Jump to content

వైరిచర్ల చంద్రచూడామణి దేవ్

వికీపీడియా నుండి
(చంద్రచూఢామణి దేవ్ నుండి దారిమార్పు చెందింది)
వైరిచర్ల చంద్రచూడామణి దేవ్

శాసనసభ్యుడు
పదవీ కాలం
1953 - 1967
ముందు వైరిచెర్ల దుర్గాప్రసాద్ వీరభద్ర దేవ్
తరువాత మరిశర్ల వెంకటరామి నాయుడు
నియోజకవర్గం పార్వతీపురం

శాసనసభ్యుడు
పదవీ కాలం
1972 - 1978
ముందు శత్రుచర్ల ప్రతాప్ రుద్రరాజు
తరువాత శత్రుచర్ల విజయరామరాజు
నియోజకవర్గం నాగూరు

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు నరసింహ సూర్యనారాయణ దేవ్
సంతానం వైరిచర్ల ప్రదీప్ కుమార్ దేవ్
ఉషాదేవి
నివాసం కురుపాం

వైరిచర్ల చంద్రచూడామణి దేవ్‌ కురుపాం జమీందారీ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారత జాతీయ కాంగ్రేసు పార్టీ రాజకీయ నాయకుడు. ఆయన పార్వతీపురం నియోజకవర్గం నుండి 1957, 1962లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

చంద్రచూడామణి దేవ్ సోదరుడు, కురుపాం రాజా వైరిచెర్ల దుర్గాప్రసాద్ వీరభద్ర దేవ్ బహదూర్, పార్వతీపురం తొలి శాసనసభ్యుడు. 1952లో ఈయన సోదరుడు పదవీలోనే ఉండగానే ఆకస్మికంగా మరణించడంతో 1953లో పార్వతీపురం నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో చంద్రచూడామణి దేవ్ గెలుపొంది తొలిసారి శాసనసభ్యుడయ్యాడు.[2] ఆ తర్వాత 1955లో, 1962లో తిరిగి అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందాడు. ఆ తర్వాత 1967లో నాగూరు శాసనసభ నియోజకవర్గం నుండి పోటి చేసి శత్రుచర్ల ప్రతాప్ రుద్రరాజు చేతిలో ఓడిపోయాడు. కానీ 1972లో నాగూరు శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.

నెహ్రూ తరహా సోషలిస్టు సిద్ధాంతాలను నమ్మిన చంద్రచూడామణి దేవ్‌, జవాహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, నీలం సంజీవరెడ్డి వంటి భారత జాతీయ కాంగ్రేసు నాయకులతో సన్నిహిత సంబంధాలు నెరపాడు. 1952 నుండి 1978 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు. ఈయన కుమారుడు వైరిచర్ల ప్రదీప్ కుమార్ దేవ్, ఈయన అడుగుజాడల్లో నడుస్తూ పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎన్నికయ్యాడు.[3] ఈయన కూతురు యువరాణి ఉషాదేవి, గంజాం జిల్లాలోని చికిటి శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఒడిశా శాసనసభకు ఎన్నికై నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో గృహ & పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (19 March 2019). "విలక్షణతకు మారుపేరు పార్వతీపురం". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.
  2. "పార్వతీపురం ఉప ఎన్నిక". ఆంధ్రపత్రిక. 20 September 1952. Retrieved 29 September 2024.
  3. "Biographical Sketch". indiapress.org. Retrieved 28 September 2024.
  4. "Portfolios of newly-inducted ministers in Odisha". 5 June 2022. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.