Jump to content

ఘటిక సిద్ధేశ్వరం

వికీపీడియా నుండి
(ఘటిక సిద్దేశ్వరం నుండి దారిమార్పు చెందింది)
శ్రీ ఘటిక సిద్ధేశ్వరస్వామి వారి దేవస్థానం
పేరు
స్థానిక పేరు:శ్రీ ఘటిక సిద్ధేశ్వరస్వామి వారి దేవస్థానం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:నెల్లూరు
ప్రదేశం:ఘటిక సిద్ధేశ్వరం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:శివుడు
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
స్థల పురాణం ప్రకారం క్రీ.పూ 6వ శతాబ్దం (సా.శ.1406 ప్రాకార మండప నిర్మాణం) (జీర్ణోద్ధరణ 1974)

ఘటిక సిద్ధేశ్వరం (శ్రీ ఘటిక సిద్ధేశ్వరస్వామి వారి దేవస్థానం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరుజిల్లా సీతారామపురం మండలం లోని శ్రీసిద్ధేశ్వరకోనలో ఉంది. చాలా పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకున్న దశలో కాశీనాయన స్వామి పునరుద్ధరించాడు. ఇది నెల్లూరునకు 110 కిమీ దూరంలో ఉంది. చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మధ్య ఘటిక సిద్దేశ్వరం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి చాలా మంది వస్తూ ఉంటారు.

చరిత్ర

[మార్చు]

అత్యంత ప్రాచీన శైవక్షేత్రాల్లో ఇది ఒకటి. సా.శ. 6వ శతాబ్దానికి పూర్వం వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది. సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కల్యాణం జరిపినట్లు నిత్యనాథసిదద్ధాచార్యులు రసరత్నాకర గ్రంథంలో పేర్కొన్నారు. అగస్త్య సా.శ. 1406లో విజయనగరం సామ్రాజ్యాన్ని పాలించిన రెండో హరిహరరాయులు, అతని తనయుడు మొదటి దేవరాయులు ఈ ఆలయానికి ప్రాకార మండపం నిర్మించినట్లు చరిత్ర చెపుతోంది. 1974లో అవధూత కాశినాయన ఈ క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేశాడు

ప్రకృతి సౌందర్యం

[మార్చు]

ఎతైన కొండలు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాల నడుమ మనసును మైమరపించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది.

ఉత్సవాలు

[మార్చు]

ప్రతి సంవత్సరం శివరాత్రి, కార్తీక పౌర్ణమి నాడు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇచట కొలువుదీరిన ఇష్టకామేశ్వరీదేవి అమ్మవారు దశరా శరన్నవ రాత్రి ఉత్సవాల సమయంలో వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలందుకుంటారు.

దారి మార్గం

[మార్చు]

వసతి సాకర్యాలు

[మార్చు]

ఇక్కడకు వచ్చే భక్తులు సొంత వాహనాలపై ఆధారపడవలసి ఉంటుంది. ఇక్కడ కొండపై నుంచి ఎల్లప్పుడు నీరు ప్రవహిస్తున్నందు వలన మంచినీటికి ఇబ్బంది లేదు. ఇక్కడకు వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడకు వచ్చిన భక్తులు ఉత్సవాల సమయంలో తప్పక మామూలు రోజుల్లో సాయంత్రానికి తిరుగు ప్రయాణం అవుతారు. ఒకవేళ రాత్రికి ఇక్కడే ఉండవలసి వస్తే వసతి సౌకర్యాలకు కొదవలేదు.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]