సుల్తాన్‌పూర్ (ఎలిగేడ్)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

సుల్తాన్‌పూర్, కరీంనగర్ జిల్లా, ఎలిగేడు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ : 505525. ఈ గ్రామములో ప్రాథమిక, సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. ఈ గ్రామములోని పాఠశాలకు పక్క గ్రామము లైన శివపల్లి, బుర్హమియాపేట్ నుండి కూడా విద్యార్థులు వస్తారు.

సుల్తాన్ పూర్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండలం ఎలిగేడు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,474
 - పురుషుల సంఖ్య 1,708
 - స్త్రీల సంఖ్య 1,766
 - గృహాల సంఖ్య 903
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మూలాలు[మార్చు]

ఈ గ్రామము కరీంనగర్ జిల్లాలోని ఎలిగేడు మండలములో ఉంది. ఈ సుల్తాన్ పూర్ గ్రామములోని ప్రజలు ఎక్కువగా వ్యవసాయము పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.ఎటుచూసినా పచ్చని పొలాలతో కలకలలాడుతుంది.

ఈ గ్రామము గుండా శ్రీరాంసాగర్ కెనాల్ ప్రవహిస్తుంది. దీని నీరే ఈ గ్రామములోని పంటలకు ఆధారము మరియు ఈ నీటిని నిల్వ చేయడానికి రెండు చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లోని నీటిని కెనాల్ రానప్పుడు పంటలు పండించడానికి ఉపయోగిస్తారు. దీని యొక్క పుణ్యము వలన సుల్తాన్ పూర్ గ్రామము సంపన్న గ్రామముగా పేరుగాంచింది. ఏటా కొన్ని వేల బస్తాల వడ్లు ఈ గ్రామము నుండి ఎగుమతి అవుతాయి. ఈ గ్రామము అన్ని రకాల పంటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వరి ఎక్కువగా పండిస్తారు.అంతేకాకుండా మొక్కజొన్న,పల్లి,ప్రత్తి మరియు అన్ని రకాల కాయగూరలు పండిస్తారు. పంటలు పండించడములో ఎన్నో రకాల అధునాతన పద్ధతులను అవలంబిస్తారు ఇక్కడి ప్రజలు. వరి ఉత్పత్తిలో ఈ గ్రామము మండలములోని ఇతర గ్రామాలకంటే ముందజలో ఉంది. అందుకే ఈ గ్రామము "అన్నపూర్ణ గ్రామము"గా పిలవబడుతుంది. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ గ్రామానికి వచ్చి తమ సందేహాలను తీర్చుకుంటారు.

2001 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామము యొక్క జనాభా 5000 పైచిలుకు వుంటుందని అంచనా. ఇప్పటి వరకు ఎంతో మంది మహానుభావులు, స్వతంత్ర సమరయోధులు ఈ గ్రామములో జన్మించారు. భిన్నత్వములో ఏకత్వమునకు ఈ గ్రామము పేరుగాంచింది. ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో ప్రగతిని సాధిస్తున్నది.ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయము మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు.ఇక్కడి వెలసిన ప్రాథమిక ఉన్నత పాఠశాల ఎంతో మంది విద్యావంతులను తీర్చిదిద్దింది. ఈ పాఠశాల కేవలం సుల్తాన్ పూర్ విద్యార్థులనే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల్లోని విద్యార్థులను కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దుతుంది. ఈ పాఠశాలలో చదివిన వారిలో కొంతమంది సొంతవూరిపై మమకారంతో వ్యవసాయము మరియు వారివారి కులవృత్తులను చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇంకొంతమంది ఉన్నత విద్యలను అభ్యసించి పట్టణాల్లో పలురకాల ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు.

ఈ గ్రామానికి ఇప్పటివరకు 5గురు సర్పంచ్ లుగా ఎన్నుకోబడ్డారు. వారి పేర్లు.

  1. వూర మల్లారావు.
  2. తానిపర్తి కాంతారావు.
  3. కళ్లెం లక్షణ్.
  4. కాటం సత్తయ్య.
  5. కొండ తిరుపతి.
  6. తానిపర్తి సునీత సుధాకర్ రావు .

ఈ గ్రామాన్ని తెలుగుదేశం నేతలు అయిన కీ.శే.నందమూరి తారక రామారావు గారు మరియు నారా చంద్రబాబునాయుడు సందర్శించారు.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,474- పురుషుల సంఖ్య 1,708 - స్త్రీల సంఖ్య 1,766 - గృహాల సంఖ్య 903

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=03