చర్చ:తిరువేంగడం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇప్పటికే తిరుమల వ్యాసం మంచిస్థితిలో వుంది

[మార్చు]

తిరువేంగడమంటే తిరుమలే. తిరుమల-తిరుపతి గురించి ఎన్నెన్నో వ్యాసాలున్నాయి. మళ్ళీ దీని అవసమేముంది? పైగా ఈ వ్యాసంలోని సమాచారం వికీశైలికి విరుద్ధంగా కనిపిస్తోంది కూడాను. తిరుమల వ్యాసంలోనే అది వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటన్న విషయాన్ని వివరిస్తూ ఓ విభాగం చేరిస్తే చాలునని నా అభిప్రాయం.--పవన్ సంతోష్ (చర్చ) 10:25, 22 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారూ ! తిరిపతి గురించి పలు వ్యాసాలు ఉన్నప్పటికీ ఇక్కడ మరికొన్ని పురాతన మైన విషయాలు ఉన్నాయి. ఇలాంటి విషయాలు మిగిలిన వ్యాసాలలో లేవని అనుకుంటున్నాను. వాటికన్ నగరంతో సమానమని భావించబడుతూ యావద్భారతదేశంలో నగరంగా ఖ్యాతి గాంచిన తిరుమలకు పలు వ్యాసాలు ఉండడం సహజమని భావిస్తున్నాను. ఆధ్యాద్మిక నగరంగా ఇవి తెలుసుకొన తగినవి. ఇది దివ్యదేశాలలలో ఒకటి కనుక దీనికి ప్రత్యేక వ్యాసం అవసరం ఉంది. దివ్యదేశాలన్నంటినీ అనేక మంది యత్రలు చేస్తూ ఉంటారు. దివ్యదేశాలలో భవంతుడు భక్తులకు ప్రత్యక్షం అయ్యాడని కథనాలు వివరిస్తున్నాయి. కనుక వీటికి ప్రత్యేకత ఉంది. ఈ వ్యాసాన్ని వికీకరణ చేయవచ్చు. 108 క్షేత్రాలలో విష్ణుమూర్తికి 108 నామాలు ఉన్నాయి. అలాగే లక్ష్మీదేవికి 108 నామాలు ఉన్నాయి. వేరు, వేరు విమానాలు, పుష్కరుణులు ఉన్నాయి. కనుక వీటికి విడిగా వ్యాసాలు ఉంటేనే కుతూహలం ఉన్న వారు వీటిని ఒకటిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కనుక వీటి వివరణలు పలువురికి ఉపకరించవచ్చు. దీనిని వికీకరణ చేసి దీనిని మంచి వ్యాసంగా తయారు చేయవచ్చు. --t.sujatha (చర్చ) 18:00, 24 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]