Jump to content

చర్చ:తెలుగుతల్లి కెనడా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

సవరణలు

[మార్చు]

ఈ వ్యాసంలో సవరణలు అవసరమా తెలుపగలరు Vimalaprasad g. (చర్చ) 09:34, 26 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Vimalaprasad g. గారూ.. ఈ వ్యాసంలో సవరణలు అవసరవతాయి. అందుకు సంబంధించి వ్యాసంలో విషయ ప్రాముఖ్యత గురించిన మూస చేర్చాను. గమనించగలరు.
  • ఈ వ్యాసంలో మొత్తం ఒక పాఠం మాదిరిగా ఉంది. దానిని వివిధ విభాగాలుగా మార్చి రాయాలి.
  • వికీలోని వ్యాసానికి మూలాలు చాలా ముఖ్యం. మూలాలు లేని వ్యాసాలు తొలగించబడుతాయి. కాబట్టి, తెలుగుతల్లి కెనడా గురించి ఇతర ప్రధాన వార్తాపత్రికలలో ప్రచురితమైన వార్తలను ఈ వ్యాసానికి మూలాలుగా చేర్చాల్సివుంటుంది.
ఇతర వివరాలకోసం నెచ్చెలి వ్యాసాన్ని పరిశీలించి, తెలుగుతల్లి కెనడా వ్యాసంలో సవరణలు చేయగలరు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:48, 29 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు Vimalaprasad g. (చర్చ) 11:02, 29 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగుతల్లి పేరుతో ప్రారంభమైన తొలిపత్రిక గురించి, అనుబంధ సంస్థలు అన్నింటికి కలిపి వ్యాసంగా చేస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 05:32, 30 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే. ధన్యవాదాలు Vimalaprasad g. (చర్చ) 06:57, 30 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. చిన్న సహాయం. వ్యాసంలో చాలా మార్పులు జరిగాయి. నేను ఇవ్వని చాలా లింక్స్ ఇందులో ఉన్నాయి ఇప్పుడు. ఎవరు కలిపారు ఎలా తెలుసుకోగలను. Vimalaprasad g. (చర్చ) 07:08, 30 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Vimalaprasad g. గారూ... వ్యాసంకి కుడివైపున పైన చరిత్ర అనే ట్యాబ్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే వ్యాస చరిత్ర ట్యాబ్ తెరువబడుతుంది. అందులో వ్యాసంలో జరిగిన దిద్దుబాట్లకు సంబంధించిన వివరాలు ఉంటాయి. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:15, 30 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు Vimalaprasad g. (చర్చ) 07:17, 30 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం, మీరు చెప్పినట్లు వ్యాసం సిధ్ధం చేసాను. ఎలా ఉపయోగించాలో తెలుపగలరు. Vimalaprasad g. (చర్చ) 14:33, 28 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారు, నమస్కారం. మీకు ప్రత్యుత్తరం పెట్టాను. సూచనలకు ఎదురుచూస్తున్నాను. Vimalaprasad g. (చర్చ) 14:37, 28 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Vimalaprasad g. గారూ... తెలుగుతల్లి కెనడా చేసిన కార్యక్రమాలకు సంబంధించిన మూలాలు మాత్రమే చేర్చారు. కానీ, వ్యాసం మొదట్లో రాసిన ఉపోద్ఘాతానికి సంబంధించిన మూలాలు చేర్చలేదు. కాబట్టి, తెలుగుతల్లి కెనడా గురించి ఇతర (ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ) ప్రధాన వార్తాపత్రికలలో ప్రచురితమైన ప్రత్యేకమై వార్తా కథనాలను ఈ వ్యాసానికి మూలాలుగా చేర్చగలరు. అంతేకాకుండా, ఈ వ్యాసం గురించి ఏదైనా రాయదలిస్తే ఈ వ్యాసం చర్చాపేజీలోనే రాయగలరని మీకు మారోమారు గుర్తుచేస్తున్నాను. అలాచేయడం వల్ల ఈ వ్యాసానికి సంబంధించిన చర్చ మొత్తం ఒకేచోట ఉంటుంది. గమనించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:10, 1 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు. చర్చ పేజీలో కూడా రాసాను కాని అది ప్రచురణ కాలేదు. నెచ్చెలి వ్యాసంలో ఉన్న ప్రకారం సవరణలు చేయమన్న మీ సూచన ప్రకారం.. నెచ్చెలి వ్యాసంలో ఇతరుల భాగస్వామ్యంలో చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. కాని నెచ్చెలి పత్రిక గురించి వేరే మీడియాలో ప్రచురించిన లింకు లేదు. ఆ విధంగానే తెలుగుతల్లి కార్యక్రమాల లింకులు మాత్రమే పెట్టాను. మీరు చెప్పిన దాని గురించి ప్రయత్నిస్తాను.
వికీ భాష, మిగిలినవి అర్ధం చేసుకుంటూ ముందుకు పోవడం నేర్చుకుంటున్నాను
. ఇంకా కొన్ని వ్యాసాలు రాయాలని ఆశిస్తున్నాను, అందరి సహకారం కోరుతున్నాను. ధన్యవాదాలు. Vimalaprasad g. (చర్చ) 04:18, 2 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Vimalaprasad g. గారూ, తెవికీలో ఇంకా కొన్ని వ్యాసాలు రాయాలనుకుంటున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అయితే, మూలాలు లేని సమాచారం ఈరోజు కాకపోయినా ఏదోఒకరోజు తొలగించబడుతుంది. కాబట్టి, అలాంటిది జరగకుండా ముందే చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం. అందుకే మూలాలు కావాలని అడుగుతున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:13, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్తే, "తెలుగుతల్లి కెనడా గురించి ఇతర (ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ) ప్రధాన వార్తాపత్రికలలో ప్రచురితమైన ప్రత్యేకమై వార్తా కథనాలను ఈ వ్యాసానికి మూలాలుగా చేర్చగలరు." .. ఇటువంటి కథనాలు లేవు. ప్రత్నామయంగా వేరే సూచిస్తే ప్రయత్నిస్తాను. ఇక మీ నిర్ణయం ప్రకారం ఎలా అయితే అలా. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. Vimalaprasad g. (చర్చ) 07:02, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Vimalaprasad g. గారూ, తెలుగుతల్లి కెనడా గురించి ఇతర (ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ) ప్రధాన వార్తాపత్రికలలో ప్రత్యేకమై వార్తా కథనాలు ప్రచురితమయ్యేలా చూసి, వాటిని మూలాలుగా చేర్చగలరు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:26, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు Vimalaprasad g. (చర్చ) 09:05, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రణయ్ రాజ్ వంగరి గారూ, నమస్కారం, మీరు ఇదివరకు చెప్పిన విధంగా తెలుగుతల్లి కెనడా పత్రిక గురించి విశాలాంధ్ర దినపత్రికలో వచ్చిన వార్తా కథన ప్రస్తావనను మూలాలలో చేర్చాను. దయచేసి దానిని సరియైన మూలంగా ఆమోదించి, వ్యాసం పైన మూసను తొలగించవలసిందిగా ప్రార్ధిస్తున్నాను.
వికీపీడియాలో మూలాలు, భాష పరిశీలిస్తూ తదుపరి వ్యాసం తయారుచేసుకుంటున్నాను. ధన్యవాదాలు. Vimalaprasad g. (చర్చ) 08:26, 12 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం, నా వ్యాస సవరణ గురించి అభ్యర్ధన పెట్టాను. స్పందన లేదు. దయచేసి చూడగలరు. Vimalaprasad g. (చర్చ) 05:41, 14 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Vimalaprasad g. గారు, మీరు చేర్చిన మూలాలను సరిచేసి, మూస తొలగించాను. 'వికీపీడియాలో మూలాలు, భాష పరిశీలిస్తూ తదుపరి వ్యాసం తయారుచేసుకుంటున్నాను' అని చెప్పారు కదా, తదుపరి వ్యాసానికి సంబంధించిన సరైన మూలాలు (పత్రికలో ప్రస్తావనలు కాకుండా, వ్యాస విషయంపై పత్రికలో సమగ్ర విషయం ప్రచురితమైనవి) చేర్చాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:14, 14 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే. సూచనమను అనుసరిస్తాను. ధన్యవాదాలు Vimalaprasad g. (చర్చ) 06:40, 14 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]