చర్చ:ఆండ్ర శేషగిరిరావు
జీవితకాలం
[మార్చు]ఈయన 2001 వరకు జీవించి ఉన్నట్టు దీని ద్వారా తెలుస్తున్నది. ఈ వ్యాసంలో సమాచారం అందుకు విరుద్ధంగా ఉంది. ఏది సరైనదో నిర్ధారించుకోవాలి --వైజాసత్య (చర్చ) 21:00, 4 ఆగష్టు 2013 (UTC)
నిజమే
[మార్చు]ఔను, నిజమే. ఆండ్ర శేషగిరిరావు అనే ప్రముఖుడు ముక్కామల (పశ్చిమగోదావరి జిల్లా, తణుకు తాలూకా, పెరవలి మండలం ) నివాసి. ఆయనే ఆనందవాణి పత్రికను మద్రాసు నుంచి నిర్వహించాడు. పాలకొల్లు లో తెలుగు పండితునిగా పనిచేసిన వ్యక్తి వేరు. ఇద్దరి జీవిత విశేషాలను కలగలిపి ఈ వ్యాసం లో వ్రాశారు. ముక్కామల లో నివసించిన ఆండ్ర శేషగిరి రావు సహస్రాధిక మాసజీవి. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె పేరు మలయవాసిని. ఈమె ఆంధ్ర విశ్వకళాపరిషత్తు లోని తెలుగుశాఖ లో ఆచార్యపదవిలో ఉండి, పదవీ విరమణ చేసింది. రెండవ కుమార్తె పేరు కమలవాసిని. ఈమె ఆంధవిశ్వకళాపరిషత్తులోని చరిత్ర విభాగం లో ఆచార్య పదవి లో పదవీ విరమణ చేసింది. కుమారుడు రవి ప్రసాద్ కూడా ఆంధ్ర విస్వకళాపరిషత్తు లోని కెమికల్ ఇంజినీరింగు శాఖ లో ఆచార్య పదవిలో పనిచేసి పదవీ విరమణ చేశాడు.--కంపశాస్త్రి 14:40, 10 ఫిబ్రవరి 2016 (UTC)
- మొలక-తరగతి పత్రికల వ్యాసాలు
- మొలక-తరగతి కొంచెం ముఖ్యమైన పత్రికల వ్యాసాలు
- కొంచెం ముఖ్యమైన పత్రికలు వ్యాసాలు
- మొలక-తరగతి తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- మొలక-తరగతి కొంచెం ముఖ్యమైన తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- కొంచెం ముఖ్యమైన తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఇంకా విలువకట్టని తెలుగు సమాచారం అందుబాటులోకి వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు సమాచారం అందుబాటులోకి వ్యాసాలు