శ్రీరాంసాగర్ ప్రాజెక్టు

వికీపీడియా నుండి
(శ్రీరాంసాగర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
Sri Ram Sagar Project (Pochampahad).jpg
Sri Ram Sagar Dam (Pochampadu Dam)
ప్రదేశంబాల్కొండ మండలం, నిజామాబాదు జిల్లా, తెలంగాణ
అక్షాంశ,రేఖాంశాలు18°58′03″N 78°20′35″E / 18.96750°N 78.34306°E / 18.96750; 78.34306Coordinates: 18°58′03″N 78°20′35″E / 18.96750°N 78.34306°E / 18.96750; 78.34306
నిర్మాణం ప్రారంభం1963
ప్రారంభ తేదీ1977
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుగోదావరి నది
ఎత్తు43 metres (141 ft) from river level
పొడవు15,600 metres (51,181 ft)
జలాశయం
మొత్తం సామర్థ్యం3,172,000,000 m3 (2,571,582 acre⋅ft)
క్రియాశీల సామర్థ్యం2,322,000,000 m3 (1,882,476 acre⋅ft)[1]
ఉపరితల వైశాల్యం451 kమీ2 (4.85×109 చ .అ)
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు

గోదావరి నదిపై నిజామాబాదు జిల్లా బాల్కొండ మండలములో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉంది.[2] దీని పూర్వపు పేరు పోచంపాడు ప్రాజెక్టు. గోదావరినదిపై తెలంగాణలో ఇది మొట్టమొదటి ప్రాజెక్టు. మహారాష్ట్రలోని జైక్వాడి ప్రాజెక్టు తరువాత గోదావరి నదిపై దీనిని నిర్మించారు. రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరు సరఫరా చేసే ప్రాజెక్టు ఇది. దీనికి కాకతీయ కాల్వ, సరస్వతి కాల్వ, లక్ష్మీ కాల్వ అనే మూడు కాల్వలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల నిజామాబాదు జిల్లా కంటే ఇతర జిల్లాలకే అధికలాభం చేకూరినది.[3] 1963లో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రారంభంలో కేవలం నీటిని నిల్వచేసి నీటిపారుదలకు ఉపయోగపడే జలాశయం గానే ఉండేది. 1983 తర్వాత నందమూరి తారక రామారావు ప్రభుత్వ హయంలో ఈ ప్రాజెక్టును విస్తరించి జల విద్యుత్ ఉత్పాదన సంస్థగా అభివృద్ధి చేశారు. ఈ రిజర్వాయర్‌ యొక్క పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీల

Map

భౌగోళిక ఉనికి[మార్చు]

ప్రాజెక్టు పరిసరాలు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయం

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జిల్లా కేంద్రమైన నిజామాబాదు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 7 వ నెంబరు జాతీయ రహదారి నుండి 5 కిలోమీటర్లు లోనికి ఉంది. ఆదిలాబాదు జిల్లా నిర్మల్ పట్టణం నుండి దీని దూరం 20 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు 18°58' ఉత్తర అక్షాంశం, 78°19' తూర్పు రేఖాంశం పై ఉంది.

ప్రారంభం[మార్చు]

శ్రీరాంసాగర్ ప్రాజెక్టును 1963లో అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు. ప్రారంభంలో ఇది కేవలం నీటిపారుదల ప్రాజెక్టుగానే సేవలందించగా, రెండు దశబ్దాల అనంతరం నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి హయాంలో ఈ ప్రాజెక్టు విద్యుదుత్పాదన ప్రాజెక్టుగా అవతరించింది.

ప్రాజెక్టు దిగువన గోదావరి పుర్ష్కరాల సందర్భంలో జన సమూహము

జలాశయ సామర్థ్యం[మార్చు]

ప్రాజెక్టు దివువున... గోదావరి పుష్కరాల సందర్భముగా పితృదేవులకు పిండ ప్రధానమిచ్చు దృశ్యము
  • శ్రీరాంసాగర్ జలాశయపు నీటిమట్టం గరిష్ఠ ఎత్తు 1091 అడుగులు,
  • జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 90 శత కోటి ఘనపుటడుగులు
  • ఈ ప్రాజెక్టునకు మొత్తం 42 వరద గేట్లు ఉన్నాయి.
  • ఈ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరాఆయె కాలువలు: కాకతీయ కాల్వ, సరస్వతి కాల్వ, లక్ష్మి కాల్వ, వరద కాల్వ.
  • విద్యుదుత్పత్తి సామర్ద్యం ౨౭ మెగావాట్లు, మూడు టర్బయిన్‌ల సహాయంతో కాకతీయ కాలువకు నీటి విడుదలచేస్తారు.

కామారెడ్డి ఎత్తిపోతల పథకము[మార్చు]

పుష్కరాల స్నానంతరము
గోదావరి పుష్కరాల సందర్భములో పుణ్య స్నానలకు వచ్చిన జన సమూహము

నిజామాబాదు జిల్లా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 83 గ్రామాలకు తాగునీటిని అందించడానికి శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా అందించడానికి రూ. 140 కోట్లతో ఒక పథకాన్ని చేపట్టనున్నారు. దీని ద్వారా కామారెడ్డి, తాడ్వాయి, సదాశివ నగర్, దోమకొండ, బిక్నూరు, మాచారెడ్డి మండలాలకు తాగునీటు అందుతుంది. ఈ పథకం పూర్తి కావడానికి సుమారు 520 కిలో మీటర్ల పైప్ లైన్ వేయాల్సి ఉంటుంది. దీని ద్వారా సుమారు 5 లక్షల మందికి తాగునీరు లభిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. "India: National Register of Large Dams 2012" (PDF). Central Water Commission. మూలం (PDF) నుండి 20 August 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 26 August 2014. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
  2. ఈనాడు. "శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు". మూలం నుండి 27 July 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 28 July 2018. Cite news requires |newspaper= (help)
  3. నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 36