Jump to content

చర్చ:కె.గీత

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వీయ రచన కావచ్చు

[మార్చు]

వాడుకరి:Geetamadhavi అనే వాడుకరి, అదే పేరుతో ఉన్న వ్యక్తి గురించి రాసిన పేజీ ఇది. మొత్తం పాఠ్యంలో 82.7% చేర్చింది ఆ వాడుకరియే! (ఇదే వాడుకరి, గీతామాధవి గారి తల్లి గారి గురించి కూడా పేజీని సృష్టించారు - 89.1% పాఠ్యంతో) మన గురించి మనమే రాసుకోకూడదు అని వికీ చెప్పడం లేదు గానీ, తప్పనిసరైతే తప్ప రాసుకోవద్దు అని మాత్రం చెబుతోంది (తప్పనిసరికి ఉదాహరణ: మన గురించి ఎవరైనా చెడుగా రాస్తే దాన్ని సవరించడం). ఇది ఈ వాడుకరికి తెలిసి ఉండకపోవచ్చు.

కానీ తన గురించి తానే రాసుకోకూడదనేది ఒకరు చెబితే తప్ప తెలియనంతటి విషయమేమీ కాదు. ఆ గీతామాధవి వేరు, నేను వేరు అని ఈ వాడుకరి చెబితే.. చేసేదేమీ లేదు, ఒప్పుకోక తప్పదు. __చదువరి (చర్చరచనలు) 02:07, 18 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]


గీతామాధవి గారు మీకు వాడుకరి పేజీ ఉంది. మీ పేరున ఒక వ్యాసం పేజీ ఉంది. మీ అమ్మ గారి పేరు మీద కూడా ఒక వ్యాసం పేజీ ఉంది. మీరు నడిపిస్తున్న పత్రిక పేరున వ్యాసం ఉంది. అవి అన్ని మీరు రాసిన పేజీలు... అయినా లాగిన్ కాకుండా అజ్ఞాత వాడుకరి లాగా రాస్తూన్నారు. ఐపి అడ్రస్ నమోదు అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే లాగిన్ అయిన తర్వాత మార్పుచేర్పులు చేయండి. -- ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 06:45, 8 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]