దోమకొండ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దోమకొండ
—  మండలం  —
నిజామాబాదు జిల్లా పటములో దోమకొండ మండలం యొక్క స్థానము
నిజామాబాదు జిల్లా పటములో దోమకొండ మండలం యొక్క స్థానము
దోమకొండ is located in Telangana
దోమకొండ
దోమకొండ
తెలంగాణ పటములో దోమకొండ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°15′13″N 78°26′16″E / 18.253562°N 78.437662°E / 18.253562; 78.437662
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు
మండల కేంద్రము దోమకొండ
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 56,939
 - పురుషులు 28,000
 - స్త్రీలు 28,939
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.87%
 - పురుషులు 66.28%
 - స్త్రీలు 35.74%
పిన్ కోడ్ 503123

దోమకొండ, తెలంగాణ రాష్ట్రములోని నిజామాబాదు జిల్లా/ ప్రస్తుతం కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 503123.

దోమకొండ కోట[మార్చు]

దోమకొండ ప్రధాన రహదారి నుండి 6 కిలోమీటర్ల దూరములో, కామారెడ్డి నుండి 18 కిలోమీటర్ల దూరములో ఉంది. దోమకొండ కుతుబ్‌షాహీలు మరియు అసఫ్‌జాహీల పాలనలో సంస్ధానముగా ఉంది. దోమకొండ సంస్ధానపు రెడ్డి రాజులు 18వ శతాబ్దంలో పూర్వం కోట ఉన్న స్థలం లోనే ఈ కోటను నిర్మించారు. కోటలోన మహాదేవుని ఆలయం ఉంది.[1] కొట యొక్క ప్రధాన ముఖద్వారము అసఫ్‌జాహీల నిర్మాణ శైలికి అద్దంపడుతున్నది. కోట చుట్టూ చదరపు మరియు వృత్తాకార బురుజులు కట్టబడినవి. కోట లోపల రెండు మహల్లు మరియు దేవాలయ ప్రాంగణము ఉన్నాయి. కోటలోని శివాలయము కాకతీయ శైలిని అనుకరించి ఆగమశాస్త్ర యుక్తముగా నిర్మించబడింది. ఈ కోట తెలంగాణా ప్రాంతపు సంస్థానాల యొక్క రక్షణ కట్టడాల శైలికి ఒక మంచి ఉదాహరణ.

శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయము[మార్చు]

శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయము తెలంగాణలొ కల్లా ఏకైక దేవాలయము నిజామాబాద్ జిల్లా దోమకొండ గ్రామములో కలదు పురాతన దేవాలయము ఈ దేవాలయమును కామినేని వంశస్థులు రెడ్డి రాజులు నిర్మంచారు ఈ దేవాలయములో చాల ఉత్సవములు జరుగును ఆషాడమాసంలొ బోనాల పండగ ప్రతి ఇంటి నుండి బోనాలు అమ్మవారికి సమర్పించెదరు,

దసరా ఉత్సవములు అత్యంత వైభవముగా శరన్నవ రాత్రోత్సవములు ప్రతి రోజు ఛండిహవణము పారాయణములు జరుగును 2011 సంవత్సరములో రావులపల్లి నర్సారెడ్డి గారి అద్యక్షతన కార్యక్రమములు జరిగాయి.

ప్రాధాన అర్చకులు బావి కృష్ణమూర్తి శర్మ గారి పర్యవేక్షణలో శరత్ చంద్ర శర్మ కార్యక్రమములు నిర్వహించును.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు సుపరిచితులైన పుట్ట శ్రీనివాస్ రెడ్డి ఇదే మండలం లోని సీతారాంపూర్ లో పనిచేస్తున్న ఈ మండల వాస్తవ్యుడు. వీరు ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని నడిపినారు మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండల గణాంకాలు[మార్చు]

మండల కేంద్రము దోమకొండ
గ్రామాలు 20
ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
జనాభా (2011) - మొత్తం 56,939 - పురుషులు 28,000 - స్త్రీలు 28,939
అక్షరాస్యత (2011) - మొత్తం 50.87% - పురుషులు 66.28% - స్త్రీలు 35.74%

గ్రామాలు[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

గ్రామ జనాభా[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=02

మూలాలు[మార్చు]

  1. నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 41


"https://te.wikipedia.org/w/index.php?title=దోమకొండ&oldid=2097847" నుండి వెలికితీశారు