చంద్రవంకలు (వంటకం)
స్వరూపం
మూలము | |
---|---|
మూలస్థానం | ఆంధ్రప్రదేశ్ |
వంటకం వివరాలు | |
ప్రధానపదార్థాలు | బియ్యం పిండి, మైదా |
చంద్రవంకలు బియ్యం పిండి తో తయారుచేసే ఒక ఆంధ్ర పిండివంట.
కావలసిన పదార్థాలు
[మార్చు]- బియ్యంపిండి - కప్పు
- మైదా - రెండు కప్పులు
- నువ్వులు - పావు కప్పు
- నూనె- వేయించడానికి సరిపడా
- కొబ్బరి కోరు - అరకప్పు
- ఉప్పు - చిటికెడు
- బెల్లం, పంచదార, నెయ్యి - కప్పు చొప్పున
- యాలకులు - ఎనిమిది
- నెయ్యి - కప్పు.
తయారుచేయు విధానము
[మార్చు]- బియ్యంపిండి, మైదా, ఉప్పు, కొబ్బరికోరు, యాలకుల పొడి విడిగా ఓ పాత్రలోకి తీసుకుని.. కరిగించిన నెయ్యి వేస్తూ చపాతీపిండిలా కలిపి పెట్టుకోవాలి.
- అరగంటయ్యాక ఈ పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి.
- ఒక్కో ఉండను తీసుకుని వత్తుల్లా చేస్తే పొడుగ్గా వస్తాయి. అంచులు పలుచగా ఉండాలి.
- కొద్దిగా వంచి.. చపాతీ పీటపై ఉంచి.. పలుచగా వత్తితే.. చంద్రవంకలా వస్తుంది. అలా మిగతా వాటినీ చేసుకోవాలి.
- ఇప్పుడు వెడల్పాటి పాత్రలో బెల్లం, పంచదార, కాసిని నీరు తీసుకుని గట్టిపాకం పట్టాలి.
- చేసి పెట్టుకున్న చంద్రవంకలపై నువ్వులు చల్లి, నూనెలో బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి.. బెల్లం పాకంలో వేయాలి. కాసేపటికి పాకం చంద్రవంకలకు పడుతుంది.
- ఇవి రుచిగా ఉంటాయి. ఇవి నెలరోజుల దాకా నిల్వ ఉంటాయి.