చర్చ:జీవకణం
స్వరూపం
దారి మళ్ళింపులు
[మార్చు]రాజశేఖర్! మీరు చేసిన అనేక దారి మార్పులు సరి కాదనిపిస్తున్నది. బహుశా జీవకణంలోని భాగాలకు వేరే వ్యాసాలు వ్రాసే అవకాశం లేదని మీరు ఇలా చేశారనుకొంటాను. కాని నామాంతరాలకు, రూపాంతరాలకు మాత్రమే దారి మళ్ళింపులు వాడడం కరెక్టు. ఒక వస్తువులో భాగాలు ఆ వస్తువును సూచించవు గదా! ఉదాహరణకు "కాలు" అనే పదాన్ని "మనిషి" వ్యాసానికి దారి మళ్ళించడం సబబు కాదనుకొంటాను. ఇలా చేస్తే ఆ వ్యాసంలో ఇవన్నీ దాదాపు self redirects గా అవుతాయి. అది సముచితం కాదు. "లైసోసోము", "రైసోసోము" వంటి వాటి గురించి ఎవరైనా వెదుకుతున్నారుకోండి. వారు "జీవకణం" అనే వ్యాసాన్ని ఆశించరనుకొంటాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. పునఃపరిశిలించగలరు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:11, 5 మే 2009 (UTC)
- మీరు చెప్పింది కరక్టే. ఈ దారి మల్లింపులు తాత్కాలికమైనవి మాత్రమే. ఒక్కొక్క భాగానికి ఒక పేజీ తయారుచేయవచ్చును. ఉన్న కొద్ది సమాచారంతో అలా చేయడం సబబు కాదని దారి మార్పుచేశాను. మరికొంత సమాచారం చేరిన తర్వాత ఒక్కొక్క భాగాన్ని వేరుచేస్తాను.Rajasekhar1961 13:03, 5 మే 2009 (UTC)
- అలానే కానీయండి. కాని వాటిని ఎర్ర లింకులుగా ఉంచడమే ఉత్తమం అనికొంటాను. మరెవరైనా గాని ఆ వ్యాసాలు వ్రాయవచ్చునని ఆశిస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:32, 5 మే 2009 (UTC)
- నేనే ఆ వ్యాసాలు రాస్తాను. మైటోకాండ్రియా మాదిరిగా మిగిలినవి కూడా విస్తరిస్తాను.Rajasekhar1961 03:58, 9 మే 2009 (UTC)