లోకసభకు ఎన్నికయ్యాడు. రాజ్యసభకు కూడా రెండు సార్లు ఎన్నికైన ప్రముఖ నేత ఇతడు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖామంత్రిగా వ్యవహరిస్తున్నాడు.
చిత్తరంజన్ దాస్
కల్వకుర్తి నియోజకవర్గపు ప్రముఖ నేతలలో ఒకడైన చిత్తరంజన్ దాస్ రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1989లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును ఓడించి సంచలనం సంచలనం సృష్టించాడు.[12] అంతకు క్రితం 1984లో కూడా ఇదే నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. 1999లో కాంగ్రెస్ పార్టీ టికెట్టు రాకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరి కొద్దికాలంలోనే బయటకు వచ్చాడు. 2004 , 2009 ఎన్నికలలో కూడా టికెట్టు లభించలేదు.
ఎడ్మ కిష్టారెడ్డి
కల్వకుర్తి నియోజకవర్గం నుంచి వరసగా మూడవసారి బరిలోకి దిగి రెండు సార్లు ఎన్నికైన ఎడ్మ కిష్టారెడ్డి కల్వకుర్తి పట్టణంలో 1947లో జన్మించాడు. వ్యవసాయం వృత్తిగా కలిగిన కిష్టారెడ్డి రాజకీయాలలో వార్డు సభ్యుడు, సర్పంచు పదవి నుంచి పైకి వచ్చిన నాయకుడు. గతంలో మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1977 అత్యవసరపరిస్థితి కాలంలో జైలుకి వెళ్ళినాడు. 1986లో తెలుగుదేశం పార్టీ తరపున కల్వకుర్తి మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1994లో స్వతంత్ర్య అభ్యర్థిగా శాసన సభ్యులుగా ఎన్నికై, 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఓడిపోయాడు. 2004లో కాంగ్రెస్ తరపున పోటీచేసి రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.[13]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (31 October 2023). "అంత హవాలోనూ ఓటమి తప్పలేదిక్కడ!". Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
  2. Namasthe Telangana (12 April 2022). "శాసనసభ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  3. Eenadu (21 November 2023). "పాలమూరు పందెం కోళ్లు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  4. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.
  5. 5.0 5.1 ద్విసభ్య నియోజకవర్గం
  6. Eenadu (17 November 2023). "స్వతంత్రులుగా సత్తా చాటారు". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  7. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  8. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  9. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  10. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
  11. <సాక్షి దినపత్రిక, తేది 17-05-2009
  12. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 23-03-2009
  13. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, తేది 22-03-2009

వెలుపలి లంకెలు

[మార్చు]