చర్చ:పులి కంకణము బాటసారి కథ
స్వరూపం
సరియైన స్థానం
[మార్చు]కథల పుస్తకాల గురించి విశ్లేషణ చేయవచ్చు కాని కథలు, కథనాలు కూడా తెవికీలో వ్రాయవచ్చా? ఇంకనూ అభివృద్ధి దశలోనే ఉన్న తెవికీలోఈ అవకాశం ఉంటే దిద్దుబాట్లు పెంచుకోవాలనే సభ్యులు ఒక్క కథల పుస్తకం సహాయంతో వేలాది దిద్దుబాట్లు సునాయాసంగా చేయవచ్చు, చేస్తారు కూడా. కథలు విజ్ఞానానికి సంబంధించినవి కావు కాబట్టి ఇప్పుడే ఈ అవకాశం ఉండరాదు, అసలు లేదు కూడా. కొత్త సభ్యులకు నియమాలు చెప్పాల్సిన నిర్వాహకులే ఈ మార్గం అనుసరిస్తే తెవికీలో విజ్ఞానదాయక విషయాలపై వ్యాసాలను వ్రాసేవారు ఎవరూ మిగలకపోవచ్చు. 106.66.47.57 17:16, 14 ఫిబ్రవరి 2013 (UTC)
- కథలు తెలుగు వికీపీడియాలో ఉండకూడదని నియమమేమీ లేదని చేర్చాను. తెలిసినవారు చెప్పండి. తీసేస్తాను.Rajasekhar1961 (చర్చ) 06:29, 15 ఫిబ్రవరి 2013 (UTC)
- ఇప్పటి వరకూ కధలు చేర్చలేదు కదా. అలా చేర్చే ప్రయత్నం మొదలైతే చాలా కధలు ఉంటాయి. కనుక చిన్నగా నీతి చంద్రిక వ్యాసంలోనే దానిలోని కధలు వ్రాయడం బావుంటుంది అని నా అభిప్రాయం.విశ్వనాధ్ (చర్చ) 08:11, 16 ఫిబ్రవరి 2013 (UTC)
- విశ్లేషణ వికీలో వుంచడం మంచిది. కథల మూలాన్ని స్వేచ్ఛానకలుహక్కలు గలవైతే వికీసోర్స్ లో స్వంత కృతులయితే వికీబుక్స్ లో చేర్చటం మంచిది. రాజశేఖర్ గారు వికీసోర్స్ లో చేర్చారు కనుక, ఈ వ్యాసం తొలగించడం మంచిది.--అర్జున (చర్చ) 12:38, 16 ఫిబ్రవరి 2013 (UTC)