చర్చ:కొత్తపల్లి జయశంకర్
Jump to navigation
Jump to search
- కొత్తపల్లి జయశంకర్ గారు ఆత్మకూరు (వరంగల్ జిల్లా) అక్కంపేట లో జన్మించారని రాశారు.ఈ గ్రామం ఏ మండలంలో ఉందో చెప్పగలరా?--Nrahamthulla (చర్చ) 10:45, 25 ఫిబ్రవరి 2014 (UTC)
- ఆధునిక తెలంగాణ ఉద్యమ పితామహుడిగా పేరునొందిన కొత్తపల్లి జయశంకర్ గారు జన్మించిన అక్కంపల్లి గ్రామం వరంగల్లు జిల్లా ఆత్కకూరు మండలంలో ఉంది. అయితే అక్కంపల్లి రెవెన్యూ గ్రామం కాకపోవడం వల్ల తెవికీలో ఆ గ్రామవ్యాసం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:10, 25 ఫిబ్రవరి 2014 (UTC)
- ధన్యవాదాలు చంద్రకాంద్రకాంతరావు గారూ అక్కంపల్లి ఏ రెవిన్యూ గ్రామ పరిధిలో ఉందో చెప్పగలరా? --Nrahamthulla (చర్చ) 09:01, 26 ఫిబ్రవరి 2014 (UTC)
- రహమతుల్లా గారూ, ఈ గ్రామం పేరు అక్కంపేటనే, నిన్న పొరపాటున అక్కంపల్లిగా రాశాను. అక్కంపేట గ్రామం పెద్దాపూర్ రెవెన్యూ గ్రామపరిధిలోకి వస్తుంది (2011 కోడ్ 578136). కాని ఇది (అక్కంపేట) ప్రత్యేకంగా పంచాయతీని కలిగియుంది (పంచాయతి కోడ్ సంఖ్య 213257). ఆత్మకూరు నుంచి వరంగల్ వెళ్ళు ఒక రహదారి (ప్రధాన రహదారి కాదు) అక్కంపేట, పెద్దాపూర్ గ్రామాల మీదుగా వెళుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:13, 26 ఫిబ్రవరి 2014 (UTC)