చర్చ:అల్లసాని పెద్దన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అసమగ్రం, అనవసరం[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ పేజీలో ఆంధ్ర కవితా పితామహుడు అన్న పేరు నలుగురికి ఉందని ఉంటే ఆసక్తి చూపాను. తీరాచూస్తే ముగ్గురి పేర్లు రాయనే లేదు. సహజంగా పితామహుడని, పిత అనీ ఉండే బిరుదులు ఒక్కరికే ఉంటాయి. ఇద్దరికి ఉండడం అసహజం, అనుచితం. ఆంధ్ర కవితా పితామహుడు ఒక్కడే-అల్లసాని పెద్దన. ఆదికవి నన్నయ ఐతే ఆంధ్రకవితా పితామహుడన్న పేరు ఆయన తర్వాత 4శతాబ్దాల చిన్నవాడైన అల్లసాని వానికి ఇవ్వడంలో కూడా ఔచిత్యముంది.(విశ్వనాథ వారు దాన్ని గురించి పెద్ద వ్యాసమే రాశారు.) బహుశా రచయితలు ఆంధ్ర పదకవితా పితామహుడు, ఆదికవి, ఆంధ్ర కవితా పితామహుడన్న పేర్లతో కన్‌ఫ్యూజ్ అయి ఈ వ్యాసం ప్రారంభించి ఉంటారు. (అలాగైనా ముగ్గురే అవుతున్నారు. సంస్కృత ప్రభావం తక్కువున్న భాషలో తొలి రచన చేసిన పాల్కురికి సోమనాథుని కూడా కలుపుకుంటేనే నలుగురు అవుతారు). ఏదేమైనా ఇది అసందిగ్ధంగా అనవసరమైన వ్యాసం. ఉన్న సమాచారం తక్కువ, పాక్షికంగా తప్పుడుది, ఏ మూలమూ, ఆధారమూ ఇవ్వనిది కావడంతో దీన్ని తొలగించడం కానీ అల్లసాని పెద్దనకు దారిమార్పు చేయడం గానీ వెంటనే చేయాలని ప్రతిపాదిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 11:04, 27 జూలై 2014 (UTC)

పవన్ గారి సూచనలు సరైనవే మరి. దారిమార్పు చేస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 06:08, 5 ఆగష్టు 2014 (UTC)