Jump to content

చర్చ:అత్తిలి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

చేయాల్సిన పనులు

[మార్చు]

వ్యాసం మరింత విస్తరించడంలో భాగంగా చేయవలసిన పనులు:

  • చారిత్రక అనుబంధం టేబుల్ ఏర్పాటుచేయాలి. అంటే, చారిత్రకంగా ఈ గ్రామం ఏయే కాలాల్లో ఏయే పాలకుల పరిపాలనలో ఉందన్నది తెలిసేలా ఓ చిన్న టేబుల్. ఉదాహరణకు Belgrade వ్యాసంలో Middle Ages విభాగంలోని టేబుల్
  • ఫోటోలు (తీయడం కానీ, తీసినవారితో చేర్పించడం కానీ చేయాలి)
    • విహంగ వీక్షణ ఫోటోలు
    • అత్తిలి కాలువ ఫోటో
    • అత్తిలి షష్టి ఫోటోలు (వీలైతే అత్తిలి షష్టి రాత్రిపూట విహంగ వీక్షణం ఫోటో)
    • సిద్ధేశ్వరస్వామి ఆలయం మెరుగైన ఫోటోలు
    • అత్తిలి మార్కెట్ యార్డు - పనిలో ఉన్నప్పటి చిత్రాలు
    • మదర్ మెర్సిల్లా పాఠశాల, ప్రభుత్వ కళాశాల చిత్రాలు
    • అత్తిలి కాలువ గట్టుపైన, కోడూరు-నల్లజర్ల రోడ్డు ముఖంగా ఉన్న విగ్రహాలు.
      • అన్నీ కలిపి ఒక ఫోటో, ఒకటి రెండు విగ్రహాలు విడిగా (లేదా) అన్ని విగ్రహాలకు విడి విడి ఫోటోలు తీసి కొలాజ్ చేయాలి
    • అత్తిలిలో బ్రహ్మానందం చేసిన కార్యక్రమాల్లో ఫోటో కానీ, అత్తిలి వాళ్ళతో బ్రహ్మానందం ఫోటో కానీ సంపాదించి, సీసీ-బై-ఎస్.ఎ.లో విడిపించి వేయాలి.
  • వ్యాస భాగాల విభజన, సర్దడం సరిగా పూర్తిచేయాలి. ఉదాహరణకు సంస్కృతిలో ఉన్న వివిధ అంశాలను ఎలా విభజించాలో ఆలోచించాలి. సంస్కృతిలోకి సాధారణంగా దేవాలయాలు, పండుగల, కళలు, సాహిత్యం-పత్రికలు, ఆహారం రావడం కద్దు, ఐతే - విద్య ఒక్కొక్క వికీపీడియా వ్యాసంలో సంస్కృతిలోనే పెట్టారు. (ఉదా: Canberra) అలా కాకపోతే విద్య దేనిలోకి వెళ్తుంది? పరిపాలనలోకా? సౌకర్యాలలోకా? ఆలోచించుకోవాలి. ఇదేమీ కాక తగినంత సమాచారం సేకరిస్తే ప్రత్యేక విభాగం చేర్చవచ్చు. (ఉదాహరణ:Boston) అలానే విభాగాలు ఉపవిభాగాల విభజన బాగా చేయడానికి కొన్ని ఉదాహరణ వ్యాసాలు: Cleveland
  • అత్తిలి కాలువ పొడవునా, కోడూరు-నల్లజర్ల రోడ్డు ముఖంగా వరుసాగ్గా ఏర్పాటుచేసిన వివిధ విగ్రహాల గురించి సంస్కృతిలో రాయాలి. రిఫరెన్సులు, ఫోటోలు సేకరించి పెట్టాలి.
  • భౌగోళికం అన్న విభాగం పెట్టి గ్రామ భౌగోళిక వివరాలు అక్కడ రాయాలి. ఇందుకు సమాచారం అందుబాటులో లేదు. సేకరించాలి.
  • రవాణా సౌకర్యాల గురించి వేరే విభాగం రాయాలి. అందులో రోడ్డు, రైల్వే, జల మార్గం (చారిత్రకం) విడి విడిగా రాసుకోవాలి.
  • గ్రామంలోని సినిమా థియేటర్లైన వెంకట్రామా థియేటర్, కనకదుర్గ థియేటర్, గణేష్ మహల్ ల గురించిన వివరాలు ఏ మూలాల్లోనూ లభ్యం కావడం లేదు. దొరకబట్టుకుని రాయాల్సి ఉంది. గ్రామం, పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగులు జరిగివుంటే తెలుసుకుని సమాచారం పట్టుకుని రాయాలి.
  • ప్రముఖుల గురించి ప్రత్యేక విభాగం పెట్టి జాబితా వేయనక్కరలేదు. అత్తిలికి చెందిన ప్రముఖుల జాబితా అన్న వేరే పేజీ రూపొందించి అక్కడకు లింకులు ఇచ్చి, ఇక్కడ మాత్రం సంబంధిత విభాగాల్లో సమయానుకూలంగా ప్రస్తావిస్తే బావుంటుంది. ఉదాహరణకు: Manchester వ్యాసంలో Culture విభాగం

క్రమేపీ ఒక్కొక్కటి పూర్తిచేస్తూ ఇక్కడ టిక్ చేస్తూండడం, ఏదైనా కొత్త మెరుగుదల తట్టినప్పుడు ఇక్కడ నమోదు చేయడం చేస్తూ పోతే సర్వాంగ సుందరంగా వ్యాసం తయారవుతుంది. --పవన్ సంతోష్ (చర్చ) 05:14, 15 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]