Jump to content

చల్లా వంశీచంద్ రెడ్డి

వికీపీడియా నుండి
చల్లా వంశీచంద్‌ రెడ్డి

కల్వకుర్తి, మాజీ ఎమ్మెల్యే 2014 - 2018
నియోజకవర్గం కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి చల్లా ఆశ్లేష రెడ్డి
నివాసం H. No. 1-11/1, సేరిఅప్పారెడ్డిపల్లి గ్రామం, చారకొండ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
25 B, ఎంఎల్ఏ కాలనీ, రోడ్ నెం.12, బంజారాహిల్స్ , హైదరాబాద్.
మతం హిందూ
వెబ్‌సైటు చల్లా వంశీచంద్‌ రెడ్డి

చల్లా వంశీ చంద్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. ఆయన 2014 ఎన్నికల్లో కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి ఎంఎల్ఏగా గెలిచాడు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నాడు.[1][2]

జననం

[మార్చు]

వంశీ చంద్ రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా, సేరి అప్పారెడ్డిపల్లి గ్రామంలో చల్లా రాంరెడ్డి, శోభారాణి దంపతులకు జన్మించాడు. ఈయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి గృహిణి.

రాజకీయ జీవితం

[మార్చు]

విద్యార్థి దశ నుండే రాజకీయాలపై ఉన్న ఆసక్తితో వంశీచంద్ రెడ్డి రాజకీయాల్లో వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగిన వంశీచంద్ రెడ్డి 2005 – 2006లో ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట కార్యదర్శిగా, 2006 – 2010 ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట అధ్యక్షుడిగా, 2012-14 లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై 78 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొంది, తొలిసారిగా తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టాడు.[3][4] 2018 ఆగస్టులో ఆయన సేవలకు గుర్తింపునిచ్చి ఏఐసీసీ కార్యదర్శిగా నియమించింది.[5] 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి జైపాల్ యాదవ్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.

చల్లా వంశీచంద్ రెడ్డి ప్ర‌స్తుతం ఏఐసీసీ కార్యదర్శి హోదాలో మహారాష్ట్ర పార్టీ వ్యవహారాలను ప‌ర్య‌వేక్షిస్తున్నాడు. ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహాయకుడిగా, జాతీయ స్థాయిలో పార్టీ సంస్థాగత వ్యవహారాల బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఆయన 2023 ఆగస్టు 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితుడయ్యాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. Members of Legislative Assembly Archived 2019-08-19 at the Wayback Machine, Telangana State Portal.
  2. చల్లా వంశీ చంద్ రెడ్డి. "Vamshi Chand Reddy Challa". www.challavamshichandreddy.com (in ఇంగ్లీష్). Archived from the original on 16 September 2019. Retrieved 16 September 2019.
  3. Eenadu (13 November 2023). "తొలి ప్రయత్నం.. వరించిన విజయం". EENADU. Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  4. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  5. ఇండియా టుడే (23 August 2018). "Challa Vamshi Chand Reddy appointed as AICC secy for Maha unit". INDToday. Archived from the original on 16 September 2019. Retrieved 16 September 2019.
  6. Namasthe Telangana (20 August 2023). "కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని పునరుద్ధరించిన ఖర్గే.. సచిన్‌ పైలట్‌, శశిథరూర్‌, రఘువీరాలకు చోటు". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.