చతుశ్శతకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చతుశ్శతకం (Four Hundred Verses లేదా 400 పద్యాలు) (Skt. Catuḥśataka; Tib. བཞི་བརྒྱ་པ་, Wyl. bzhi brgya pa, full title Tib. རྣལ་འབྱོར་སྤྱོད་པ་བཞི་བརྒྱ་པ་, Wyl. rnal 'byor spyod pa bzhi brgya pa) అనేది మహాయాన బౌద్ధం లోని మాధ్యమిక సంప్రదాయానికి చెందిన గొప్ప తాత్విక గ్రంథం. దీనిని రచించినది బౌద్ధ తత్వవేత్త అయిన ఆచార్య "ఆర్యదేవుడు". మాధ్యమిక శాఖా (శూన్యవాద) సంప్రదాయానికి మూల గ్రంథంగా వున్న 'చతుశ్శతకం' బౌద్ధ సాహిత్యంలోని 13 ఉద్గ్రందాలలో ఒకటి. ఈ గ్రంథంలో వైదిక కర్మకాండ పట్ల నిరశన ప్రబలంగా కనిపిస్తుంది.

దీని రచయిత ఆర్యదేవుడు క్రీ.పూ. 3 వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను ఆచార్య నాగార్జునునికి ప్రముఖ శిష్యుడు. ఆచార్య నాగార్జునుని తరువాత మాధ్యమిక బౌద్ధధర్మాన్ని వ్యాప్తి చేసిన వారిలో ఆర్యదేవుడు ముఖ్యుడు. మాధ్యమికవాదానికి నాగార్జునుని ' మాధ్యమిక కారికలు' ఎటువంటివో, ఆర్యదేవుని 'చతుశ్శతకం'కు కూడా అటువంటి ప్రశస్తి ఉంది.

గ్రంధ విషయం[మార్చు]

ఈ సంస్కృత గ్రంథంలో 16 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతీ అధ్యాయానికి 25 కారికలు (stanzes) చొప్పున మొత్తం 400 పద్యాలున్నాయి. దీనిలో గల 4 శతకాలలో మొదటి రెండు శతకాలు బౌద్ధ ధర్మ శాసనాత్మికాలు. అనగా వీటిలో బౌద్ధ ధర్మం యొక్క శాస్త్రీయ పరిశీలన కనిపిస్తుంది. చివరి రెండు శతకాలు విగ్రహ శతకాలు అంటే పరమతఖండనాత్మికాలు.[1] ఒకవైపున మాధ్యమిక ధర్మాన్ని సమర్ధిస్తూనే మరోవైపున సాంఖ్య, వైశేషిక, జైన, లోకాయుత దర్శనాలను ఖండించాడు. ముఖ్యంగా బ్రాహ్మణ కర్మకాండ పట్ల నిరసన ఇతని దర్శనంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

వ్యాఖ్యలు[మార్చు]

తదనంతరకాలంలో అనేక మంది బౌద్ధ తత్వవేత్తలు, పండితులు దీనిపై వ్యాఖ్యలు రాసారు.

  • చతుఃశతకానికి నలందా ఆచార్యుడు ధర్మపాలుడు రాసిన వ్యాఖ్యను, ప్రసిద్ధ చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ (సా.శ. 650 ప్రాంతం) 'చతుఃశాస్త్ర వైపుల్యం' పేరుతో చైనా భాషలోకి అనువదించాడు.
  • సా.శ. 7 వ శతాబ్దంనకు చెందిన చంద్రకీర్తి ఆర్యదేవుని చతుఃశతకానికి "చతుశ్శతకటీకా" (Commentary on the 400 Verses) అనే వ్యాఖ్యను రాసాడు. అయితే చంద్రకీర్తి వ్యాఖ్య మూల సంస్కృతంలో కొద్దిభాగం మాత్రమే లభ్యం. దీని ప్రాథమిక భాగాన్ని సంస్కృతంలో హర ప్రసాద్ శాస్త్రి సేకరించి ప్రకటించారు.[2] మిగిలిన భాగం టిబెట్ అనువాదం నుండి పునః సంస్కృతీకరించారు.

ఇంకను అనేకమంది టిబెటిన్ బౌద్ధ గురువులు ఈ గ్రంథానికి వ్యాఖ్యలు రాసారు. వారిలో సా.శ. 14-15 శతాబ్దాలకు చెందిన "గ్యాల్ చాబ్ జీ" (Gyaltsab Darma Rinchen), రెండవ షైయోన్ను లోద్రో (Rendawa Shyönnu Lodrö), 19-20 శతాబ్దాలకు చెందిన ఖెంపో గావంగ్ పాల్జాంగ్ (Khenpo Ngawang Palzang), ఖెంపోషెంగ (Khenpo Shenga), పోప తుల్కు (Pöpa Tulku Dongak Tenpé Nyima) తదితరులు ముఖ్యమైనవారు.

రిఫరెన్సులు[మార్చు]

Lang, Karen (1986). Aryadeva's Catuhsataka: On the Bodhisattva's Cultivation of Merit and Knowledge. Narayana Press, Copenhagen.

మూలాలు[మార్చు]

  1. Pandita Baladevopadyaya. బౌద్ధ వాజ్మయ సర్వస్వం (తెలుగు అనువాదం) (2006 ed.). Hyderabad: భోదిశ్రీ నాగార్జునాచార్య విజ్ఞాన కేంద్రం. p. 244.
  2. Memories of Asiatic Society of Bengal Part III (Calcutta ed.). No. 8: Asiatic Society of Bengal. 1914. p. 449.{{cite book}}: CS1 maint: location (link)