చర్చ:ఏకవర్ణ ఛాయాచిత్రకళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శశి గారూ, ఆంగ్లంలో ఏకవర్ణ ఛాయాచిత్రకళ మరియు నలుపు-తెలుపు ఛాయాచిత్రకళ అనే రెండు వ్యాసాలున్నాయి. ఈ వ్యాసం "నలుపు-తెలుపు ఛాయాచిత్రకళ" లో విలీన ప్రతిపాదన యొక్క ఉద్దేశ్యం తెలియజేయగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 16:20, 12 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణగారు, ఒక విధంగా చూస్తే ఈ రెంటికీ ఒకే వ్యాసం ఉండాలని అనిపిస్తుంది. మరొక విధంగా చూస్తే వేర్వేరుగా ఉండాలని అనిపిస్తుంది. సాధారణంగా ఏకవర్ణ ఛాయాచిత్రకళలో తెలుపుతో బాటు మరొక వర్ణం, దాని సంబంధిత రంగులు ఉంటాయి. ఉదా:
పైన తెలిపిన మూడు రకాల ఛాయాచిత్రకళలూ ఏకవర్ణ ఛాయాచిత్రకళలే. కావున బ్లాక్ అండ్ వైట్ అనునది ఏకవర్ణ ఛాయాచిత్రకళలో భాగంగానే పరిగణించవచ్చు. అయితే, ఏకవర్ణ ఛాయాచిత్రకళలో అధికంగా ఉపయోగించబడేది బ్లాక్ అండ్ వైట్ యే. (కేవలం కళాత్మకత కొరకు, అభ్యాసం కొరకు సెపియా టోన్, సయనోటైప్ లు ఉపయోగించే పాశ్చాత్యులూ ఉన్నారు. సయనోటైప్ లో మరల సుమారు 8 రకాల షేడ్ లు ఉన్నవి.) పోలరాయిడ్ సంస్థ మూతపడిన తర్వాత, దాని అభిమానులు కొందరు దానిని కొనివేసి, ఇంపాజిబుల్ ప్రాజెక్ట్ పేరు తో దానిని పున:ప్రారంభించారు. మన అయోమయాన్ని పెంచటానికి వీరు మ్యాజెంటోటైప్ (నలుపు, బూడిద బదులుగా మ్యాజెంటా రంగులు), బ్లాక్ అండ్ యెల్లో (తెలుపు బదులు పసుపుపచ్చ రంగులను) ఇటీవలె ప్రవేశపెట్టారు.
ఈ సమాచారాన్ని బట్టి వీటికి ఎన్ని వ్యాసాలు ఉండాలి అనేది నిర్ధారించగలరు. ఒకవేళ ప్రత్యేక వ్యాసాలు ఉండాలి అని అభిప్రాయపడినచో, కారణం తెలుపుతూ (మరల భవిష్యత్తులో వేరే వాడుకరులు అయోమయపడకుండా) విలీనం మూసను తొలగించగలరు. - శశి (చర్చ) 16:42, 12 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]