Jump to content

చర్చ:ఉప్పరగూడెం(పెద్దవంగర)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఉప్పరగూడెం(పెద్దవంగర) గ్రామపేజీపై కొన్ని సందేహాలు

[మార్చు]

ప్రభాకర్ గౌడ్ నోముల గారూ నమస్కారం.గ్రామ వ్యాసాలలో మీరు చేస్తున్న సవరణలకు ధన్యవాదాలు.ఉప్పరగూడెం(పెద్దవంగర) గ్రామ వ్యాసం సృష్టిింపు, అందులో నింపిన డేటాపై కొన్ని సందేహాలు ఉన్నవి.

  • ఇది రెవెన్యూయోతరగ్రామం.దీనికి ఎటువంటి డేటా ఉండదు.
  • దీనిలో మీరు చేర్చిన డేటా వివరాలు అదే మండలంలోని పోచంపల్లి(పెద్దవంగర) గ్రామ వ్యాసంలోని డేటా మొత్తం ఎక్కించారు.అంటే దీనిలోని పూర్తి వివరాలు ఈ గ్రామానికి చెందినవికావని తెలుస్తుంది.కాకపోతే జనాభా వివరాలు కొద్దిగా తేడా చూపించారు.
  • ఈ వ్యాసంలో ఉన్న సమాచారపెట్టెలో నింపిన జనాభా వివరాలుకు పొంతనలేదు. అవి పెద్దవంగర గ్రామ వ్యాసంలోని జనాభా వివరాలతో నింపారు.
  • ఈ గ్రామం జనగణన లొకేషన్ కోడ్ 578278, పోచంపల్లి(పెద్దవంగర) గ్రామజనగణన లొకేషన్ కోడ్ 578278. రెండూ ఒకెే రకంగా ఉన్నవి.అలా ఉండటానికి అవకాశంలేదు.

దీనిని మీరు ఏ ఉద్దేశ్యంతో సృష్టించి, ఆ డేటా నింపినదానిపై వివరణ ఇవ్యగలరు. యర్రా రామారావు (చర్చ) 05:17, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ నమస్కారం సార్, ఆయా గ్రామాలు నాకు ఐదు పది కిలోమీటర్ల దూరం లోనే ఉన్నాయి. ఆ గ్రామాల పేరున మన వికీపీడియాలో లేనందున ఉప్పరగూడెం పేరుతో కొత్త పేజీ చేశా. రెవెన్యూ గ్రామం గత 30 సంవత్సరాల నుండి కానీ నాకు తెలిసి ఆమ్లెట్ గ్రామం మాత్రం కాదు. అందులో కొద్ది సమాచారం తప్పుగా ఉంది. సరి అయిన సమాచారం తెలుసుకొని తప్పకుండా సరి చేస్తాను. ఒకసారి గూగుల్ లో చూడగలరు. అవి నా పక్క గ్రామాల పేజీలు మాత్రమే మరి ఏ ఉద్దేశం లేదు. అది పూర్తి సమాచారం, ముఖ్యమైన సమాచారం, నిజమైనదే ధన్యవాదాలు సార్. __ప్రభాకర్ గౌడ్చర్చ 11:13, 22 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రభాకర్ గౌడ్ నోముల గారూ ఈ గ్రామం లేదనిగానీ, మీరు పేజీని సృష్టించదానికిగానీ నేను తప్పు పట్టటంలేదు.
1.ఇది రెవెన్యూయేతరగ్రామం అని అన్నాను.దానికి మీరు ఇది రెవెన్యూ గ్రామం. గత 30 సంవత్సరాల నుండి కానీ నాకు తెలిసి ఆమ్లెట్ గ్రామం మాత్రం కాదని తెలిపారు.
  • ఇది రెవెన్యూయేతరగ్రామం అనే దానికి మండలాలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మహబూబాబాద్ కొత్తజిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం జారీచేసిన ఈ జి.ఓ. లింకు, అలాగే మహబూబాబాద్ జిల్లా అధికార వెబ్సైట్ లింకు రెండూ ఒకసారి పరిశీలించండి. అందులో పెద్దవంగర మండలంలోని గ్రామాలలో ఈ ఉప్పరపాలెం గ్రామం ఉందేమో చూడండి.
2.అలాగే రెవెన్యూయేతరగ్రామాలకు డేటా ఉండదని, దానిలో మీరు చేర్చిన డేటా వివరాలు అదే మండలంలోని పోచంపల్లి (పెద్దవంగర) గ్రామ వ్యాసంలోని డేటా మొత్తం ఎక్కించారని, ఈ వ్యాసంలో ఉన్న సమాచారపెట్టెలో నింపిన జనాభా వివరాలుకు పొంతనలేదని, అవి పెద్దవంగర గ్రామ వ్యాసంలోని జనాభా వివరాలతో నింపారని, ఈ గ్రామం జనగణన లొకేషన్ కోడ్ 578278, పోచంపల్లి(పెద్దవంగర) గ్రామజనగణన లొకేషన్ కోడ్ 578278, రెండూ ఒకే రకంగా ఉన్నవని, అలా ఉండటానికి అవకాశంలేదని వివరించగా, దానికి మీరు అందులో కొద్ది సమాచారం తప్పుగా ఉంది. సరి అయిన సమాచారం తెలుసుకొని తప్పకుండా సరి చేస్తాను. ఒకసారి గూగుల్ లో చూడగలరు. అవి నా పక్క గ్రామాల పేజీలు మాత్రమే, మరి ఏ ఉద్దేశం లేదు. అది పూర్తి సమాచారం, ముఖ్యమైన సమాచారంఅని తెలిపారు.
  • దానిలో ఎక్కించిన డేటా దానిది కాదనినేను పైన పూర్తి వివరంగా తెలిపాను.దానికి డేటా లేదని నేను చెప్పటానికి రెండు రాష్ట్రాలలో భారత జనగణన డేటా నుండి సెమీ ఆటోమాటిగ్గా తయారు చేసిన పాఠ్యాన్ని ఎక్కించటానికి గౌరవవికీపీడియన్లు అందరకి చదువరి గారే తయారుచేసి అందించారు. తెలంగాణలో ఈ జిల్లా డేటాకు పంపిన టెక్ట్ ఫైల్సులో కూడా ఈ గ్రామానికి చెందిన డేటాలేదు.అందువలన ఆ మండలంలో ఈ దిగువ వివరించిన ప్రకారం సవరించాలి.
    • ఆ గ్రామాన్ని మండలంలోని రెవెన్యూయోతరగ్రామాలు విభాగంలో చేర్చాలి.
    • ఆ గ్రామంలో నింపిన డేటాపూర్తిగా తొలగించాలి.
    • మండలంలోని గ్రామాల మూసలో ఆ గ్రామం పేరు తొలగించాలి.
    • ఆ వ్యాసానికి తగిలించిన మండలంలోని గ్రామాలు మూస తొలగించాలి.
పై వాటికి తగ్గట్టుగా మార్పులు రెండురోజులలో చేయగలరు. యర్రా రామారావు (చర్చ) 06:55, 24 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామ వ్యాసంలోని డేటా, సమాచారపెట్టెలోని వివరాలు ఈ గ్రామానికి చెందినవి కానందున తొలగించాను.. యర్రా రామారావు (చర్చ) 12:15, 17 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]