Jump to content

చర్చ:గంటె భాగవతులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వికీశైలిలో లేని శీర్షిక

[మార్చు]

ఈ శీర్షిక వికీశైలిలో లేదనిపిస్తోంది. ఎందుకంటే సాధారణంగా వార్తగానో, స్పెషల్ ఐటమ్ గానో జర్నలిస్టు మిత్రులు ఈ విషయంపై రాయదలుచుకుంటే పెట్టే శీర్షిక తెలగ దాసరులే గంటె భాగవతులు. ఐతే అది మొత్తం వ్యాసాన్ని ప్రతిపాదించకుండా వ్యాసం మధ్యలో దాగిన ఓ అంశాన్ని వివరిస్తూ ఆసక్తికరంగా ఉంటుంది. పేపర్ చేతిలోకి తీసుకున్నవారు పక్కన పెట్టేయకుండా ఉండేందుకు ఆ ఏర్పాటు. ఐతే వికీలోకి విజ్ఞాన సముపార్జన కోసమే వస్తూంటారు. అవసరం అనుకున్నంతమేరకు సమాచారం చదువుతారు. అవసరం లేదంటే చదవరు. విజ్ఞానసర్వస్వం విజ్ఞానాన్ని అందజేయడానికి, దాన్ని సమగ్రం చేయడానికి తప్ప ఆకర్షించడానికి కాదుకదా. ఒకవేళ ఆకర్షించినా సమాచారంతో ఆకర్షించాలి తప్ప ఇటువంటి పేర్లతో కాదు. ఈ కారణంగానే వికీలో విశ్వనాథ సత్యనారాయణ గురించి వ్యాసం రాస్తే విశ్వనాథ సత్యనారాయణ అనే పేరే పెడతాము-గత నెలలో విశ్వనాథ వారి 120వ జయంతి సందర్భంగా ప్రచురించిన ఓ బృహత్ వ్యాసానికి సాక్షి ఫన్‌డే వాళ్ళు పెట్టిన పేరు ఒక్కడే విశ్వనాథ. ఔచిత్యం చూస్తే విశ్వనాథ సత్యనారాయణ రచనల విషయానికి వస్తే ఆయన "ఒక్కరే" అనదగ్గ వ్యక్తే కానీ మనం అటువంటీ ప్రయత్నాలు చేయము. ఇదీ అంతే.
మొత్తానికి నా ప్రతిపాదన ఏమిటంటే ఈ వ్యాసాన్ని-తెలగ భాగవతులు లేదా గంటె భాగవతులు అన్న పేరుతో ఉండాలి తెలగ దాసరులే గంటె భాగవతులు అన్న పేజీకి కనీసం రీడైరెక్ట్ కూడా అవసరం ఉండదు.
పి.ఎస్.: మరో విషయం ఈ వ్యాసం చాలా బావుంది. ఒకప్పుడు మన సమాజాన్ని వినోదింపజేసి, అపురూపమైన సాహిత్యాన్ని తమదైన శైలిలో తేటగా అన్ని కులాలకు అందించేవారే ఆశ్రిత ఉపకులాలు. నిజానికి వీరిని ఆశ్రయించుకుని మన సర్వ కళలూ ఉండేవి. బ్రాహ్మణులకు-విప్రవినోదులు, తెలగలకు-తెలగ భాగవతులు ఇలా అన్ని కులాలకు వారి వారి ప్రత్యేకమైన కళారూపాలు, కులపురాణాలను అనుసరించి ప్రదర్శించేవారు. కులవ్యవస్థ దెబ్బతిన్నాకా దిక్కులేకుండా అయిపోయిన దురదృష్టవంతుల్లో వీరు, వీరిని ఆశ్రయించుకుని మన సమస్త కళలు, విద్యలూ ఉన్నాయి. వీటిని ప్రదర్శించేందుకు కనీసం వ్యాసాల రూపంలోనైనా ప్రయత్నిస్తున్న ఈ వ్యాసకర్తలకు ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 09:44, 30 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

భాస్కరనాయుడు గార్కి, మీరు యిదివరలో తెలగ దాసరులే గంటె భాగవతులు అనే వ్యాసం ప్రారంభించారు. వికీశైలి ప్రకారం ఈ వ్యాస శీర్షిక గంటె భాగవతులు అని ఉండాలని చర్చ:తెలగ దాసరులే గంటె భాగవతులు లో పవన్ సంతోష్ గారు వ్యక్తం చేశారు.మీరు ఆ చర్చను పరిశీలించండి. అది సరియైనదే అనిపిస్తుంది.మీరు అంగీకరిస్తే మీరు వ్రాసిన ఈ శీర్షికను వ్యాస చరిత్రకు భంగం కలిగించకుండా గంటె భాగవతులు అనే వ్యాసానికి తరలించాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం తెలియజేయండి. ---- కె.వెంకటరమణ 13:28, 30 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ, వ్యాసం యొక్క ప్రారంభకులైన భాస్కరనాయుడు గారు నాయొక్క చర్చాపేజీలో వ్యాస శీర్షిక మార్పుకు తన అంగీకారాన్ని తెలిపారు. అందువలన వ్యాస చరిత్రకు భంగం కలుగకుండా వ్యాసాన్ని గంటె భాగవతులు వ్యాసానికి తరలించితిని.---- కె.వెంకటరమణ 15:08, 30 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతిపాదన

[మార్చు]
మరో ప్రతిపాదన. ఈ ఆశ్రిత కులాల వారి ప్రాచీన జానపద కళల ప్రదర్శనలు ఇంకా అప్పుడప్పుడూ అనుకోకుండా జరుగుతున్నాయి. ఐతే అది కళావేదికలపై కాకుండా ఇంటి ముందుకు వచ్చే భిక్షగాళ్ల రూపంలో ఆ మహాకళాకారులు, కళావేత్తలు ఉంటారు. వారు పాపం తమ పూర్వుల విద్యలను, కళలను ఛాయామాత్రంగా ప్రదర్శిస్తూ భిక్షాటన చేస్తున్నారు. (ఈ మాట గంటే భాగవతులను దృష్టిలో ఉంచుకుని చెప్పట్లేదు-వేలాది కులాలకు వేల సంఖ్యలోనే ఉన్న అనేకానేక ఉపకులాల పరిస్థితి అది. గంటె భాగవతుల స్థితి ఇంకొంత బాగుందో, మరింత దారుణంగా ఉందో నాకు నేరుగా తెలియదు.) మన వికీపీడియన్లు ఎవరి వద్దకైనా అటువంటి వారు వస్తే-అనుకోకుండా అదృష్టవశాత్తూ మీరు గుర్తిస్తే-మరోలా అనుకోకుండా వారి పేరు నోట్ చేసుకుని, వారికి తెలిసిన కొన్ని జానపద విద్యలు, కళలు ప్రదర్శించమని రికార్డ్ చేయండి. అవకాశం ఉన్నవారు వారు తృప్తిపడేందుకు తగ్గట్టు ఎంతో కొంత మొత్తం(అది మనకు చిన్నదే ఐనా పాపం వారి స్థితి వేరు) ఇచ్చి అభినందిస్తే వాళ్లు చాలా ప్రదర్శిస్తారు. అవి వికీలో భద్రపరిస్తే భవిష్యత్తులో ఈ విద్య ప్రదర్శించగలవారు కూడా లేని సమయానికి పరిశోధకులు, కళారాధకులు మనలని తలచుకుని, వికీకి నమస్కరించుకుని ఉపయోగించుకుంటారు. దీనివల్ల సాంఘిక చరిత్రలకు ఎనలేని మేలు జరుగుతుంది. ఇదో పనిగా పెట్టుకోనక్కరలేదు గానీ, అదొక దృష్టి మాత్రం ఉంచుకోండి. నేను కూడా ఇటువంటి ప్రయత్నాలు వీలున్నప్పుడు చేస్తూన్నాను. ముందుగానే అందరికీ ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 09:51, 30 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి ప్రతిపాదన చేసిన పవన్ సంతోష్ గారికి ధన్యవాదాలు. ఆ ప్రతిపాదన ప్రకారం వికీపీడియనులు ఆయన తెలియజేసిన కార్యక్రమంలో పాలుపంచుకుంటే సాంఘిక చరిత్రలకు ఎంతో మేలు జరుగుతుంది.-- కె.వెంకటరమణ 13:28, 30 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]