Jump to content

దుర్గానంద్

వికీపీడియా నుండి
(చక్రాల దుర్గానందరాజు నుండి దారిమార్పు చెందింది)

దుర్గానంద్ అవిశ్రాంతంగా సాహితీ సృజన చేసి ఆనాటి విమర్శకుల దృష్టి నాకర్షించి కొత్త ఆలోచనలు రేకెత్తించిన వినూత్న భావకవి.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

దుర్గానంద్ జనవరి 12 1927లో తెనాలి దగ్గర మోదుకూరులో జన్మించారు. వీరి పూర్తిపేరు చక్రాల దుర్గానందరాజు.[2] దుర్గానంద్ మీద గంథకుటి సాహిత్య మాసపత్రికలో ఓ ప్రత్యేక సంచికను విడుదల చేసింది. వీరి గ్రంథాలన్నింటినీ క్లుప్తంగా సమీక్షించింది. దుర్గానంద్ 1959వ సంవత్సరంలో అలనాటి ప్రముఖ సాహిత్య పత్రిక ‘స్రవంతి’లో రామాయణ కల్పవృక్షం కావ్యదోషాలపై వరుసగా వ్యాసాలు ప్రకటించారు. తప్పుల్ని ధైర్యంగా ఎత్తిచూపారు. మూల రచయిత వాల్మీకి శ్రీరామచంద్రుడికి ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ఆపాదించినప్పుడు దాన్ని చెడగొట్టే హక్కు విశ్వనాథకే కాదు, ఎవరికీ ఉండదని, కావాలంటే వారు వారి వారి స్వతంత్ర రచనలను వారి ఇష్టం వచ్చినట్లు రాసుకోవచ్చునని... ఇక్కడ అనువాదకుడు లేదా అను సృజనకర్త తన పరిమితులను తాను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నిర్మొహమాటంగా చెప్పారు.[3] జాతీయ స్థాయిలో జ్ఞాన్‌పీఠ్‌కు ఎన్నిక జరుగుతున్నప్పుడు జ్యూరీ మెంబర్‌గా ఉన్న దుర్గానంద్ విశ్వనాథ పేరు సూచించి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఒక తెలుగువాడికి గౌరవం దక్కుతున్నప్పుడు దుర్గానంద్ విభేదాల్ని పక్కనపెట్టిన విషయం కూడా మనం మరువకూడదు.

కవిగా

[మార్చు]

ఈయన కాలంతో కదిలే చేవగల కవి గనుక శాస్త్రీయ పదాల మూలాల్లోంచి కవిత్వాన్ని ధ్వనింపచేసిన కవిగా కావ్య పరిధుల్ని పెంచాడు. ఈయన్ని గూర్చి జాషువా "దుర్గానంద్ శాస్తవ్రాదాన్ని ఊతగాగొని కావ్య పరిధుల్ని పెంచుతున్నాడు, కొత్తదారులు వేసుకుంటున్నాడు.ఊర్ధ్వగామి. కొత్త కఱ్ఱులు చాస్తున్న స్వభావం. తాను వేసే ప్రతి అడుగులోను కొత్త చప్పుడు నింపుతున్నాడు" అంటూ కొనియాడారు. ఈయన కవిత్వం వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉన్నప్పటికీ మార్క్సిజానికి అతీతమైన తనదైన ‘సృజనకర్తల రాజ్యం’ అనే ప్రతిపాదన సాహిత్య పరిధిలోకి తెచ్చాడు. శ్రమజీవుల రాజ్యం అనే పదబంధానికి బదులు ‘సృజన కర్తల రాజ్యం’ అనే పదబంధాన్ని ప్రవేశపెట్టారు. నాణానికి, ధనానికి మధ్య ఉన్న అంతరువును తెలియజేస్తూ సాలుసరిగా కరెన్సీ రద్దు విధానం ప్రవేశపెట్టినట్టయితే వస్తుమార్పిడికి టోకెనుగా నాణాన్ని మార్చినట్లయితే, ధనాన్ని అక్రమంగా సంపాదించి స్వదేశాల్లోనో, విదేశాల్లోనో నిల్వపెట్టుకునే పద్ధతి నశిస్తుందని భావించాడు. దీనినే ఆయన కమ్యూనిజంలో వ్యక్తి స్వేచ్ఛ అన్నారు. లేదా స్వేచ్ఛాయుత కమ్యూనిజం అన్నారు. లేదా సాఫ్ట్ కమ్యూనిజం అన్నారు. ఈ ప్రపంచమంతా ప్రవాహమయం అంటూ ‘జీవితం మరణంలోకి ప్రవహిస్తుంది, పురుషుడు స్ర్తిలోకి ప్రవహిస్తున్నాడు, ప్రతీదీ ప్రవహించుకుంటూ పోతుంది అనేది వీరి భావన. స్ర్తితత్వం మహోన్నమైనదిగాను, పురుషుడి చివరిదశ స్ర్తితత్వంలోకి మారిపోవడమేనంటారు. కర్కశత్వం పురుషుని తత్వమని, మృదుల స్వభావం స్ర్తి తత్వమని నిర్ధారిస్తూ వారు వీరు వీరు వారుగా కాలప్రవాహంలో మారుతూ వారి తత్వ బేధాలను వ్యక్తీకరిస్తుంటారనేది వీరి వాదం. పద్యం, గేయం వచన కవిత్వం, సాహిత్య రూపాలన్నింటిలోను వీరిదంటూ ఓ ముద్ర వేసుకోగలిగారు.

1960నాటి తొలి రోజుల్లో దుర్గానంద్‌ తెలుగు చేసిన గీతాంజలి లో ‘మొగలాయిల బహిఃప్రాణ సౌందర్యాన్ని చూపించింది తాజ్‌మహల్‌ అయితే హిందువుల అంతఃస్సౌందర్యాన్ని చూపించింది గీతాంజలి. గీతాంజలిని అనువదించి నా శిల్పాన్ని సంస్కృతీకరించుకున్నాను’ అని చెప్పుకున్నారు దుర్గానంద్‌.[4]

రచనలు

[మార్చు]
ముద్రిత కావ్యాలు
  • అంతర్గోళాలు (కవితా సంపుటి)
  • ‘మధూలిక’
  • భీతాంగన
  • జూనా ప్రణయగాథ (పద్యం)
  • రంగపతి (నవల)
  • గ్రంథచౌర్యం జాగ్రత్తలు
  • గీతాంజలి (స్వేచ్ఛానువాదం)
  • సూరదాసుపదాలు
  • ఫిరదౌసీ (హిందీ భాషలోకి తర్జుమా)
  • ఘెరావ్ కవితలు,
  • సృజన కర్త శంఖారావం, [5]
  • డ్రీమ్స్ కాలనీ (ఇంగ్లీషు),

అముద్రితాలు ఎనిమిది నవలలు ఖండకావ్యాలు ఉన్నాయి. దుర్గానంద్ కళాపీఠ వారు కొన్నింటిని ప్రస్తుతం వెలుగులోకి తెస్తున్నారు.

మరణం

[మార్చు]

ఈయన మే 7 1985 న మరణించారు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]