చర్చ:తెలుగు అకాడమి
Jump to navigation
Jump to search
- మన రాష్ట్రంలో తెలుగు మొదటి అధికారభాష అయితే ఉర్దూ రెండవ అధికారభాష .తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు విడుదలయ్యాయి కానీ 1.తెలుగు-ఉర్దూ నిఘంటువు 2.ఉర్దూ-తెలుగు నిఘంటువు తయారుచేయటానికి తెలుగు అకాడమీ గానీఉర్దూ అకాడమీ గానీ ప్రయత్నమే చెయ్యలేదు.ఈ నిఘంటువులు పరస్పర అవగాహనకు ఉపకరిస్తాయి.--Nrahamthulla 03:09, 13 సెప్టెంబర్ 2008 (UTC)
- రహమతుల్లా గారు! పై వాక్యాలు ఇక్కడ ఉండవచ్చు, కానీ వ్యాసాల్లో సొంత అభిప్రాయాలు ఉండకూడదని తొలగించాను. హిందీకి ఉర్దూకి మధ్య లిపి కాకుండా ఉన్న ముఖ్యమైన తేడాలు ఏంటో కొన్ని వివరించగలరా? δευ దేవా 06:33, 13 సెప్టెంబర్ 2008 (UTC)
- అసలు భాష ఒకటే అది హిందుస్తానీ . కావాలని దాన్ని హిందీ ఉర్దూ భాషలుగా చీల్చారు.ఇది భాషా వేర్పాటువాదుల కుట్ర, తీవ్రవాద ఫలితం హిందీ ,సంస్కృతము, పర్షియన్,అరబిక్,టర్కిష్ పదాలు కలిసి ఉర్దూ భాష ఇండియా లోనే పుట్టింది. మామూలు హిందీ ఉర్దూ ప్రజలిద్దరికీ వాడుక భాష మటుకు ఒకటే హిందుస్తానీ . హిందీ సినిమాలలో ఈ హిందుస్తానీ భాషే రాజ్యమేలుతోంది. హిందీ, ఉర్దూ ఒకటే భాష. బడాయి కిపోయే కొందరు పండితులు వారి వారి మతాల ప్రత్యేకగుర్తింపు కోసం హిందుస్తానీ కి సంస్కృతపదాలు ఎక్కువ కలిపితే హిందీ గానూ, ఫారశీ పదాలు ఎక్కువగా కలిపితే ఉర్దూ గానూ మారుతుంది.ఈ రెండు భాషలకూ సొంతలిపులు లేవు. అరువుతెచ్చుకున్న దేవనాగరి పర్షియన్ లిపుల్లో వ్రాస్తారు.ఈ రెంటినీ ఇంగ్లీషు లిపిలో రాస్తే ఒకే భాషగా తేల్తాయి.ఉర్దూ అంటేనే సంతలో జనం మాట్లాడే సామాన్య భాష..పార్లమెంటులో అధికారభాషను ప్రకటించే విషయంలో జరిగిన ఓటింగ్ లో హిందీ ఉర్దూ భాషలకు సమానంగా ఓట్లొచ్చాయి, రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ గారు వేసిన ఒక్క అనుకూల ఓటుతో హిందీ భాష ఆమోదం పొందింది.వాస్తవానికి ప్రజలు ఎవరూ హిందుస్తానీ భాషను మార్చుకోలేదు.కేవలం ఫార్శీ లిపిని ఓడించి ,దేవనాగరి లిపిని గెలిపించి, హిందీ అనే కొత్తభాషను అధికారభాషగా చేశామనుకున్నారు.హిందుస్తానీ లేని హిందీ గానీ ఉర్దూ గానీ ప్రజలదగ్గర చెల్లదు.శ్రీశ్రీ చెప్పినట్లు ఇండియా మొత్తానికీ ఇంగ్లీషు లిపినే వాడే రోజురావాలి.--Nrahamthulla 10:05, 13 సెప్టెంబర్ 2008 (UTC)
- రహమతుల్లా గారూ, ధన్యవాదాలు. ఆంగ్లవికీలోని హిందుస్థానీ వ్యాసాన్ని అనువదిద్దామా? δευ దేవా 12:11, 13 సెప్టెంబర్ 2008 (UTC)
తెలగు అకాడమీ తొలగించాలి
[మార్చు]విషయం తెలుగు అకాడమి లోకి మార్చాను. అది సరియైన పేరు (అకాడమి ప్రచురణలలో వాడిన). ఈ పేజీని తొలగించాలిఅర్జున 17:59, 30 డిసెంబర్ 2008 (UTC)