చంపై సోరెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంపై సోరెన్
చంపై సోరెన్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 ఫిబ్రవరి  2
గవర్నరు సీ.పీ. రాధాకృష్ణన్
ముందు హేమంత్ సోరెన్

షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు & వెనుకబడిన తరగతుల సంక్షేమం శాఖ మంత్రి
పదవీ కాలం
29 డిసెంబర్ 2019 – 31 జనవరి 2024

శాసనసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2005
ముందు అనంత్ రామ్ తుడు
నియోజకవర్గం సెరైకెల్ల

వ్యక్తిగత వివరాలు

జననం నవంబర్ 1956
జిలింగ్‌గోరా గ్రామం, సరాయికేలా ఖర్సావా జిల్లా, ఝార్ఖండ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా
సంతానం నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు[1]

చంపై సోరెన్ ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సెరైకెల్ల శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై జార్ఖండ్ ప్రభుత్వంలో మంత్రిగా, 2024 జనవరి 31న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ రాజీనామా చేయడంతో జేఎంఎం సీనియర్‌ నాయకుడిగా ఉన్న చంపై సోరెన్‌‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించారు.[2][3] చంపయి సోరెన్ 2024 ఫిబ్రవరి  2న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో శిబు సోరెన్‌తో కలిసి చంపై చురుగ్గా పాల్గొన్ని ‘జార్ఖండ్ టైగర్’గా పేరు తెచ్చుకున్నాడు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఆయన సరైకేలా నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత జార్ఖండ్ ముక్తి మోర్చాలో చేరి మంత్రిగా పని చేశాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
సంవత్సరం పదవి
2005 - 2009 2వ జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు
2009 - 2014 3వ జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు
  • క్యాబినెట్ మంత్రి - సైన్స్ అండ్ టెక్నాలజీ, లేబర్, హౌసింగ్ (11 సెప్టెంబర్ 2010 – 18 జనవరి 2013)
  • క్యాబినెట్ మంత్రి - ఆహార, పౌర సరఫరాలు, రవాణా (13 జూలై 2013 – 28 డిసెంబర్ 2014)
2014 - 2019 4వ జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు
2019 - 2024 5వ జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు
  • క్యాబినెట్ మంత్రి - రవాణా, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు & వెనుకబడిన తరగతుల సంక్షేమం
2024 - ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రి (నియమించబడినది)

మూలాలు

[మార్చు]
  1. 10TV Telugu (31 January 2024). "ఝార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌ రాజీనామా.. కొత్త సీఎంగా చంపై సోరెన్.. ఈ 'జార్ఖండ్ టైగర్' ఎవరో తెలుసా?" (in Telugu). Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Andhrajyothy (31 January 2024). "హేమంత్ సోరెన్ రాజీనామా.. కొత్త సీఎంగా చంపయి సోరెన్." Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
  3. V6 Velugu (2 February 2024). "ఉత్కంఠకు తెర.. జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం". Archived from the original on 3 February 2024. Retrieved 3 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Andhrajyothy (2 February 2024). "వీడిన సస్పెన్స్.. సీఎంగా ప్రమాణం చేసిన చంపయి సోరెన్." Archived from the original on 18 February 2024. Retrieved 18 February 2024.