చంద్రగుప్త మౌర్యుడు

వికీపీడియా నుండి
(చంద్రగుప్త మౌర్య నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చంద్రగుప్త మౌర్యుడు
సామ్రాట్ (చక్రవర్తి)మౌర్యసామ్రజ్యము
ఎరుపు రాతితో గల నిలబడే యువకుని విగ్రహం
న్యూఢిల్లీ లోని బిర్లామందిర్ లో చంద్రగుప్త మౌర్యుని విగ్రహం
పాలనాకాలం322BC - 298BC
బిరుదములుసామ్రాట్ చక్రవర్తిన్
జననం340 BC
జనన స్థలంపాటలీపుత్ర (పాట్నా) , బీహార్
మరణం298 BC
మరణ స్థలంShravanbelgola, Karnataka, India[1]
ముందు వారునంద సామ్రాజ్యము యొక్క సామ్రాట్ ధననందుడు
తర్వాత వారుబిందుసారుడు
Consortదుర్ధరుడు
Issueబిందుసారుడు
రాజ్యంమౌర్య సామ్రాజ్యము
చంద్రగుప్తుని పేరు మీదుగా భారత ప్రభుత్వం విడుదల చేసిన స్టాంపు

చంద్రగుప్త మౌర్య లేదా మౌర్యుడు (సంస్కృతం: चन्द्रगुप्त मौर्य) మౌర్య సామ్రాజ్య స్థాపకుడు. తన తల్లి ముర పేరు మీదుగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. భారత దేశాన్ని మొత్తం ఒక రాజ్యంగా పరిపాలించడంలో సఫలీకృతుడైనాడు. చంద్ర గుప్తుడు మొట్ట మొదటిసారిగా భారతదేశమంతటినీ ఏకం చేసి నిజమైన చక్రవర్తి అనిపించుకున్నాడు. గ్రీకు లేదా లాటిన్ సాహిత్యంలో చంద్రగుప్తుని శాండ్రోకుప్టస్ అని వ్యవహరిస్తారు.

వంశ మూలాలు[మార్చు]

చంద్రగుప్తుని పూర్వీకుల గురించి కొద్దిగా కూడా కచ్చితమైన సమాచారం లేదు. వివిధ చరిత్రకారులు వివిధ రకాలైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. చాలామంది భారతీయ చరిత్రకారులు చంద్రగుప్తుడ. సాహిత్యం ప్రకారం చంద్రగుప్తుడు నెమళ్ళను పెంచేవారి (సంస్కృతం: మయూర పోషక) చేతిలో పెంచబడ్డాడు కాబట్టి మౌర్య వంశానికి ఆ పేరు వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు. బౌద్ధ సంప్రదాయము మరియు జైన సంప్రదాయములు రెండూ ఈ నెమలి (మయూర) శబ్దానికీ మరియు మౌర్య శబ్దానికి సంబంధం ఉన్నట్లు నిరూపిస్తున్నాయి.

బాల్య జీవితం[మార్చు]

చంద్రగుప్తుని యవ్వనం గురించి ఏ సమాచారమూ అందుబాటులో లేదు. ఇప్పుడు తెలిసిన సమాచారమంతా తరువాతి సంస్కృత, గ్రీకు, లాటిన్ రచనల ఆధారంగా సేకరించినవే.

భారతీయుల సాంప్రదాయం ప్రకారం తక్షశిల విశ్వవిద్యాలయం లో ఆచార్యుడైన చాణక్యుడు అనే గురువుకు అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్ర సమయంలో తూర్పు భారతదేశానికి చెందిన మగధ సామ్రాజ్యంలో దొరికాడని చెపుతారు. ఒక కథ ప్రకారం చంద్రగుప్తుడు చిన్న పిల్లవాడిగా ఉన్నపుడు వారి ఆటలలో చంద్రగుప్తుడు రాజుగా వ్యవహరించేవాడు. ఈ కథల్లో నేరాలు చేసేవారికి శిక్షలు వేసి న్యాయం జరిపించేవాడు. చాణక్యుడు చంద్రగుప్తుని తెలివితేటలనూ ధర్మ సూక్ష్మతనూ చూసి అచ్చెరువొందాడు. చంద్రగుప్తుడి తల్లితో అతడిని తక్షశిల విద్యాలయానికి పంపించమని కోరాడు. అందుకు ఆమె అంగీకరించడంతో అతడు అక్కడే విద్యనభ్యసించాడు. వీరు కూడా చంద్రగుప్తుని పూర్వీకులు రాజుగారి దాసీలకు పుట్టిన వారనీ, అతని తల్లి ముర పేరు మీదగానే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపన చేశాడని నమ్ముతున్నారు.

మౌర్య సామ్రాజ్య స్థాపన[మార్చు]

చాణక్యుని సహాయంతో చంద్రగుప్తుడు అనేకమంది మగధ రాజులను మరియు చంద్రవంశం వారిని ఓడించాడు.

మరింత విపులమైన సమాచారం కోసం[మార్చు]

 • Kosambi, D.D. An Introduction to the Study of Indian History, Bombay: Popular Prakashan, 1985
 • Bhargava, P.L. Chandragupta Maurya, New Delhi:D.K. Printworld, 160 pp., 2002.
 • Habib, Irfan. and Jha, Vivekanand. Mauryan India: A People's History of India, New Delhi:Tulika Books, 2004; 189pp
 • Vishakadatta, R.S. Pandit.Mudraraksasa (The Signet Ring of Rakshasa), New Delhi:Global Vision Publishing House, 2004, ISBN 81-8220-009-1, edited by Ramesh Chandra
 • Swearer, Donald. Buddhism and Society in Southeast Asia (Chambersburg, Pennsylvania: Anima Books, 1981) ISBN 0-89012-023-4
 • Nilakanta Sastri, K. A. Age of the Nandas and Mauryas (Delhi : Motilal Banarsidass, [1967] c1952) ISBN 0-89684-167-7
 • Bongard-Levin, G. M. Mauryan India (Stosius Inc/Advent Books Division May 1986) ISBN 0-86590-826-5
 • Chand Chauhan, Gian. Origin and Growth of Feudalism in Early India: From the Mauryas to AD 650 (Munshiram Manoharlal January 2004) ISBN 81-215-1028-7
 • Keay, John. India: A History (Grove Press; 1 Grove Pr edition May 10, 2001) ISBN 0-8021-3797-0
 • Radha Kumud Mukherji. Chandragupta Maurya aur Uska Kaal (Rajkamal Prakashan, Re Print 1990) ISBN 81-7171-088-1
మౌర్య వంశపు కాలం
చక్రవర్తి రాజ్యకాల ఆరంభం పరిసమాప్తి
చంద్రగుప్త మౌర్యుడు క్రీ.పూ. 322 క్రీ.పూ. 298
బిందుసారుడు క్రీ.పూ. 297 క్రీ.పూ. 272
అశోకుడు క్రీ.పూ. 273 క్రీ.పూ. 232
దశరథుడు క్రీ.పూ. 232 క్రీ.పూ. 224
సంప్రాతి క్రీ.పూ. 224 క్రీ.పూ. 215
శాలిసూక క్రీ.పూ. 215 క్రీ.పూ. 202
దేవవర్మన్ క్రీ.పూ. 202 క్రీ.పూ. 195
శతధన్వాన్ క్రీ.పూ. 195 క్రీ.పూ. 187
బృహద్రథుడు క్రీ.పూ. 187 క్రీ.పూ. 185


ఇంతకు ముందు ఉన్నవారు:
నంద వంశం
మౌర్య చక్రవర్తి
322BC—298BC
తరువాత వచ్చినవారు:
బిందుసారుడు

మూలాలు[మార్చు]

 1. Chandragupta Maurya and his times By Radha Kumud Mookerji, 4th ed. 1966, p.40. ISBN 81-208-0405-8; 81-208-0433-3

ఇతర లింకులు[మార్చు]