Jump to content

చర్చ:డ్రాగన్ బాల్ జి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Contested deletion

[మార్చు]

ఈ పేజీని డెలీషన్ కు నామినేట్ చెయ్యడానికి కారణం ఏమిటో నేను తెలుసుకోవచ్చా?--IM3847 (చర్చ) 04:45, 27 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

విషయ ప్రాముఖ్యత (నోటబిలిటీ) లేదని తొలగించబోయారు. అయితే విషయ ప్రాముఖ్యత విషయమై జరిగిన చర్చలో భాగంగా ఇవి ప్రాధాన్యత కలిగినవని నిర్ణయించి ఆ మూస తొలగించారు. మరిన్ని వివరాలకు "కొన్ని వ్యాసాలు, విషయ ప్రాముఖ్యత" అన్న రచ్చబండ విభాగం చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 01:39, 29 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

శుద్ధి సూచనలు

[మార్చు]

మహేష్ గారూ తెలుగు వికీపీడియాలో రాయడం కాస్త కొత్తే అయినా, అనుభవాన్ని మించిన చక్కని శైలిలో రాస్తున్నారు. ఈ వ్యాసంలో శుద్ధి చేయడానికి కొన్ని సూచనలు. ఇవి నేనే చేసేయవచ్చు, కానీ మీకు వివరంగా రాసి మీరు చేస్తే భవిష్యత్తులో మీకు కొత్త వ్యాసాలు అనువదిస్తున్నప్పుడు బాగా పనికివస్తుందని ఇలా వివరిస్తున్నాను:

  • మరియు తొలగించాలి: ఇంగ్లీష్‌లో "And" తెలుగులో మరియుగా అనువదిస్తున్నారు, కానీ ఇది తెలుగుకు అసహజం. మరియు చేసే పని "," (కామా) ఒక్కటీ చేసేస్తుంది. కాబట్టి అన్ని మరియులు తొలగించాలి.
  • యొక్క తొలగించాలి: యొక్క మరీ అసహజం. ఇంగ్లీషులో "Of" వచ్చిన దగ్గర యొక్క పెడుతున్నారని తెలుస్తోంది. "రాడ్జిట్ యొక్క స్నేహితులు" అన్న పదానికి, "రాడ్జిట్ స్నేహితులు" అన్న పదానికి అర్థంలో తేడా ఏముంది?
  • వాక్యాలు విరిచి, చిన్నవి చేయాలి: ఇంగ్లీషులో సంక్లిష్ట వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు ఉంటాయి. వీటిని విరిచి చిన్నవి చేస్తే తెలుగులో వీలుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇలాంటి విదేశీ అంశాల విషయంలో ఈ జాగ్రత్త ఇంకా అవసరం.

అభినందనలతో పవన్ సంతోష్ (చర్చ) 02:04, 29 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సహాయానికి ధన్యవాదములు, నేను ఇంక వ్యాసాలు స్రుష్టించడం ఆపి, నా పాత వ్యాసాలను శుద్ధి చేస్తాను. అవి పూర్తయిన తరువాత కొత్తవి అనువదిస్తాను.IM3847 (చర్చ) 11:45, 30 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]