చనాక వెలెగెదర
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఉడ వలవ్వే మహిమ్ బండారాలగే చనక అసంక వెలెగెదర | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | మాతలే, శ్రీలంక | 1981 మార్చి 20|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | వేలే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 11 అం. (1.80 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్ బౌలింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 107) | 2007 డిసెంబరు 18 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2014 ఆగస్టు 14 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 138) | 2009 డిసెంబరు 15 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2010 జూన్ 22 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 34) | 2010 ఏప్రిల్ 30 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2010 మే 9 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007/08–present | Moors Sports Club | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012/–present | Wayamba | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016-present | Tamil Union | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2015 ఫిబ్రవరి 13 |
ఉడ వలవ్వే మహిమ్ బండారాలగే చనక అసంక వెలెగెదర, శ్రీలంక మాజీ క్రికెటర్. ఇతను క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లలో ఆడాడు.
జననం
[మార్చు]ఉడ వలవ్వే మహిమ్ బండారాలగే చనక అసంక వెలెగెదర 1981, మార్చి 20 న శ్రీలంకలోని మాతలేలో జన్మించాడు. మాతలేలోని సెయింట్ థామస్ కళాశాలలో, కురునెగలలోని మలియదేవ కళాశాలలో చదివాడు. పాఠశాల స్థాయిలో తన బౌలింగ్ ప్రదర్శనతో జాతీయ జట్టులోకి ప్రవేశించే భవిష్యత్తు అవకాశాలను అందుకున్నాడు.
క్రికెట్ రంగం
[మార్చు]ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ గా, ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఎ క్రికెట్ రెండింటిలోనూ మంచి బౌలింగ్ సగటును కలిగి ఉన్నాడు. మూర్స్ స్పోర్ట్స్ క్లబ్, నార్త్ సెంట్రల్ ప్రావిన్స్ క్రికెట్ క్లబ్‌లో ఆడాడు. 2007 శ్రీలంక పర్యటనలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ కోసం శ్రీలంక ఎ జట్టుకు పిలవబడ్డాడు. 2004 ఆగస్టు 17న 2004 ఎస్ఎల్సీ ట్వంటీ20 టోర్నమెంట్‌లో మూర్స్ స్పోర్ట్స్ క్లబ్ తరపున ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[1]
వారసత్వం
[మార్చు]2015 ఏప్రిల్ 6న సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌పై ట్వంటీ20 క్రికెట్ చరిత్రలో ఇతను అత్యుత్తమ ఆర్థిక స్పెల్‌ను నమోదు చేశాడు. ఇతని స్పెల్ 4 ఓవర్లు, 2 మెయిడిన్లు, నాలుగు వికెట్లు తీసి కేవలం రెండు పరుగుల (4-2-2-4)తో ముగించాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ 4-3-2-2 స్పెల్‌ను బద్దలు కొట్టాడు.[2] ఆ తర్వాత ఈ రికార్డును 4-3-1-2తో పాక్ పేసర్ మహమ్మద్ ఇర్ఫాన్ బద్దలు కొట్టాడు.
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]2007 డిసెంబరు 18న గాలేలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడవ టెస్టులో తన టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. 2008 వెస్టిండీస్ పర్యటన కోసం శ్రీలంక టెస్ట్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు. 2009 నవంబరులో రెండవ టెస్టు ఆడాడు. సిరీస్‌లో మూడు టెస్టులు ఆడటానికి కొనసాగాడు. ఇంగ్లాండ్‌కు చెందిన పాల్ కాలింగ్‌వుడ్ ను తొలి టెస్టు వికెట్ గా తీశాడు.
2009 డిసెంబరులో భారతదేశానికి వ్యతిరేకంగా ఆడేందుకు శ్రీలంక వన్డే ఇంటర్నేషనల్ జట్టులో చేర్చబడ్డాడు. డిసెంబర్ 15న రాజ్‌కోట్‌లో క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. 100 ఓవర్లలో 825 పరుగులు చేసిన మ్యాచ్‌లో 2/63 గణాంకాలను ఇచ్చాడు. ఓవర్లలో వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి వికెట్లు తీశాడు. భారత్‌పై ఐదు వికెట్లు కూడా సాధించాడు.
సుదీర్ఘ ఫార్మాట్‌కు లసిత్ మలింగ రాజీనామా చేసిన తర్వాత అతను 6 సంవత్సరాలపాటు శ్రీలంక ప్లేయింగ్ XIలో స్థిరమైన ఆటగాడిగా ఆడాడు.[3]
టెస్ట్ క్రికెట్ తర్వాత
[మార్చు]వెలెగెదర 2015లో ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళాడు. 2015/16 ఆస్ట్రేలియన్ క్రికెట్ సీజన్ కోసం స్థానిక విక్టోరియన్ క్రికెట్ జట్టు వెస్ట్‌మీడోస్ కోసం ఆడటం ప్రారంభించాడు. మొదటి సీజన్‌లో 13.38 సగటుతో 146 ఓవర్లు, 27 మెయిడిన్లు, 34 వికెట్లు సాధించాడు. వెస్ట్‌మీడోస్‌కు కోచ్‌గా నియమించబడ్డాడు.
మూలాలు
[మార్చు]- ↑ "1st Round, Colombo, Aug 17 2004, Twenty-20 Tournament". ESPNcricinfo. Retrieved 2023-08-22.
- ↑ "Sri Lankan equals T20 world record". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 2023-08-22.
- ↑ Frindall, Bill (2009). Ask Bearders. BBC Books. p. 203. ISBN 978-1-84607-880-4.