చల్లా వంశీచంద్‌ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చల్లా వంశీచంద్‌ రెడ్డి

కల్వకుర్తి, మాజీ ఎమ్మెల్యే 2014 - 2018
నియోజకవర్గము కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి చల్లా ఆశ్లేష రెడ్డి
నివాసము H. No. 1-11/1, సేరిఅప్పారెడ్డి పల్లి గ్రామం , వెలుదండ మండలం, మహబూబ్ నగర్ జిల్లా. , 25 B, ఎంఎల్ఏ కాలనీ, రోడ్ నెం.12,బంజారాహిల్స్ , హైదరాబాద్.
మతం హిందూ
వెబ్‌సైటు చల్లా వంశీచంద్‌ రెడ్డి

చల్లా వంశీ చంద్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. ఆయన 2014 ఎన్నికల్లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎంఎల్ఏగా గెలిచాడు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నాడు.[1][2]

జననం[మార్చు]

వంశీ చంద్ రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా, సేరి అప్పారెడ్డిపల్లి గ్రామంలో చల్లా రాంరెడ్డి, శోభారాణి దంపతులకు జన్మించాడు. ఈయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి గృహిణి.

రాజకీయ జీవితం[మార్చు]

విద్యార్థి దశ నుండే రాజకీయాలపై ఉన్న ఆసక్తితో వంశీచంద్ రెడ్డి రాజకీయాల్లో వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగిన వంశీచంద్ రెడ్డి 2005 – 2006లో ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట కార్యదర్శిగా, 2006 – 2010 ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట అధ్యక్షుడిగా, 2012-14 లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై 78 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొంది, తొలిసారిగా తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 2018 ఆగష్టులో ఆయన సేవలకు గుర్తింపునిచ్చి ఏఐసీసీ కార్యదర్శిగా నియమించింది.[3] 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి జైపాల్ యాదవ్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి చేతిలో ఓడిపోయాడు.

మూలాలు[మార్చు]

  1. Members of Legislative Assembly Archived 2019-08-19 at the Wayback Machine., Telangana State Portal.
  2. చల్లా వంశీ చంద్ రెడ్డి. "Vamshi Chand Reddy Challa". www.challavamshichandreddy.com (ఆంగ్లం లో). మూలం నుండి 16 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 16 September 2019.
  3. ఇండియా టుడే (23 August 2018). "Challa Vamshi Chand Reddy appointed as AICC secy for Maha unit". INDToday. మూలం నుండి 16 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 16 September 2019.