Jump to content

చర్చ:ఆచార్య ఫణీంద్ర

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: తరలింపు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


తరలింపు

[మార్చు]

వ్యాసాన్న వ్యక్తి అసలుపేరుకు తరలించాలి. ఆచార్య పదం వృత్తిపరమైనది కాదు స్వంతంగా వాడుకున్నట్లుగా వుంది. అటువంటి వాటిని వికీలో వాడనవసరంలేదు. పాఠ్యం చేర్చిన వారిలో ఎక్కువమంది అనామకులే. పాఠ్యం 50% పైగా చేర్చిన రమణ గారు, సహసభ్యులు స్పందించండి. అర్జున (చర్చ) 00:18, 17 మార్చి 2021 (UTC)ప్రత్యుత్తరం

అర్జున గారూ, అతనికి సంబంధించిన మూలాలన్నింటినీ పరిశీలించండి. అన్నింటిలో "ఆచార్య ఫణీంద్ర" అనే ఉన్నది. రచనలలో కూడా అనే పేరు ఉన్నది. కీర్తి పురస్కారాలు అందజేసే జాబితాలో, world catidentities అన్నింటిలో కూడా పేరు "ఆచార్య ఫణీంద్ర" అని ఉన్నది. అతని స్వంత పేరు తెలిపే మూలాలు లభించుటలేదు. అతను ఈ పేరుతోనే గుర్తింపు పొందినందున ఈ పేరు ఉపయోగించుటలో తప్పు లేదని నా అభిప్రాయం. -- K.Venkataramana -- 11:53, 17 మార్చి 2021 (UTC)ప్రత్యుత్తరం
User:K.Venkataramanaగారు, పుస్తకాలలో వాడిన పేరు world catidentities లో వుంటుంది. దానిని ప్రామాణికంగా స్వీకరించలేము. ఇతర వ్యాసాలకు పేర్లు ఎలా వున్నాయో ఆంగ్ల వికీలో పరిశీలించాను. మహాత్మా గాంధీ అనే పేరు ఆంగ్ల వికీలో వాడారు, మహాత్మ అనే పదానికి చరిత్ర వుంది గాంధీగారు స్వంతంగా చేర్చుకున్నది కాదు. కొన్ని భాషలలో అసలు పేరు వాడారు. సరియైన మూడవ పక్ష ఆధారాలుంటే పేరులో విశేషణాలుండవచ్చు.
నేను వెతికినా, విశ్వసనీయమైన మూలాలు ఏవి కనబడలేదు. చేర్చిన జీవిత విషయం సమాచారానికి మూలాలు లేనందున, చాలా వివరం అనామకులు చేర్చినందున ఈ వ్యాసం తొలగించడం మంచిదని నా అభిప్రాయం.--అర్జున (చర్చ) 23:17, 18 మార్చి 2021 (UTC)ప్రత్యుత్తరం
అర్జున గారూ, ఈ వ్యాసంలో మూలాలు లేని సమాచారాన్ని తొలగించవచ్చు. అనామకులు మూలాలు లేని సమాచారాన్ని ఎక్కువగా ఈ వ్యాసంలో చేరుస్తున్నారు. నోటబిలిటీ లేదని భావిస్తే ఈ వ్యాసాన్ని తొలగించినా నా అభ్యంతరం లేదు.➤ కె.వెంకటరమణచర్చ 16:08, 3 నవంబరు 2021 (UTC)ప్రత్యుత్తరం
@K.Venkataramana గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. నేను ప్రశ్న లేవనెత్తినతరువాత పూర్తి పేరు ఒక అనామక సభ్యుడు చేర్చడం జరిగింది. అసలుపేరులో కూడా ఆచార్య పదభాగం చేరి వున్నందున దానిని కలంపేరుగా వాడినట్లున్నారు. అందువలన వ్యాసపు పేరు మార్చడంపై అభ్యంతరాన్ని విరమించుతున్నాను. ప్రస్తుతానికి అనామకుల చేర్పుల నిరోధిస్తున్నాను. ఇటువంటి వ్యాసాలను సమూహంగా సమీక్షించినప్పుడు తొలగింపు పై నిర్ణయం తీసుకొనవచ్చు. అర్జున (చర్చ) 06:32, 4 నవంబరు 2021 (UTC)ప్రత్యుత్తరం

"గోవర్ధనం వేంకట ఫణీంద్ర శయనాచార్య" అన్న నా అసలు పేరు పొడుగును కుదించి, "ఆచార్య ఫణీంద్ర" ను కలం పేరుగా 50 ఏళ్ళుగా సాహిత్య లోకంలో ప్రయాణిస్తున్నాను. ఈ రకమైన కలం పేర్లు క్రొత్తేం కాదు. నా కన్న ముందు "ఆచార్య ఆత్రేయ", " ఆచార్య భావన్", "ఆచార్య తిరుమల" వంటి ప్రసిద్ధులు ఉన్నారు. వీరెవరూ వృత్తిపరంగా విశ్వవిద్యాలయాచార్యులు కారన్నది మీరెరిగిన విషయమే!

"ఆచార్య" అన్నది సనాతన శబ్దం. దానిని 19 వ శతాబ్దిలో ఆవిర్భవించిన విశ్వవిద్యాలయ వ్యవస్థకే పరిమితం చేయాలనుకోవడం అన్యాయం. తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి డా. జి.వి. సుబ్రహ్మణ్యం గారు నా కలం పేరును గూర్చి ఒక గ్రంథం "ముందుమాట" లో చేసిన ఈ వ్యాఖ్యను గమనించగలరు -

"ఫణీంద్ర గారి పేరు మొదట్లో ఉన్న 'ఆచార్య' పెట్టుడు బిరుదం కాదు, పుట్టుకతో వచ్చిన పరిమళం. 'ఆచార్య ఫణీంద్ర'- శ్రీమాన్ గోవర్ధనం వెంకట ఫణీంద్ర శయన ఆచార్య గారి కలంపేరు. కమనీయంగా కుదిరిన కలంపేరు కలవారిలో ఒకరు 'ఆచార్య ఫణీంద్ర'!

[సారీ! ఆ స్కాన్ కాపీ ఇక్కడ ఎట్లా పెట్టాలో తెలియలేదు]

ఈ రోజు సాహిత్య లోకంలో నన్ను "డా. గోవర్ధనం వేంకట ఫణీంద్ర శయనాచార్య" అంటే ఎవరూ గుర్తించరు. "డా. ఆచార్య ఫణీంద్ర" అంటే దేశ విదేశాలలో గుర్తిస్తారు.

ఇదంతా కేవలం మీ అవగానార్థం మాత్రమే వ్రాసాను. అన్యధా భావించవద్దు.