చర్చ:టంగ్‌స్టన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యర్రా రామారావు గారూ, ఈ వ్యాసంలో మూలకం యొక్క లక్షణాలను తెలియజేసే సమాచారపెట్టే ఉంది కదా. మూలక లక్షణాలు తెలియుచున్నవి కదా. తొలగించే కన్నా "విస్తరణ" మూసను ఉంచితే బాగుంటుందని నా అభిప్రాయం.--కె.వెంకటరమణచర్చ 10:10, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:K.Venkataramana గారూ క్షమించాలి.ఇది ఏదైనా ఒక వస్తువు, పదార్థం, ద్రవం, ద్రావకం, ఇలాంటివాటికి చెందిఉండవచ్చు అని అనుకుంటున్నాను.ఇందులో దేనికైనా, ప్రతి దానికి దాని లక్షణాలు, దాని వలన ఉపయోగాలు, నష్టాలు, వీలుంటే పుట్టుపూర్వోత్తరాలు అనే కనీస వివరాలు (ఎందుకు,ఏమిటి ఎలా,ఎప్పుడు) ప్రతిదానికి ఉంటాయనేది మనందరకు తెలిసిన విషయమే.పైన చెప్పిన వివరాలు ఏమీ ఈ వ్యాసంలో వివరించబడలేదు.ఇలాంటివి విక్షనరీలో ఉండదగినవి.తెలుగు వికీపీడియా నియమాల ప్రకారం ఇలాంటి పేజీలు ఇంతకముందు కూడా తొలగించబడ్డాయి,తొలగించబడుతున్నాయి.ఈ పేజీ వికీ డేటా ఐటం ప్రకారం ఆంగ్ల వ్యాసం పరిశీలించగా అందులో కనీస సమాచారంతో పేజీ ఉంది.వ్యాసంలో తగిన విషయసంగ్రహం ఉన్న తరువాతనే, సమాచారపెట్టెలోని విషయాలకు ప్రాధాన్యత ఉందని నా అభిప్రాయం.ఇలాంటి వ్యాసాలు మున్ముందు కొత్త వాడుకరులకు తప్పుడు సంకేతాలుకు మనమే దారి చూపిస్తున్నామనే అభిప్రాయం కలుగుతుంది.ఏది ఏమైనా ఇలాంటి వ్యాసం పేజీలు నేను సృష్టించినా,ఇతరులు సృష్టించినా తెలుగు వికీపీడియాలో ఉండదగినవి కాదని నా అభిప్రాయం.ఇవి ఉండదగినవి అయితే,ఇంతకముందు వీటికన్నా మంచి పేజీలు తొలగించామా అనే అభిప్రాయం నాకనిపిస్తుంది.వ్యాసం పేజీని, పైన వివరింపబడిన ప్రకారం పేజీ సృష్టించిన గౌరవ వికీపీడియను దీనిపై స్పందించి, పేజీని ఒకవారం రోజులలోపు దానిని అభివృద్ధిపరచాలని కోరుచున్నాను.స్పందన లేని యెడలతొలగించటానికి ప్రతిపాదించటం సమంజసమైన చర్య అని నేను అనుకుంటున్నాను. పొనీ విస్తరణ మూస పెడదామని అనుకుందాం.ఇప్పటికి వర్గం:విస్తరణ కోరబడిన వ్యాసములు వర్గంలో 1350 పేజీలు ఉన్నవి.వీటిని ఎవరు విస్తరించాలి.ఎన్నాళ్లకు ఆ మూసను తొలగించకలుగుతామో చెప్పే పరిస్థితిలేదు.చురుకైన వాడుకరులు,నిర్వాహకులు తక్కువగా ఉన్న పరిస్థితులలో ఇదే సరైన అభిప్రాయం అని నేను భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 18:54, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నా అభిప్రాయాన్ని చర్చ:అయోడిన్ లో తెలియజేసాను. ఇటువంటి మూలక వ్యాసాలను మీరన్నట్లు పేజీ సృష్టించిన గౌరవ వికీపీడియను దీనిపై స్పందించి, పేజీని ఒకవారం రోజులలోపు దానిని అభివృద్ధిపరచాలని కోరుచున్నాను. స్పందన లేని యెడలతొలగించటానికి ప్రతిపాదించటం సమంజసమైన చర్య. ఆవి తొలగిస్తే వేరెవరైనా సృష్టించి అభివృద్ధి పరుస్తారేమో చూడాలి.--కె.వెంకటరమణచర్చ 01:33, 13 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగినది.--కె.వెంకటరమణచర్చ 12:44, 28 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారూ ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 12:54, 28 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]