Jump to content

చంద్రకీర్తి

వికీపీడియా నుండి
దస్త్రం:Chandrakirti.JPG
చంద్రకీర్తి

చంద్రకీర్తి సా.శ 7 వ శతాబ్దిలో బౌద్ధంలోని మాధ్యమిక సంప్రదాయానికి ప్రతినిధి. నలందా మహా విహారంలో గొప్ప బౌద్ధ పండితుడు. అధ్యాపకుడు. ఆచార్య నాగార్జుని పిదప మాధ్యమిక శాఖను పరిపుష్టం చేసిన బౌద్ధ ఆచార్య పరంపరలో ప్రముఖుడు. చంద్రకీర్తి యోగాచార (విజ్ఞానవాద) వంటి ప్రాచీన బౌద్ధ శాఖా సంప్రదాయాలను ఖండించాడు.[1] ముఖ్యంగా యోగాచార సాంప్రదాయనికి చెందిన చంద్ర గోమినితో తీవ్రంగా విభేదించాడు. దిజ్ఞాగుని సంప్రదాయాలను సైతం విమర్శించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

బౌద్ధ లామా తారానాధుని ప్రకారం చంద్రకీర్తి దక్షిణ భారతదేశంలోని సమంతాలో జన్మించాడు.[2] ఇతని కాలం సా.శ 600 -650 గా భావించబడింది. బాల్యంలో మిక్కిలి బుద్ధిమంతుడుగా పేరుతెచ్చుకొన్నాడు. బిక్షువు అయిన పిదప త్రిపీటకాలను అవపోశన పట్టాడు. బుద్ధపాలిక, భావ వివేకుల ప్రసిద్ద శిష్యుడైన కమల బుద్ధి వద్ద శిష్యరికం చేసి ఆచార్య నాగార్జునుని గ్రంథాలను అధ్యయనం చేసాడు. నలందా విశ్వవిద్యాలయంలోని ప్రముఖ బౌద్ధ గురువు అయిన ఆచార్య ధర్మపాలుని వద్ద బౌద్ధ ధర్మాన్ని, బౌద్ధ తర్కాన్ని అభ్యసించాడు. తదనంతరం నలందా మహా విహారంలో అధ్యాపక పదవిని చేపట్టాడు. క్రీ. శ. 7వ శతాబ్దికి చెందిన ఆచార్య ధర్మకీర్తికి సమకాలికుడుగా భావించబడ్డాడు.

ప్రధాన రచనలు

[మార్చు]

ఆచార్య నాగార్జుని “ మూలమాధ్యమిక కారిక ” పై “ప్రసన్నపద” అనే వ్యాఖ్యానం రాసాడు. ఈ టీకా అత్యంత ప్రామాణికమైనదిగా ప్రసిద్ధి కెక్కింది. ప్రసన్నమైన పద వివరణతో సాగే ఈ టీకా లేకుండా ఆచార్య నాగార్జునుని భావం తెలియడం కష్టం. చంద్రకీర్తి మూలమాధ్యమికకారిక మీద రాసిన ‘ప్రసన్న పద’ వ్యాఖ్యానం చదివిన వేదాంతులు నికాయాలలో, ఆగమాలలో చెప్పిన మూల బౌద్ధం కంటె, చంద్రకీర్తి వ్యాఖ్యానించిన నాగార్జునుడు తమకు “సాంత్వనం” చేకూరుస్తున్నాడన్నారు.[3] ఈ విధంగా చంద్రకీర్తి ‘ప్రసన్న పద’ వ్యాఖ్యానం వల్ల, బ్రాహ్మణ మతానికి చెందిన వేదాంతులకు అసలు బుద్ధుడు కన్నా నాగార్జునుడు నచ్చినట్లు తెలుస్తుంది.[4]

ఇతని మరో విశిష్ట రచన “మాధ్యమికావతార” గ్రంథం. దీని టిబెట్ అనువాదం మాత్రమే లభిస్తుంది. ఇది మాధ్యమిక తత్వాన్ని బోధించే టిబెటిన్ బౌద్ధారామాల నందు, కళాశాలలనందు శూన్యత గురించి అధ్యయానం చేయడానికి ప్రధాన ఆధార గ్రంథంగా ఉంది. మరో ప్రముఖ గ్రంథం చతుశ్శతకటీకా. ఇది ఆచార్య ఆర్యదేవుని “ చతుశ్శతకం “ పై రాసిన వ్యాఖ్య. దీని ప్రాథమిక భాగాన్ని సంస్కృతంలో హర ప్రసాద్ శాస్త్రి సేకరించి ప్రకటించారు.[5] మిగిలిన భాగం టిబెట్ అనువాదం నుండి పునః సంస్కృతీకరించారు. మాధ్యమిక వ్యాఖ్యాలలో దీనికి ప్రముఖ స్థానం ఉంది.

  • ప్రసన్నపద (Clear Words) : ఇది ఆచార్య నాగార్జుని “ మూలమాధ్యమిక కారిక ” మీద వ్యాఖ్య (టీకా).
  • మాధ్యమికావతార (Entering the Middle Way or Guide to the Middle Way) [6]: దీనిలో శూన్యవాదంపై విపులంగా వ్యాఖ్యానం ఉంది.
  • చతుశ్శతకటీకా (Commentary on the 400 Verses) [7]: ఇది ఆర్యదేవుని “ చతుశ్శతకం “ పై వ్యాఖ్య.
  • యుక్తిషష్టికావృత్తి (Commentary on the Sixty Stanzas on Reasoning)
  • శూన్యతాసప్తతివృత్తి (Commentary on the Seventy Stanzas on Emptiness)
  • త్రిశరణాసప్తతి (Seventy Verses on Taking Refuge)

రిఫరెన్సులు

[మార్చు]
  • Cesare Rizzi, Candrakīrti (Delhi: Motilal Banarsidass, 1988).
  • David Seyfort Ruegg, The Literature of the Madhyamaka School of Philosophy in India (Wiesbaden: Harrassowitz, 1981).
  • Lobsang N. Tsonawa, Indian Buddhist Pandits from The Jewel Garland of Buddhist History (Dharamsala: Library of Tibetan Works and Archives, 1985).
  • Dan Arnold, Buddhists, Brahmins and Belief: Epistemology in South Asian Philosophy of Religion
  • C. W. Huntington, The Emptiness of Emptiness: An Introduction to Early Indian Madhyamaka
  • Kelsang Gyatso. Ocean of Nectar: The True Nature of All Things, a verse by verse commentary to Chandrakirti's Guide to the Middle Way, Tharpa Publications (1995) ISBN 978-0-948006-23-4

వెలుపలి లింకులు

[మార్చు]
  • చంద్రకీర్తి యొక్క మాధ్యమికావతార (Introduction to the Middle Way) నుండి ఉదహరించబడిన సూక్తులు[2]

మూలాలు

[మార్చు]
  1. Fenner, Peter G. (1983). "Chandrakīrti's refutation of Buddhist idealism." Philosophy East and West Volume 33, no.3 (July 1983) University of Hawaii Press. P.251. Source: [1] Archived 2009-10-27 at the Wayback Machine (accessed: January 21, 2008)
  2. P. 298 Global History of Philosophy: The Patristic-Sutra Period, Volume 3, By John C. Plott
  3. Kalupahana J, David. Mulamadhyamaka Kartika of Nagarjuna (1991 ed.). Delhi: Motilal Banarsidas Publishers. p. xiii.
  4. అన్నపురెడ్డి, వెంకటేశ్వరరెడ్డి. "నాగార్జునుడు రెండవ బుద్ధుడా?". మిసిమి మాసపత్రిక (మే-2006).
  5. Memories of Asiatic Society of Bengal Part III (Calcutta ed.). No. 8: Asiatic Society of Bengal. 1914. p. 449.{{cite book}}: CS1 maint: location (link)
  6. Ocean of Nectar: The True Nature of All Things, Tharpa Publications (1995) ISBN 978-0-948006-23-4
  7. Lang, Karen C. (2003). Four Illusions: Candrakīrti's Advice to Travelers on the Bodhisattva Path. Oxford University Press.