ధూళికట్ట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ధూళికట్ట కరీంనగర్ జిల్లా ఎలిగెడ్ మండలం లోని గ్రామము. పిన్ కోడ్ : 505525. ఇది హుస్సేనివాగుకు కుడి ఒడ్డున కరీంనగర్ కు 20 కిమీ దూరంలో[1] ఉన్న చారిత్రాత్మకమైన గ్రామము. 2001 జనాభా లెక్క ల ప్రకారం గ్రామ జనాభా 3511. మండలాల అవతరణ సమయంలో ఇది జూలపల్లి మండలంలో భాగంగా ఉండేది. 2002లో ప్రత్యేకంగా ఎలిగేడు మండలం ఏర్పడినప్పుడు ఈ గ్రామాన్ని కొత్త మండలంలో కలిపారు. ప్రతి సంవత్సరం ఇక్కడ మూడు రోజుల పాటు శాతవాహనోత్సవం కూడా జరుగుతుంది. ధూళికట్ట బౌద్ధ క్షేత్రం ఊరికి ఉత్తరాన మూడు కిలోమీటర్ల దూరంలో హుస్సేనీవాగుకు ఆవతలి ఒడ్డున ఉన్నది. గ్రామం నుండి బౌద్ధ క్షేత్రానికి పక్కా రోడ్డు లేనందువళ్ల, కేవలం ఎద్దులబండిలోనే అక్కడికి చేరుకొనే అవకాశముంది.[2]

చరిత్ర[మార్చు]

ధూళి కోట (మట్టి కోట) కాలక్రమంలో ధూళికట్టగా అపభ్రంశమైందని భావిస్తున్నారు. ఇది శాతవాహనుల కాలంనాటి ఆవాసము. మెగస్తనీసు ఇండికాలో ప్రస్తావించిన ఆంధ్రుల యొక్క ముప్పై కోటలలో ధూళికట్ట ఒకటని శాసనాధారాల వళ్ల తెలుస్తున్నది.[3] పురావస్తు త్రవ్వకాలలో ఇక్కడ చెవిదుద్దులు, శంఖు గాజుముక్కలు, దంతపు దువ్వెన, స్త్రీబొమ్మ లభించాయి.[4] ఇక్కడ నివసించిన ప్రజల మతపద్ధతులకు సంబంధించి మాతృదేవత, యక్షుల శిల్పాలు తప్ప పెద్దగా ఆనవాళ్ళు దొరకలేదు. బౌద్ధస్థూపాలు బయల్పడే వరకు ఇది ఒక చిక్కుముడిగా ఉండేది. 1975-76లలో పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో ఇక్కడ శాతవాహనుల కాలం నాటి కోటలు, బౌద్ధస్థూపం బయటపడ్డాయి. నాగముచుకుంద నాగశిల్పం కూడా లభించింది.[5]

ధూళికట్ట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండలం ఎలిగేడు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,895
 - పురుషుల 1,957
 - స్త్రీల 1,938
 - గృహాల సంఖ్య 1,114
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామజనాబా[మార్చు]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

జనాభా[మార్చు]

2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3511. ఇందులో పురుషులు 1757, మహిళలు 1754. గ్రామంలో కుటుంబాల సంఖ్య 930.[6]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. శ్రీసాయిధాత్రి పర్యాటకాంధ్ర, 2009 ప్రచురణ, పేజీ 366
  2. Buddhist stupa damaged for treasure - The Hindu December 6, 2011
  3. Forts of Āndhra Pradesh: from the earliest times upto 16th c. A.D.
  4. నమస్తే తెలంగాణ పత్రిక, తేది 03.07.2011 పేజీ 3
  5. శతవసంతాల కరీంనగర్ (1905-2005), మానేరు టైమ్స్ ప్రచురణ, పేజీ 95
  6. Dist Census Handbook, Karimnagar Dist, 2001
"https://te.wikipedia.org/w/index.php?title=ధూళికట్ట&oldid=1555291" నుండి వెలికితీశారు