చర్చ:ధూళికట్ట
స్వరూపం
Untitled
[మార్చు]ధూళికట్ట ఎలిగేడు మండలంలోనూ, జూలపల్లి మండలంలోనూ ఉన్నాయి. గూగుల్ సెర్చ్ చేస్తే జూలపల్లి మండలం లోని దూలికట్ట కూడా బౌద్ధప్రాంతమే నని, అక్కడా బౌద్ధస్థూపం ఉందని పత్రికలలో ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. రెండూ బౌద్ధప్రాంతాలేనా? పత్రికల పొరపాటా? సి. చంద్ర కాంత రావు- చర్చ 16:22, 1 డిసెంబర్ 2012 (UTC)
- రెండూ ఒకే గ్రామం గురించి ప్రస్తావిస్తున్నవి. ఎలిగేడు వ్యాసం చదివితే అందులో ఈ మండలం 2002లో కొత్తగా జూలపల్లి మండలంలోని కొన్ని గ్రామాలతో ఏర్పడిందని తెలుపుతున్నది. అంతకు ముందు ఈ ఊరు జూలపల్లి మండలంలో ఉన్నదన్నమాట --వైజాసత్య (చర్చ) 03:53, 2 డిసెంబర్ 2012 (UTC)
- మీరన్నది నిజమే కావచ్చు. మండలాల అవతరణ సమయంలో 56 మండలాలుండగా ఎలిగేడు 57వ మండలంగా తర్వాత ఏర్పడింది. ఇది 2001 జనాభా లెక్కల తర్వాత ఏర్పడింది కాబట్టి 2001 జనాభా వివరాలలో ఎలిగేడు మండలం లేదు. ఈ గ్రామ జనాభా చేరుద్దామని నేను నా వద్దనున్న కరీంనగర్ జిల్లాకు చెందిన గ్రామాలను చూస్తే ధూళికట్ట జూలపల్లి మండలంలో కనిపించింది. అది మరో ధూళికట్ట అనుకున్నాను. ఇది రెవెన్యూ గ్రామం కాకపోవచ్చనుకున్నాను. గూగుల్ సెర్చ్ చేస్తే కొన్ని పత్రికలలో జూలపల్లి మండలంలో ఉన్నట్లుగా ఇచ్చారు. అసలు సంగతి ఇదన్నమాట. సి. చంద్ర కాంత రావు- చర్చ 10:14, 2 డిసెంబర్ 2012 (UTC)