Jump to content

చర్చ:ఆంధ్రరాష్ట్ర ఉద్యమం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ప్రభాకర్ గారూ, తెవికీలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అనే వేరే పేరుతో ఈ వ్యాసం ఎప్పటి నుండో ఉంది. అందులోని పాఠ్యాన్ని కాపీ చేసి బయటి సైట్లలో పెట్టేసుకోడం గతంలో చూసాన్నేను. భూమి గుండ్రంగా ఉందన్నట్టుగా, అదే పాఠ్యం తిరిగి తిరిగి మళ్ళీ మనదగ్గరికి వచ్చినట్టుంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు పేజీలో ఇంకా ఏమైనా సమాచారం చేర్చదలిస్తే చేర్చి, ఈ పేజీని దారిమార్పుగా చేస్తే మంచిది. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 15:23, 4 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు, ఆంధ్రరాష్ట్ర ఉద్యమంను ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు లో విలీనం చేసినా లేదా దారిమార్పుగా చేసినా పర్వాలేదండి. ఇంకా ఏమైనా సమాచారం దొరికితే తర్వాత జోడింపు చేస్తాను, __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:11, 4 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, విలీనం చెయ్యడానికి ఇక్కడ సరుకేమీ లేదండి. మన ఒరిజినల్ వ్యాసంలో ఉన్నదే ఇందులో ఉంది. వ్యాస విషయానికి సంబంధించిన సమాచారం అదనంగా ఏమీ లేదు. అదనంగా సమాచారం ఏదైనాఉందీ అంటే అది వ్యాస విషయానికి సంబంధం లేనిదే. అది కూడా వికీలో ఈసరికే ఉన్న రెండు వేరువేరు పేజీలనుండి కాపీ కొట్టినదే. అంచేత విలీనం చెయ్యడానికేమీ లేదు.. తొలగించడమే!
బయటినుండి వ్యాసాలను తెచ్చి వికీలో పెట్టేముందు అందరం గమనించాల్సినవికొన్నున్నై:
  1. కాపీ హక్కుల ఉల్లంఘన కాకూడదు.
  2. కాపీ హక్కులు ఉన్నా లేకున్నా.. వాక్యాలను ఉన్నవి ఉన్నట్టుగా ఎత్తి ఇక్కడ పెట్టెయ్యకూడదు. పూర్తిగా మన స్వంత వాక్యాల్లో రాయాలి.
  3. అలా రాసాక ఆ సైటును ఇక్కడ మూలంగా ఉదహరించాలి.
  4. మరో సంగతి.. మొత్తం వ్యాసమంతా ఒకే మూలం నుండి తెచ్చి పెట్టడం అంత సముచితం కాదు, వాంఛనీయమూ కాదు.
ధన్యవాదాలు.__ చదువరి (చర్చరచనలు) 17:16, 4 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పర్వాలేదండి. తొలగించండి ... __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 18:25, 4 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ప్రధానబరి పేజీలో ఉన్న సమాచారం ఎక్కడిదంటే..

[మార్చు]

ఈ ప్రధాన బరిలో ఉన్న పేజీలోని సమాచారమంతా వాడుకరి:Chaduvari/ఆంధ్రరాష్ట్ర ఉద్యమం గురించి అనే పేజి నుండి తెచ్చినదే. ప్రభాకర్ గారూ, ఆ సమాచారం అంతా ప్రధానబరిలో ప్రచురించేముందు రాసిపెట్టుకున్నది. దాన్ని మూణ్ణాలుగు పేజీలుగా ప్రచురించెయ్యడం జరిగిపోయింది. అయితే ఆ పేజీలో నేను ఈ మధ్య "ఆ తరువాత దీన్ని ప్రచురించినట్టు లేను. ఈ పాఠ్యానికి తగు మూలాలను సేకరించి సంబంధిత పేజీల్లో పెట్టాలి. ఎవరైనా పెట్టొచ్చు." అని రాసాను. బహుశా అది చూసి మీరు ప్రచురించేసారనుకుంటాను. __చదువరి (చర్చరచనలు) 02:00, 5 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు, ఎవరైనా పెట్టొచ్చు." అని రాసారు. అవునండి, అది చూసే నేను ప్రచురించాను. తొలగించారు, కదా పర్వాలేదు, __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 06:11, 5 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]