చర్చ:ఆంధ్రప్రదేశ్ హేతువాద మానవవాద ఉద్యమాల చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పుస్తకాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


విస్తరణ కొరకు మనవి

Main Stream Literature కాని (అంటే పలుచోట్ల ప్రస్తావించబడని) ఇలాంటి పుస్తకాలు గురించి ఇతర సభ్యులు వ్రాయగలిగే అవకాశం చాలా తక్కువ. ఇలాంటి వ్యాసాలు మొదలు పెట్టిన రచయితలకు ఆ పుస్తకం అందుబాటులో ఉండవచ్చును గనుక వారే ఈ వ్యాసాన్ని మరి కొంత విస్తరించాలని మనవి (రహమతుల్లా గారూ!). అలా కాకుంటే ఈ వ్యాసం {{చాలా కొద్ది సమాచారం}} కోవలోకి వెళుతుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:21, 3 డిసెంబర్ 2008 (UTC)

కాసుబాబూ, రాజశేఖర్ లాగా మీరుకూడా ఉదారవాదిలా కనిపిస్తున్నారు.వ్యాసాన్ని తీసెయ్యకుండా విస్తరించాలని నాకే మనవి చేశారు. నార్లవారికిమల్లే నా సొంత లైబ్రరీలో కూడా వేలాది పుస్తకాలున్నాయి. కానీ సొంతబుర్రలేకవాటిల్లోంచి కాపీకొట్టే ఈపాటి సమాచారం ఇప్పటివరకు వికీలో పెట్టాను. కొందరు సభ్యులు చెప్పిన వికీ నియమాల ప్రకారం మనం చదివిందాన్ని తిరగరాస్తే సరి. ఇంకేమన్నా షరతులుంటే ముందే చెప్పండి ఆ పరిమితుల్లోనే రాస్తాను. అసలు ఈ వ్యాసాన్ని హేతువాదులు వ్యాసంలో కలిపేయండి. రాసేదేదో అక్కడే రాస్తాను.--Nrahamthulla 14:09, 3 డిసెంబర్ 2008 (UTC)

కలుపవచ్చును. కాని ఇది "తెలుగు అకాడమీ" వారి ముద్రణ మరియు ఉద్యమాల చరిత్ర ("ఫిక్షన్" కాదు) గనుక పుస్తకంలో తప్పక విలువైన సమాచారం ఉంటుంది. ప్రత్యేక వ్యాసంగా వ్రాస్తే బాగుంటుంది. పుస్తకాల గురించి వ్రాసే వ్యాసాలలో ఇలాంటి విషయాలు ఉంటే సమంజసంగా ఉంటుంది. ప్రయత్నించండి.

  • ఆ పుస్తకం గురించి - రచయిత, ప్రచురణ, నేపధ్యం.
  • దానికి లభించిన ఆదరణ (ఉంటే) మరియు దాని గురించి ప్రముఖుల అభిప్రాయాలు (మీవి కావు)
  • అందులోని విషయాలు క్లుప్తంగా - (విషయ సూచిక లాంటిది) - ఒకో చాప్టరు గురించి ఒకటి రెండు పేరాలు వ్రాస్తే చాలా బాగుంటుంది.
  • ఉదాహరణగా కొన్ని పేరాలు (యధా తధంగా ఉండవచ్చును. ఫలాని పుస్తకం నుండి తీసుకున్నామనేది ఇలాంటి వ్యాసంలో నేరుగా తెలుస్తూనే ఉన్నది గనుక)

ఇక ఉదారవాదం గురించి - ఒక విషయంపై భిన్నాభిప్రాయాలు తప్పవు. వాటిని సహించడమే వికీ పరిధిలో ఉదారవాదం. వ్రాతలను, చర్యలను గురించి మర్యాదపూర్వకమైన విమర్శను అంగీకరించడం వికీ మౌలిక సూత్రం. మీ రచనలలో నేను విభేదించిన విషయాలు మీకు ఇదివరకు స్పష్టంగా చెప్పాననుకొంటాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:48, 3 డిసెంబర్ 2008 (UTC)