చర్చ:గొల్లత్తగుడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గొల్లత్తగుడి గురించి[మార్చు]

చంద్రకాంతరావు గారూ, మిమ్మల్ని ఈ వ్యాసం విషయమై చాలా సార్లు అడుగుదామనుకున్నాను, కానీ మర్చిపోతూ వచ్చాను. ఈ గ్రామం గురించి మీకేదైనా సమాచారం ఉన్నదా? ఈ ప్రాముఖ్యత ఉన్న పురావస్తు ప్రదేశం గురించి పెద్దగా ఎక్కడ సమాచారం దొరకటం లేదు. జడ్చర్ల చుట్టూ గూగూల్ శాటిలైటు పటమంతా వెతికినా కనిపించలేదు. --వైజాసత్య (చర్చ) 12:58, 30 డిసెంబర్ 2013 (UTC)

జడ్చర్ల-కల్వకుర్తి మధ్యలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ప్రాంతాలు అనేకంగా ఉండేవి. ప్రస్తుతం చాలా ప్రాంతాలు కాలగర్భంలో కలిసిపోయిననూ వాటి ఆనవాళ్ళు మాత్రం అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఆలవానిపల్లి (ఇప్పటి ఆల్వాన్‌పల్లి, ఇది గొల్లతగుడి సమీపంలోనిదే) లో రాతియుగం నాటి సమాధులు కూడా చరిత్రకారులు కనుగొన్నారు. జైనమతం ఉచ్ఛదశలో ఉన్నప్పుడు ఇక్కడి ప్రాంతాలన్నీ జైనమతస్థులకు పట్టుగొమ్మలుగా ఉండేవట! ఇక్కడి త్రవ్వకాలలో లభించిన జైన విగ్రహాలు పిల్లలమర్రి మ్యూజియంలో కూడా చూశాను. మీరు చెప్పిన గొల్లతగుడి కూడా ఇదే విధంగా ఒకప్పుడు ఉచ్ఛదశలో ఉండేదట! అక్కడొక పెద్ద జైన ఆలయం ఉండేదట! దాని ఆనవాళ్ళే ఇప్పుడు శిథిలరూపంలో కనిపిస్తున్నాయి. జడ్చర్ల నుంచి కల్వకుర్తి వెళ్ళే రహదారిలో గంగాపురం స్టేజి దాటిన వెంటనే రోడ్డుకు కుడిప్రక్కన ఇటుకలతో కట్టిన ఒక ఎత్తయిన కమాన్ శిథిలరూపంలో కనిపిస్తుంది. అదే గొల్లతగుడి జినాలయంగా చెప్పబడుతుంది. పూర్వం ఈ జినాలయం పరిసరాలలో గ్రామం ఉండేదని, మధ్యయుగంలో వచ్చిన సాంస్కృతిక మార్పుల వల్ల గ్రామం మొత్తం ఖాళీ అయినట్లు చెప్పబడుతుంది. ఇది ప్రస్తుతం నిర్జన గ్రామం కాబట్టి దీని వివరాలు ఇప్పటి అధికారిక దస్త్రాలలో కనిపించడం లేదు. గొల్లతగుడి సమీపంలోనే కళ్యాణి చాళుక్యుల ఉప రాజధాని గంగాపూర్ ఉంది. దానికి సమీపంలో మీనాంబరం అనే చారిత్రక ప్రాంతం ఉండేది. అదికూడా నిర్జనప్రాంతంగా మారింది. ఇదే విషయమై రాజశేఖర్ గారు ఇక్కడ అడిగారు. గొల్లతగుడి ప్రాంతంలో ప్రస్తుతం ఒక శిథిల ద్వారం మినహా ఏమీ లేనందున గూగుల్ మ్యాప్‌లో ఎవరూ చేర్చలేరనుకుంటున్నాను. ఇప్పుడు గూగుల్ మ్యాప్‌లో నేను చేర్చాను. 16°45'35"ఉ.అ., 78°12'10"తూ.రే. పై ఇది కనిపిస్తుంది. ఈ ప్రాంతానికి సంబంధించిన పూర్తి వివరాలు సరైన ఆధారాలతో లభ్యం కావడం లేదు. నా వద్ద పాత పేపర్ క్లిప్పింగులలో ఈ సమాచారం ఉంది కాని అది నమ్మశక్యంగా లేదు. బుద్ధుడు, నాగార్జునుడు, హ్యూయాన్‌త్సాంగ్ లాంటి వారు కూడా ఇక్కడికి వచ్చినట్లుగా వ్రాశారు. జైనమతం అభివృద్ధి చెందిన ఈ ప్రాంతానికి వారెందుకు వచ్చారో పరిశీలించాల్సి ఉంది. కాకుంటే త్రవ్వకాలలో నాగార్జునుడి విగ్రహం లభించడం విశేషం. ఈ ప్రాంతాలపై చారిత్రక పరిశోధనలు చేసిన వారి రచనలు పరిశీలించి మరిన్ని వివరాలు వ్యాసంలో పొందుపర్చుటకు ప్రయత్నిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:32, 30 డిసెంబర్ 2013 (UTC)
సమాచారానికి ధన్యవాదాలు. వికీమాపియాలో మీరు చేర్చిన స్థలాన్ని చూశాను. నేను జడ్చర్ల నుండి వచ్చేటప్పుడు ఈ ప్రదేశం రోడ్డుకు ఎడమవైపు నది ఒడ్డున ఉందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది. --వైజాసత్య (చర్చ) 03:11, 31 డిసెంబర్ 2013 (UTC)