చర్చ:జి .వి. ఆర్. శాస్త్రి
స్వరూపం
విషయ ప్రాముఖ్యత
[మార్చు]ఈ వ్యాసంలో మూలాలుగా ఒక లింక్డ్ ఇన్ ప్రొఫైలు, యూట్యూబు వీడియోలు మాత్రమే ఇచ్చి ఉన్నారు. విషయ ప్రాముఖ్యతను నిరూపించడం కోసం మరిన్ని విశ్వసనీయమైన మూలాలు ఇవ్వాలి. లేకపోతే ఈ వ్యాసం వికీలో ఉండదగినదేనా అని నా అభిప్రాయం. - రవిచంద్ర (చర్చ) 13:27, 22 సెప్టెంబరు 2021 (UTC)
- వారు నాకు వ్యక్తిగతంగా బాగా సన్నిహితమైన వారు , వారి గురించి మీడియా ప్రచురించని విషయాలను నేను వికీపీడియా లో చేర్చడం జరిగింది మిస్టర్ ,ఆయన మాటల్లో ప్రస్తావించిన వాటిని గురించి ఆధారాలు ఎక్కడ ఉంటాయి . పలు విషయాలను తెలుసుకొని ఈ వ్యాసం కస్టపడి వ్రాస్తే వికీపీడియాలో తీసేమనటానికి మీకు ఉన్న అర్హత ఏమిటో చెప్పగలరు , D.V.A.CHOWDARY (చర్చ) 15:40, 30 సెప్టెంబరు 2021 (UTC)
- @D.V.A.CHOWDARY గారూ, "వారు నాకు వ్యక్తిగతంగా బాగా సన్నిహితమైన వారు , " అని మీరు రాసారు.
- వికీపీడియాలో చేర్చే ప్రతీ సమాచారమూ నిర్థారించుకోదగ్గదిగా ఉండాలి. ఎవరైనా సరే నిర్థారించుకునే వీలుగా తగు మూలాలనివ్వాలి. ఎక్కడా ప్రచురించని సంగతులను పాఠకులు ఎలా నిర్థారించుకోగలరు?మీరు సరైన సమాచారమే రాసి ఉండవచ్చు.. కానీ అదే పద్ధతిలో మరొకరు "మా ముత్తాతకు రావు బహదూరు బిరుదు వచ్చింది. ఆ సంగతి మానాన్న నాకు చెప్పాడు" అని మరొకరు రాయొచ్చు. దాన్ని నిర్థారించుకునే విధంగా లింకు ఇవ్వక పోతే, ఇవ్వకపోయినా ఆ సమాచారాన్ని వికీపీడియాలో ప్రచురించేస్తే ఇది విజ్ఞాన సర్వస్వమౌతుందా? ఆలోచించండి.
- "వారి గురించి మీడియా ప్రచురించని విషయాలను నేను వికీపీడియా లో చేర్చడం జరిగింది" అని కూడా మీరు రాసారు. అసలు ఎక్కడా ప్రచురించబడని సంగతులను వికీలో రాయనే కూడదు. అది వికీకి మూలాధారమైన నియమాల్లో ఒకటి. అలాంటి సమాచారం మౌలిక పరిశోధన ఔతుంది. మౌలిక పరిశోధన వికీలో నిషిద్ధం. ఆ విధంగా చూస్తే మీరు రాసినది మౌలిక పరిశోధన.
- విషయ ప్రాముఖ్యత కోసం గానీ, వ్యాసంలో రాసిన కంటెంటుకు ఆధారంగా గానీ ఇచ్చే మూలాలు ఎలాంటివి ఉండాలి, ఎలాటివి పనికిరావు అనే విషయం గురించి తెలుసుకునేందుకు వికీపీడియా:మూలాలు, వికీపీడియా:మూలాలను ఎప్పుడు ఉదహరించాలి పేజీతో పాటు అక్కడి నుండి ఉన్న ఉతర లింకులూ చూడండి.
- ఒక వ్యాసాన్ని ఉంచడం, తీసెయ్యడం ఏ ఒక్కరి అభీష్టం మేరకో జరిగేది కాదు. వికీలో కొన్ని నియమాలు, మార్గదర్శకాలూ ఉన్నై. వాటిని అనుసరించి పనిచెయ్యాలి. ఫలానా నియమం ప్రకారం ఉంచాలి లేదా తీసెయ్యాలి అని అభిప్రాయం చెప్పే హక్కు వికీ వాడుకరులందరికీ ఉంది సార్. "తీసేమనటానికి మీకు ఉన్న అర్హత ఏమిట"ని కాకుండా "ఏ నియమం ప్రకారం తీసెయ్యమంటున్నారు" అని అడిగి ఉండాల్సింది మీరు. విషయ ప్రాముఖ్యతకు సంబంధించిన మార్గదర్శకాల గురించి చదవండి. తదనుగుణంగా విషయ ప్రాముఖ్యతను చూపించవలసినది.
- ఈ విషయాలను పరిశీలించి, వ్యాసంలో రాసిన సమాచారాన్ని బలపరచే/నిరూపించే తగు మూలాలను చేర్చి, వ్యాస నాణ్యతను, దాని విశ్వసనీయతనూ పెంచేందుకు చర్యలు తోసుకోవలసినదిగా అభ్యర్థిస్తున్నాను. అలాగే వ్యాసాన్ని మెరుగుపరచడంలో తోటి వాడుకరులతో సహకరించవలసినదిగా కూడా కోరుతున్నాను. ఇతరులు కూడా మనలాగే సద్భావన తోనే పనిచేస్తున్నారని భావించడమనేది, వికీలో ఇతరులతో కలిసి పనిచేయడానికి మొదటి సూత్రం. __ చదువరి (చర్చ • రచనలు) 01:34, 25 అక్టోబరు 2021 (UTC)
- @D.V.A.CHOWDARY గారూ, "వారు నాకు వ్యక్తిగతంగా బాగా సన్నిహితమైన వారు , " అని మీరు రాసారు.